హైదరాబాద్

మహిళలు రాజ్యాంగ హక్కులు తెలుసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: పురాణ కాలంలో స్ర్తికి ఎంతో గౌరవం వుండేదని, మహిళలను దేవతామూర్తిగా పూజించేవారని, ఆ కాలాన్ని స్వర్ణయుగంగా మేధావులు అభివర్ణించారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వామన్‌రావు అన్నారు. 19వ శతాబ్దంలో కూడా స్ర్తికి గౌరవం వుండేది. ఆ తరువాత కాలంలో బాల్య వివాహాలను అరికట్టి వితంతు వివాహాలను ప్రోత్సహించిన వీరేశలింగం పంతులను గుర్తుచేసారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వామనరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. చదువులేని మహిళలకు శిక్షణ అవసరమని, దానితో తనను తాను రక్షించుకోడానికి రాజ్యాంగంలోని హక్కులను తెలుసుకోవాలని, ఆ హక్కులను అనుభవించాలన్నా, తెలుసుకోవాలన్న విద్య అవసరమన్నారు. శిక్షణ పొందిన మహిళలకు అవినీతిపరులను పట్టుకోవడానికి గట్టి శిక్షణ ఇచ్చాము. రాజ్యాంగ హక్కులను మహిళలు తెలుసుకోవాలని ఏసిబి డిజి ఎ.కె.ఖాన్ అన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ మాట్లాడుతూ, 2030 సం.నికి మహిళలు, పురుషులు సమానమే అనే స్థాయికి తీసుకువెళ్లాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసిందని, ఆ దిశగా అందరూ పయనించాలని అన్నారు.
కార్యక్రమంలో సైంటిస్ట్ సుజాతఘోష్, ప్రొ. నిర్మలా బాబూరావు, డా. మహ్మద్ అసిమ్, జూపల్లి మంజుల పాల్గొనగా, ఇరవై నాలుగు మందికి మహిళా శిరోమణి పురస్కారాలు ప్రదానం చేసారు.