ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
మరో విభజనకు కుట్ర జరుగుతోందా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్, ఎన్.ఆర్.సి.ని వ్యతిరేకించే నెపంతో మతం ఆధారంగా దేశాన్ని మరోసారి విభజించే కుట్ర జరుగుతోందా? దేశంలోని పదిహేను కోట్ల మంది ముస్లింలు వంద మంది హిందువులను సునాయసంగా ఎదుర్కొనగలరని ఎం.ఐ.ఎం మహారాష్ట్ర అధికార ప్రతినిధి హెచ్చరించటం చూస్తుంటే సి.ఏ.ఏ. ఉద్యమకారుల ప్రయాణం ఎటువైపు అనేది స్పష్టం కావటం లేదా? పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారు పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించేంత వరకు వెళ్లటం దేశ సమైక్యతకు ఎదురుకానున్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. షాహీన్‌బాగ్ రోడ్ బ్లాక్ నిరసన 70 రోజుల తరువాత కూడా ముగిసే సూచనలు కనిపించటం లేదు. మరోవైపు ఢిల్లీలోని జఫరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ముస్లిం మహిళలు రాత్రికి రాత్రి వందల సంఖ్యలో గుమికూడి ‘మాకు స్వాతంత్య్రం కావాలి?’ అంటూ ధర్నాకు దిగటం వెనక పెద్ద కుట్ర ఉన్నదనేందుకు ఎలాంటి సందేహం లేదు. సీఏఏను వ్యతిరేకించటం అనేది ఒక ముసుగు. ఈ ముసుగు వెనక మతం ఆధారంగా దేశాన్ని మరోసారి విభజించే కుట్ర రూపుదిద్దుకుంటోంది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ర్, ఎన్.ఆర్.సి.కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిలో తొంబై శాతం మంది ముస్లిం ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీరికి మద్దతుగా క్రైస్తవులూ ఉద్యమిస్తున్నారు. షాహీన్‌బాద్, జఫరాబాద్ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ ‘స్వాతంత్రం’. తమకు స్వాతంత్య్రం కావాలి అనే పదాన్ని వీరు తెలివిగా వాడుతున్నారు. తమకు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్., ఎన్.ఆర్.సి. నుండి స్వాతంత్య్రం కావా లంటూ మత వేర్పాటువాదానికి తెలివైన ముసుగు తొడుగుతున్నారు. సి.ఏ.ఏ., ఎన్.పి.ఆర్., ఎన్.ఆర్.సి. నుండి స్వాతంత్య్రం అనే ముసుగును తొలగిస్తే అది పూర్తి స్థాయి స్వాతంత్య్ర నినాదం అవుతుంది. షాహీన్‌బాద్, జఫరాబాద్‌లతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా దర్శనమిస్తున్న ముస్లిం మహిళల నిరసనలు, ధర్నాలు ఎలా ఊపిరిపోసుకుంటున్నాయి? అనేది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కేంద్రీకృత వ్యవస్థ ఈ ధర్నాలు, నిరసన వ్రతాలను నడిపిస్తోందనేందుకు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ధర్నాలో ఎవరెవరు పాల్గొనాలి? ఎక్కడ పాల్గొనాలనేది? ముందే నిర్ణయించి దాని ప్రకారం తమ వ్యూహాలను అమలు చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. కేంద్రీకృత వ్యవస్థ లేకపోతే షాహీన్‌బాద్‌లో ఏ సమయంలో చూసినా దాదాపు 500 మంది మహిళలు ధర్నా కార్యక్రమంలో ఎలా ఉండగలుగుతున్నారు? కొందరు భోజననాలకు వెళుతుంటే మరి కొందరు భోజనాలు ముగించుకుని వచ్చి ధర్నాలో భాగస్వాములు అవుతున్నారు? ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందనేది సుస్పష్టం. ఈ ధర్నాలు, నిరసనలలో పురుషులు పాల్గొన్నవారు అవసరమైన ఏర్పాట్లు చేయటం, సలహాలు ఇవ్వటం, వ్యూహ రచన చేయటం, పోలీసులు వచ్చినప్పుడు మహిళలతో కలిసి వాదించటం వంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇదంతా ఒక పకడ్బందీ పథకం. దేశం నలుమూలల షాహీనబాగ్ లాంటి ధర్నాలు జరిపేందుకు అనునిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురంలో ఇలాంటి ధర్నాలు జరిపేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి. కేరళ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు గట్టిగా వ్యవహరించటంతో నిరవధిక ధర్నాలు జరపలేకపోయారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఈ ధర్నాలకు మద్దతు ఇస్తోంది కాబట్టి ఆ రాష్ట్రంలో అక్కడక్కడ ఇలాంటి ధర్నాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో షాహీన్‌బాగ్ లాంటి ధర్నా చేసేందుకు లక్నోతో పాటు పలు చోట్ల ప్రయత్నాలు జరిగినా ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కఠిన వైఖరి మూలంగా ధర్నాలు కొనసాగలేకోయాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ నుండి మతపరమైన హింస మూలంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పించటాన్ని వీరు పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నారు. మతం ఆధారంగా వీరికి భారతీయ పౌరసత్వం కల్పించకూడదన్నది వీరి వాదన. పౌరసత్వ సవరణ చట్టం నుండి మతం అనే పదాన్ని తొలగిస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి అక్రమంగా మనదేశంలోకి వచ్చిన లక్షలాదిమందికి కూడా పౌరసత్వం కల్పించవలసి ఉంటుంది. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మన దేశంలోకి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పిస్తే ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ముస్లింలు మెజారిటీలోకి వస్తారు. ఈ లక్ష్య సాధన కోసమే సీఏఏ, ఎన్.పి. ఆర్., ఎన్.ఆర్.సి.ని వ్యతిరేకిస్తున్నారు.
