ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

బాధ్యాతారాహిత్యానికి పరాకాష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకా పునాదులు కూడా పడని అమరావతిలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. రెండు వేల ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారులు ప్రదర్శన మెరుగయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక కార్యచరణ పథకాన్ని తయారు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనలు చూస్తుంటే మన నాయకులు నేల విడిచి సాము చేస్తున్నారనిపించటం లేదా?
బ్రెజిల్‌లోని రియో నగరంలో ఇటీవల ముగిసిన ఒలింపిక్ క్రీడల్లో మనం సాధించినవి కేవలం రెండు పతకాలు మాత్రమే. సింధు, సాక్షి మలిక్ సాధించిన రెండు పతకాలతో దేశం పరువు నిలబడిందని ఎవరైనా భావిస్తే అంత కంటే మించిన తప్పు లేదు. 125 కోట్ల మంది జనాభా ఉన్న దేశం నుండి 118 మంది క్రీడాకారులు రియో ఒలంపిక్స్‌కు వెళితే కేవలం రెండు పతకాలు వచ్చాయి. ఈ ఫలితాల పట్ల ప్రధాన మంత్రితోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ విచారాన్ని వ్యక్తం చేసి ఉండాల్సింది. మన అసమర్థత పట్ల సిగ్గుతో తల వంచుకోవలసిన నాయకులు ఇక మీదట మా తఢాకా చూపిస్తామంటూ కార్యచరణ పథకాలు ప్రకటిస్తున్నారు. రియోలో మన పరిస్థితి ఎందుకిలా ఉన్నదనేది వీరెందుకు సమీక్షించటం లేదు? 112 మంది వెళ్లి కేవలం రెండు పతకాలతో తిరిగి రావటంలో తమ పాత్ర ఎంత? అనేది వీరెందుకు సమీక్షించటం లేదు? రియో ఒలింపిక్స్ ఫలితాలపై సమీక్ష జరిపితే తమ అసమర్థత బైటపడుతుందనేది మన పాలకులకు బాగా తెలుసు. అందుకే రజతం, కాంస్యం సాధించిన క్రీడాకారులను పెద్ద ఎత్తున సత్కరిస్తూ తమ వైఫలల్యాలను కప్పిపుచ్చుకున్నారు.
టెన్నిస్‌లో రజత పతకం సాధించిన పి.వి.సింధు, కుస్తీ పోటీల్లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌లను అభినందించవలసిందే. దేశం పరువు నిలబెట్టినందుకు వారికి బహుమతులు ఇవ్వవలసిందే. అయితే వారిపై వరాల జల్లు కురిపించటం ద్వారా మన పాలకులు తమ తప్పిదాల నుం డి ప్రజల దృష్టిని మళ్లించటంలో విజయం సాధించారని చెప్పకతప్పదు. భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన సాధించేందుకు కార్యచరణ పథకాలను అమలు చేస్తాం, ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించే స్థాయి క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న మన నాయకులు మన క్రీడా రంగం ఎందుకిలా ఉన్నదనేది ఎప్పుడైనా ఆలోచించారా? క్రీడా రంగంలో పాతుకుపోయిన రాజకీయాలను తొలగించి క్రీడలను క్రీడలుగా చూసేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? దేశంలో దాదాపు పద మూడు లక్షల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నుండి ఎన్నింటిలో ఆట స్థలాలున్నాయనేది మన నాయకులకు తెలుసా? ప్రభుత్వ పాఠశాలు తరగతి గదుల్లో లేనప్పుడు పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన మైదానాలు, ఇతర సౌకర్యాలను వీరు కల్పిస్తారని ఎలా విశ్వసించగలుగుతాం? దేశంలోని లక్షలాది ప్రభుత్వ పాఠశాల్లో క్రీడా మైదానాలు లేవనేది మన ముఖ్యమంత్రులు, ప్రధాన మం త్రికి తెలియదా? పి.