జాతీయ వార్తలు

కోర్టుల్లో తేల్చుకోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టం ముందు అందరూ సమానమే
పార్లమెంట్‌లో రభస వద్దు
సోనియా, రాహుల్‌కు జైట్లీ హితవు

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రాణి’ చట్టానికి జవాబుదారీతనం వహించబోదనే పద్ధతిని భారత్ ఎన్నడూ అంగీకరించలేదని పరోక్షంగా సోనియాగాంధీపై దాడికి దిగారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో రభస చేయించడానికి బదులు తమపై వచ్చిన అభియోగాలపై న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడలేదని ఆయన సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోనియా, రాహుల్ పేర్లను ఆయన నేరుగా ప్రస్తావించకుండానే కాంగ్రెస్ నాయకులు తమకోసం పార్లమెంట్‌లో రభస సృష్టించారని జైట్లీ ధ్వజమెత్తారు. పన్ను మినహాయింపు పొందిన రాజకీయ పార్టీ నిధులను రియల్ ఎస్టేట్ కంపెనీకి తరలించారని ఆయన ఆరోపించారు. ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఇప్పటివరకు వారికి ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు వారి పని వారు చేస్తారు. ఈ వివాదాస్పద లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు’ అని జైట్లీ పేర్కొన్నారు.