జాతీయ వార్తలు

బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధించలేం:సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దీపావళి, ఇతర పండుగ దినాలలోనూ, శుభకార్యాలలోనూ కాల్చే బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. అమ్మకాలను నిషేధించకుండానే కొన్ని షరతులను విధించింది. దీపావళి పండుగ రోజున రెండు గంటలు మాత్రమే కాల్చాలని షరతు పెట్టింది. అలాగే ఈ-కామర్స్ ద్వారా జరిపే విక్రయాలపై నిషేధం విధించింది. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న బాణసంచాపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది. పై షరతులు విధిస్తూ తీర్పు వెలువరించింది.దీపావళినాడు 8 నుంచి 10 గంటల మధ్య, క్రిస్మస్, నూతన సంవత్సరంనాడు 11.55 నుంచి 12.30 గంటల మధ్య బాణసంచా కాల్చాలని షరతులు విధించింది.