జాతీయ వార్తలు

అవినీతికి పాల్పడితే ఆస్తుల జప్తు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నతాధికారులకు ‘ఆప్’ సర్కారు హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబర్ 30: అవినీతికి పాల్పడే ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదిత జన లోక్‌పాల్‌కు విస్తృత అధికారాలు కల్పించింది. అవినీతి కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్న అధికారుల ఆస్తులను జప్తుచేసి వాటిని స్వాధీనం చేసుకునేందుకు జన లోక్‌పాల్ బిల్లులో ప్రత్యేక నిబంధనను చేర్చింది. జన లోక్‌పాల్‌కు ఇబ్బందులు ఎదురవకుండా నిరోధించేందుకు సివిల్ కోర్టుతో సమానంగా అధికారాలు కల్పించింది. దీంతో అవినీతికి పాల్పడిన అధికారులను ప్రాసిక్యూట్ చేయడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేసేందుకు, స్వాధీనం చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే తప్పుడు ఫిర్యాదులు దాఖలు చేసిన వారికి ఏడాది వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం స్పష్టం చేసింది.