జాతీయ వార్తలు

ఎన్నికల్లో పోటీకి విద్యార్హతలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం తీర్పుపై సిపిఎం అసంతృప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: విద్యార్హతలతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో ఓటు చేయడానికి, పోటీ చేయడానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కును నియంత్రించే దిశలో న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వటంపై సిపిఎం తీవ్ర అసంతృప్తివ్యక్తం చేసింది. హర్యానాలోని స్థానిక సంస్ధలకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఉండి తీరాలన్న హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని పార్టీ పోలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగంలో ఎక్కడాకూడా ఎన్నికలలో పోటీచేసే వారికి కనీస విద్యార్హతలు ఉండాలన్న నిబంధన లేదని పార్టీ స్పష్టం చేసింది. కనీస విద్యార్హతలుండి తీరాలన్న నిర్ణయం అమలైతే పేద వారికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం చేజారిపోతుందని సిపిఎం అభిప్రాయపడింది. ఈ అంశాన్ని రాజ్యాంగ బెంచ్‌కు నివేదించాల్సిన అవసనం ఉందని పార్టీ పేర్కొంది.