రాజ్యాంగం ప్రకారం మనది లౌకిక దేశం కాబట్టి మతం ఆధారంగా పౌరసత్వం కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని వీరు వాదిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాతలు రూపొందించిన మొదటి రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదం లేదు. ఇందిరాగాంధీ అత్యవసరల పరిస్థితిలో రాజ్యాంగంలోని ముందు మాటను సవరించి లౌకికవాదం, సామాజికవాదం పదాలను జోడించారు. ముస్లిం మైనారిటీ నాయకులు దీనిని అడ్డం పెట్టుకుని పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి మైనారిటీ నాయకులు సీఏఏను అడ్డం పెట్టుకుని తమ వర్గం బలాన్ని ప్రదర్శిస్తున్నారు. సీఏఏ పేరుతో తమ వర్గం వారిని కూడగట్టటం ద్వారా ‘స్వాతంత్య్రం’ అనే లక్ష్య సాధన కోసం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. తమ లక్ష్యసాధన కోసం సీఏఏ మూలంగా కేవలం ముస్లిం మైనారిటీలకే కాదు దళితులు, వెనుకబడిన వారికి కూడా నష్టం కలుగుతుందనే తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ముస్లిం మైనారిటీతోపాటు దళిత, వెనుకబడిన వర్గాల వారిని కూడా చేర్చటం ద్వారా హిందువులను విభజించే కుతంత్రం కూడా జరుగుతోంది. సీఏఏ మూలంగా దేశంలోని ఏ పౌరుడికి ఎలాంటి నష్టం కలగదని ఎన్‌డీఏ ప్రభుత్వం నెత్తినోరు కొట్టుకుని వాదిస్తుంటే కుహనా లౌకికవాదులు, ముస్లిం మైనారిటీ నాయకులు మాత్రం తమ వర్గం వారితోపాటు హిందువులలోని దళితులు, వెనుకబడిన కులాల వారికి కూడా నష్టం కలుగుతుందంటూ కొత్త ప్రచారానికి తెరలేపారు. గతవారం బెంగళూరులో రాజ్యాంగ పరిరక్షణ పేరుతో జరిగిన సీఏఏ వ్యతిరేక సభలో ఒక యువతి పాకిస్తాన్ జిందాబాద్ అనేంత వరకు పరిస్థితి వెళ్లింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని చికెన్ నెక్ ప్రాంతంలో షాహీన్‌బాగ్ లాంటి ధర్నా చేయటం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను భారతదేశం నుండి క్షణంలో విడగొట్టవచ్చుననే ప్రకటన చేసేంత వరకు సీఏఏ వ్యతిరేక ఉద్యమం వెళ్లింది. లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఇత్తెహాదుల ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) మహారాష్ట్ర విభాగం అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ ఔరంగాబాద్‌లో జరిగిన సీఏఏ, వ్యతిరేకసభలో మాట్లాడుతూ దేశంలోని పదిహేను కోట్ల మంది ముస్లింలు వంద కోట్ల మంది హిందువులను సునాయసంగా మట్టుపెట్టగలరంటూ అత్యంత వివాదాస్పద హెచ్చరిక చేశారు. అయితే వారిస్ పఠాన్ చేసిన హెచ్చరికను ప్రభుత్వం పట్టించుకోకపోతే ముందుముందు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. దాదాపు 300 సంవత్సరాల క్రితమే ముస్లిం పాలన అంతమైనా కొందరు ముస్లిం నాయకులు ఇప్పటికీ తామీ దేశం పాలకులనే ఆలోచనతోనే ఉన్నారు. ఏనాటికైనా మళ్లీ తామీ దేశాన్ని పాలిస్తామనే ఆశతోనే ఉన్నారనేందుకు వారిస్ పఠాన్ హెచ్చరిక నిదర్శనం. అమూల్య లియోనా అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇవ్వటం సీఏఏ ఉద్యమం ఏ దిశగా ప్రయాణం చేస్తోందనేది స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్‌తో పాటు మరి కొన్ని మతతత్త్వ దేశాలు దేశంలోని మైనారిటీలను సీఏఏ విషయంలో తప్పుదోవ పట్టించాయి. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కూడా మైనారిటీలను తమ బ్యాంకు రాజకీయాలకు వాడుకునేందుకు ప్రయత్నించటంతో సీఏఏ సమస్య మరింత జఠిలమైంది. మతం ఆధారంగా దేశ విభజన జరిగినప్పుడే ఇక్కడి ముస్లింలందరినీ పాకిస్తాన్‌కు పంపించి అక్కడి హిందువులు ఇతర మైనారిటీలను భారతదేశానికి తెస్తే ఇప్పుడీ సమస్య ఉండేది కాదన్న కేంద్ర పశు సంవర్దక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించే వారి సంఖ్య మరింత పెరగవచ్చు.