అక్షర

కానె్వంటు పిల్లలకు మంచి కానుక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదరాసి పెద్దమ్మ కథలు
-ఎ.ఎన్.జగన్నాథశర్మ
వెల: రు.175/-
ప్రచురణ:- అమరావతి పబ్లికేషన్స్
4-21-81, చైతన్యపురి
సాయిబాబా రోడ్డు
గుంటూరు- 522007
సెల్: 9291530714

పు స్తకం ఆకర్షణీయంగా ఉంది. పుస్తకంలో ఉన్న 27 పేదరాసి పెద్దమ్మ కథలకూ వేయించిన బొమ్మలు బాగున్నాయి. ఇంగ్లీషు మీడియం పిల్లలు కూడ చదువుకోవటానికి వీలుగా పెద్ద అక్షరాలలో అచ్చువేశారు. బాగుంది. ముఖ చిత్రం మరీ బాగుంది.
రచయిత జగన్నాథశర్మ ‘నవ్యవీక్లీ’ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా, టి.వి. రచయితగా కూడా ప్రసిద్ధులు.
మొట్టమొదటి కథలో పేదరాసి పెద్దమ్మను పరిచయం చేసిన విధానం బాగుంది. ఆమె తెలివితేటలను ఊహించుకోటానికి వీలుగా చివరి కథను ముగించటం కూడ బాగుంది.
పుస్తకంలో ప్రత్యేకంగా చెప్పుకోతగినది ‘అంతులేని కథ’. అల్లుడు కనిపిస్తే చీమలకథ చెబుతాడని భయపడుతూ, అతని కంటికి కనిపించకుండా దాగుంటున్నాడు చిత్రసేన మహారాజు- అని ఈ కథను ముగించారు.
విధి బలీయం అని తెలియజేసే ‘రత్నమాల’ కథలో కల్పనాచాతుర్యం బాగుంది. పెద్దకథ అయినప్పటికీ విసుగుపుట్టించకుండా చదివింపజేస్తుంది.
కథలలో రాజకుమారులు, మాంత్రికులు, రాక్షసులూ కన్పిస్తుంటారు. మాట్లాడే పక్షులు, జంతువులు కూడ ఉన్నాయి.
పరిపాలన చెయ్యటం మానేసి పనికిమాలిన ఆలోచనలు చేస్తున్న రాజుకు, రాజగురువు బుద్ధిచెప్పటం ‘గుణపాఠం’ కథలో కనిపిస్తుంది. ఈ కాలంలో అటువంటి రాజగురువులు లేకపోవటంవల్లనే ప్రజాస్వామ్యం వెర్రితలలు వేస్తున్నది.
ప్రశ్నకు సమాధానం చెప్పటంకోసం ఏ విధంగా ఊహించాలో ‘సుకుమారి’ కథ తెలియజేస్తుంది. కథ చివరలో సమాధానం ఏమిటనేది తెలియజేశారు. అయితే ఇందుకు భిన్నంగా ఉన్నది ‘మదయంతి’ కథ. ఈ కథను పేదరాసి పెద్దమ్మ వేసిన ప్రశ్నతో ముగించారు. సమాధానం ఏమిటనేది పాఠకులు ఊహించాలి.
రోజురోజుకూ తెలుగును మరచిపోతున్న ఈనాటి కానె్వంటు పిల్లలకు ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది.

-ఎం.వి.ఎస్.