వి.సింధు, సాక్షి మాలిక్‌లు తమ స్వంత కృషి,పట్టుదలతో పైకి వచ్చారు. పుల్లెల గోపీచంద్ లాంటి కొందరు గురువులు తమకున్నదాన్నంతా ఫణంగా పెట్టి సిందు, సాక్షి, పద్మా కర్మాకర్ లాంటి వారిని తయారు చే స్తుంటే మన నాయకులు మాత్రం తమ వల్లనే వీరీ స్థాయికి వచ్చారంటూ తమకు తామే శభాష్ చెప్పుకోవటంకంటె విచిత్రం మరోటుండదు. ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తే సింధు, సాక్షి మలిక్ లాంటి వారు దేశంలో కోకొల్లలుగా పుట్టుకువస్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని పాఠశాల్లో విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా మైదానాలతోపాటు క్రీడలకు సంబంధించిన కనీస సౌకర్యాలను కల్పించి ఉంటే ఒలింపిక్స్ క్రీడల్లో దేశం అవమానానికి గురి కావలసిన దుస్థితి ఎదురయ్యేది కాదు. దేశంలోని అన్ని క్రీడా సంస్థల్లో రాజకీయ నాయకులదే హవా. తమ వారు ఎంత అసమర్థులైనా పెద్ద పీట వేసే నాయకులు క్రీడా సంఘాలను తమ పార్టీ రాజకీయాలకు అనువుగా ఉపయోగించుకుంటుంటే మంచి క్రీడాకారులు ఎలా తయారవుతారు? సుప్రీం కోర్టు ఇటీవల చివాట్లు పెట్టినా ఈ విష సంస్కృతికి తెరపడటం లేదు. రియో ఒలంపిక్స్‌కు వెళ్లిన భారత బృందంతో ఫిజియోథెరపిస్ట్‌ను పంపించకుండా ఒక రేడియాలజిస్ట్‌ను పంపించిన ఘనత మన దేశం ఒలంపిక్స్ సంఘానికి దక్కింది. రియో ఒలంపిక్స్‌కు ఫిజియోథెరపిస్ట్ స్థానంలో ఒక రేడియాలజిస్ట్ వెళ్లేందుకు ఎలా అనుమతించారనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు?
మన దేశంలో క్రీడా సంస్కృతి అనేదే లేదు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్ద పీట వేయటం లేదు. కేంద్ర బడ్జెట్‌తోపాటు ఆయా రాష్ట్రాల బడ్జెట్లలో క్రీడా శాఖ కేటాయింపులు చూస్తే మన నాయకులు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనేది స్పష్టమైపోతుంది. క్రీడా రంగానికి ఆయా ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు చూస్తుంటే మన పాలకులకు క్రీడల పట్ల ఎంత ఆసక్తి, అవగాహన, బాధ్యత ఉన్నదనేది స్పష్టమవుతుంది. క్రీడా వ్యవస్థ గురించి మన నాయకులు ఎప్పుడైనా పట్టించుకున్నారా? క్రీడా సంఘాలు చేస్తున్న రాజకీయాలకు వందలు, వేలాది మంది యువ క్రీడాకారులు బలైపోతున్న విషయం మన నాయకులకు తెలుసా? క్రీడా సంఘాల్లో ప్రాంతీయ తత్వం, కుల తత్వం, బంధు వర్గానికి పెద్ద పీట వేస్తూ సమర్థుల పట్ల వివక్ష చూపించటం సర్వ సామాన్యమైపోయింది.
డబ్బులు దండుకునేందుకు తప్ప దేనికీ పనికిరాని క్రికెట్‌కు పెద్ద పీట వేయటం ద్వారా మిగతా అన్ని రకాల క్రీడ ల గొంతు నులుముతున్నారు. ఒకప్పుడు హైదరాబాదు, కోల్‌కతా నగరాల్లో ఎంతో ప్రాముఖ్యత సంపాదించిన ఫుట్‌బాల్ ఆట ఇప్పుడు కనుమరుగైపోతోంది. దేశంలోని గ్రామ,గ్రామన ఉండిన కబడ్డీ ఆట ఇప్పుడు చూద్దామన్నా కనిపించదు. క్రికెట్‌ను వాణిజ్యం చేసినట్లే ఇప్పుడు కబడ్డీని వాణిజ్యం కోసం వాడుకుంటున్నారు తప్ప దేశం పరువు, ప్రతిష్ఠ గురించి ఆలోచించటం లేదు.