జాతీయ వార్తలు

నేటి నుంచి కులభూషణ్ జాదవ్ కేసు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద హేగ్, ఫిబ్రవరి 17: కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా సంఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్‌లో శిక్ష అనుభవిస్తున్న కులభూషణ్ జాదవ్ కేసు హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. రిటైర్డ్ ఇండియన్ నేవీ అధికారి అయిన జాదవ్(49)పై గూఢచార్యం, ఉగ్రవాదం ఆరోపణలపై పాకిస్తాన్ మిలటరీ కోర్టు 2017, ఏప్రిల్‌లో ఆయనకు మరణశిక్ష విధించడంతో ఆయన పాక్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ తీర్పుపై భారతదేశం అదే ఏడాది మేలో ఐసీజేను ఆశ్రయించింది. ఇలాంటి అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించేందుకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంకు చెందిన పదిమంది సభ్యుల ధర్మాసనం జాదవ్ కేసును సోమవారం నుంచి విచారించనుంది. అత్యంత ప్రాధాన్యత గల కేసుగా పరిగణించిన కోర్టు ఈ కేసును ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు బహిరంగ విచారణ జరపనుంది.
భారత్‌లోని కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో 41 మంది జవానులు మృతి చెందిన నేపథ్యంలో ఈ కేసు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రదాడితో ఇప్పటికే పాక్‌పై ప్రత్యక్ష, పరోక్ష చర్యలను భారత్ ప్రారంభించింది. ఈ దాడిపై భారత్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్‌కు తన తీవ్ర నిరసనను మనదేశం ఇప్పటికే తెలియజేసింది. అలాగే పాక్‌ను మోస్ట్‌ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) జాబితా నుంచి తొలగించి ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై 200 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. సోమవారం హేగ్‌లో జరిగే కేసులో భారత్ తరఫున మాజీ సోలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, పాకిస్తాన్ తరఫున ఖవ్వార్ ఖురేషి వాదించనున్నారు. మొదటగా సోమవారం భారత్ తన వాదనలను విన్పించనుంది. 19న పాకిస్తాన్ తన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను సమర్పించనుంది. దానిపై 20న భారత్ స్పందన, తిరిగి 21న దానిపై పాక్ స్పందన తెలియజేస్తాయి. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఈ ఏడాది వేసవిలో వెలువడవచ్చునని భావిస్తున్నారు. ఈ కేసులో జాదవ్‌కు ఉన్న అన్ని హక్కులను పరిరక్షించాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇదిలావుండగా, జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం వెలువరించే తీర్పునకు తమ దేశం కట్టుబడి ఉంటుందని పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ముస్లిం పేరుతో ఉన్న జాదవ్ పాస్‌పోర్టును తాము ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి తమకు బలమైన ఆధారాలు ఉన్నాయని, కేసు తప్పక నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు.