ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ముందు నుయ్యి వెనుక గొయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాజపా కలలు కంటున్న కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని స్వయంగా కాంగ్రెస్ సాధించిపెడుతుందా? అనే అనుమానం కలుగుతోంది. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించే అంశంపై సీనియర్లు, జూనియర్ల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరాటం ఈ అనుమానాన్ని కలిగిస్తోంది. రాహుల్ గాంధీ మూలంగానే కాంగ్రెస్ ప్రతి ఎన్నికలో ఓడిపోతోంది, ఓటమికి ప్రతిరూపమైన అతన్ని అధ్యక్షుడుగా ఎలా నియమిస్తారని సీనియర్లు అడుగుతుంటే గాంధీ కుటుంబ సభ్యులు లేకపోతే కాంగ్రెస్ మనుగడ కొనసాగించగలుగుతుందా? అని జూనియర్లు ప్రశ్నిస్తున్నారు. గాంధీ కుటుంబ సభ్యులు నాయకత్వం వహించకపోతే కాంగ్రెస్ ముక్కలైపోతుందనేది అందరికి తెలిసిందే. రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా ఎన్నుకున్నా ప్రమాదమే, ఎన్నుకోకున్నా ప్రమాదమే, కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది.
రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించే అంశంపై పార్టీ రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్‌ను ఓటమి అంచున నిలబెట్టిన రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించటం ఏమిటని సీనియర్ నాయకులు ప్రశ్నిస్తుంటే పార్టీ ఈ దుస్థితికి రావటానికి సీనియర్ నాయకులే కారణమంటూ యువనాయకత్వం వారిపై చిందులు వేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం ఎంత మాత్రం బాగా లేదు. వైద్యం కోసం ఆమె తరచు అమెరికా వెళ్లవలసి వస్తోంది. రానున్న రెండు సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్‌పాటు దేశంలోని పధ్నాలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగవలసి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే 2019లో లోక్‌సభ ఎన్నికలు ముంచుకు వస్తాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించటం ద్వారా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అతన్ని సిద్ధం చేయాలన్నది సోనియా గాంధీ ఆలోచన. రాహుల్ గాంధీ కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
అయతే రాహుల్ గాంధీ పెడుతున్న ఒక షరతు సీనియర్లు, జూనియర్ల మధ్య గొడవకు దారి తీస్తోంది. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే కాంగ్రెస్‌లోని అన్ని స్థాయిలో యువతకు నాయకత్వం అప్పగించాలన్నది రాహుల్‌గాంధీ వ్యూహం. దీని కోసం ఆయన ఐదు వందల మంది యువ నాయకులను సిద్ధం చేసి పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ దాదాపు ఒక సంవత్సరం నుండి పార్టీకి చెందిన వందలాది మందిని వ్యక్తిగతంగా ఇంటర్వ్యు చేసి ఇందులో నుండి ఐదు వందల మందిని ఎంపిక చేసి పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే వీరందరిని ఆయా రాష్ట్రాల్లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల, జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో నియమించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సైతం యువతకు పెద్ద పీట వేయాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. యువతకు పెద్ద పీట వేయాలన్న రాహుల్ గాంధీ ఆలోచన సీనియర్ నాయకులకు రుచించటం లేదు. కాంగ్రెస్‌లో అవసరం ఉన్న చోట యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప అన్ని పదవుల్లో యువతనే నియమించాలనుకోవటం ఆత్మహత్యాసదృశ్యమని సీనియర్ నాయకులు వాదిస్తున్నారు. ఒక్క వేటుతో సీనియర్ నాయకులందరిని తొలగించి యువతకు ప్రాధాన్యత ఇస్తే పార్టీ నిలదొక్కుకోలేదన్నది సీనియర్ నాయకుల వాదన. సీనియర్, జూనియర్ నాయకుల సమతూక మిశ్రమంతో కాంగ్రెస్‌ను బతికించుకోవాలని వారు సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ వర్గానికి ఇది ఎంత మాత్రం నచ్చటం లేదు. ఇంత కాలం కాంగ్రెస్‌ను నడిపించి ఈ స్థితికి తెచ్చిన వీరు పదవుల్లో కొనసాగేందుకు వీలులేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని అంటున్నారు.
అరవై శాతం మంది యువకులు, నలభై శాతం మంది సీనియర్ నాయకులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలంటూ సీనియర్ నాయకులు చేసిన ప్రతిపాదనను కూడా రాహు ల్ గాంధీ తిప్పికొట్టారనే మాట వినిపిస్తోంది. రాహుల్ గాంధీ వర్గం, సీనియర్ నాయకుల మధ్య రాజీ కుదిర్చేందుకు సోనియా గాంధీ ఇంత వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని చెబుతున్నారు. సోనియా గాంధీ కొంత వరకు రాహుల్ గాంధీ వాదనతోనే ఏకీభవిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించాలనే నిర్ణయానికి సోనియా గాంధీ తన నిర్ణయాన్ని వెంటనే అమలు చేసేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. రాజకీయ సలహాదారు అహమద్ పటేల్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం ప్రతిపక్షం నాయకులు గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ నాయకులను ఆమె కాదనలేకపోతున్నారు. రాహుల్ గాంధీ పార్టీని విజయపథంలో నడిపించలేరంటూ కొందరు సీనియర్ నాయకులు చేస్తున్న వాదన సోనియా గాంధీకి ఏ మాత్రం రుచించటం లేదు.
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని శంకిస్తున్న కొందరు సీనియర్ నాయకులు ప్రియాంకా గాంధీకి పట్టం కట్టాలంటూ చేస్తున్న వాదన ఆమెను ఆగ్రహానికి గురి చేస్తోంది. భర్త రాబర్ట్ వాడ్రా ఆలోచన మేరకు నడుచుకునే ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న సూచనలు కనిపించటం లేదు. తల్లి సోని యా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో ప్రచా రం, అభివృద్ధి కార్యక్రమాల బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తున్న ప్రియాంకా గాంధీ కనీసం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతనైనా తీసుకోవాలని సీనియర్ నాయకులు పట్టుపడుతున్నారు. రాహుల్ గాంధీ జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తే ప్రియాంకా గాంధీ ఉత్తర ప్రదేశ్ రాజకీయాలకు కేంద్రం కావటం ద్వారా కాంగ్రెస్‌ను బతికించుకోవాలని సీనియర్ నాయకులు సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైనందున ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతను ప్రియాంకా కాంధీ తీసుకోవాలని సీనియర్ నాయకులు సూచిస్తున్నారు. ప్రియాంకా గాంధీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తే మంచి ఫలితాలను సాధించేందుకు వీలుంటుందని సోనియా నాయకులు వాదిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పేరుతో ప్రియంకాగాంధీని తీసుకురావటం ద్వారా రాహుల్ గాంధీని దెబ్బ తీసేందుకు సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పయనం ఎటువైపుఅనేది ఎవ్వరికి ఆర్థం కావటం లేదు.