హైదరాబాద్

దీపం వెలిగిస్తే ఆత్మశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 29: దీపం వెలిగించడం వల్ల మనిషి జీవితంలో అత్మశాంతిని కలుగజేస్తుందని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్రస్వామి అన్నారు. భక్తి టివి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దిపోత్సవ 14రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తును ఉద్దేశించి అనుగ్రహ భాష్యం చేశారు. భారతదేశంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం ఎక్కడా జరుగలేదని తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఎలాంటి మీడియా చేయలేని ఆధ్యాత్మిక కార్యక్రమాలను కేవలం నరేంద్రచౌదరి చేశారని కొనియాడారు. కోటి దిపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశంలో పశువుని హింసించే మతం, మాతమార్పిళ్లకు పాల్పడే మతం ఎన్నో ఉన్నాయని, కేవలం అన్ని ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడని తెలియజేసేది కేవలం హిందూ మతం మాత్రమే అని అన్నారు. కోటి దీపోత్సవాల్లో పాల్గొని దీపాలు వెలిగించిన వారికి ఆత్మశాంతి కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఏర్పేడు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి తన అనుగ్రహ భాష్యం చేశారు. కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి కల్యాణోత్సవం అంగరంగా వైభవంగా వేద పండితుల మధ్య నిర్వహించారు. ప్రధానంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వరసిద్ధిగణపతికి సంకటహరచతుర్థి సందర్భంగా కోటిగరికార్చన చేశారు. చౌకీలపై భక్తులు ఏర్పాటు చేసుకున్న పసుపు గణపతిమూర్తులకు కోటిగరికార్చనతో పాటు భక్తులచే సామూహిక శివసంకల్ప పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మూషిక వాహనంపై గణపతిని ఘనంగా ఊరేగించారు.