జాతీయ వార్తలు

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కే పూర్తి అధికారాలు: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో పూర్తి అధికారాలు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఉంటాయని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు అశనిపాతం లాంటిదని పరిశీలకులు భావిస్తున్నారు. దిల్లీ మంత్రివర్గం సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వీలులేదని, ఏ విషయంలోనైనా ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌ను సంప్రదించాలని కోర్టు పేర్కొంది. దిల్లీ ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడాల్సి ఉండనవసరం లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే దిల్లీ అధికారులపై కేసులు పెట్టే అధికారం ఎసిబికి లేదని కోర్టు పేర్కొంది. కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. తమ అధికారాలను హరిస్తున్నారంటూ తరచూ కేంద్రంతో విభేదిస్తున్న కేజ్రీవాల్ ఈ తీర్పుపై ఇంకా స్పందించలేదు.