ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
కాంగ్రెస్‌కు కాస్త ఊరట..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాలగర్భంలో కలసిన 2018 సంవత్సరం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. జాతీయ రాజకీయాలను అతలాకుతలం చేసిన సంవత్సరం ఇది. గతించిన సంవత్సరంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కాస్త బలం పుంజుకుంటే భాజపాకు మాత్రం చేదు అనుభవాలు మిగిలాయి. జాతీయ స్థాయిలో ‘కూటముల’ను ఏర్పాటు చేసేందుకు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు ఎత్తుకు పైఎత్తులు వేసిన సంవత్సరం ఇదే. ఈ ఇద్దరు నేతలూ జాతీయ స్థాయి నాయకులను సైతం ప్రభావితం చేయడం గమనార్హం.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ, శాసనసభల స్థానాలకు జరిగిన పలు ఉపఎన్నిల్లో తన పార్టీని గెలిపించుకోవటంతోపాటు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. కర్నాటకలో జనతాదళ్ (ఎస్)తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ద్వారా భాజపా ఆధిపత్యానికి రాహుల్ గండికొట్టారు. మేఘాలయలో మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోలేక పోయింది. తన నాయకత్వ పటిమ విషయంలో ఎస్.పి, బి.ఎస్.పి, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలకు విశ్వాసం కలిగించి జాతీయ స్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిని రాహుల్ రూపొందించ లేకపోతున్నారు. రాజకీయంగా రాహుల్ గతంలో కంటే పరిణతి సాధించగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా ఉత్తర ప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి పాలైంది. భాజపా మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. కర్నాటకలో కొద్దిలో అధికారాన్ని జార విడుచుకున్నది.
రాహుల్ వాక్ చాతుర్యం, ధైర్యం పెంచుకూంటూ- ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బ తీయడంలో విజయం సాధించారు. ‘పప్పు’గా ముద్ర పడిన ఆయన ఇటీవల జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. బద్ధ శత్రువైన తెలుగుదేశం పార్టీతో కలసి పని చేసేందుకు రాహుల్ సిద్ధపడడం మిగతా విపక్షాలను విస్మయానికి గురి చేసింది.
రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే గాక, కర్నాటకలో జేడీ(ఎస్)తో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది జనవరిలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికలతో కాంగ్రెస్ విజయ పరంపర ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని అల్వార్, అజ్మీర్ నియోజకవర్గాల్లో భాజపాను కాంగ్రెస్ ఓడించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియా నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవటంలో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. గత మార్చిలో ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్, బిహార్‌లోని ఆరారియా లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు తీరని నష్టం వాటిల్లింది. యూపీలో భాజపా అధికారంలో ఉన్నా- ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ అంతవరకు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్, ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ వౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫూ ల్‌పూర్ నియోజకవర్గాల్లో ప్రతిపక్షం కలిసికట్టుగా పోటీ చేసి భాజపాను మట్టి కరిపించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ అభ్యర్థులు విజయం సాదించారు. బిహార్‌లోని అరారియా లోక్‌సభ స్థానాన్ని ఆర్.జె.డి నిలబెట్టుకోవటంతో ప్రతిపక్షం సమైక్యంగా ఉంటే భాజపా కూటమిని సునాయసంగా ఓడించవచ్చుననేది రుజువైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను కోల్పోవడంతో భాజపాకు తీరని నష్టం జరిగింది. గత మేలో ఉత్తర ప్రదేశ్‌లని ఖైరానా, మహారాష్టల్రోని భాంద్రా గోండియా, పాయిఘర్, నాగాలాండ్‌లోని నాగాలాండ్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ‘కమల దళం’ కంగుతింది.
ఖైరానా,్భంద్రా గోండియా నియోజకవర్గాల్లో ఆర్.ఎల్.డి, ఎన్.సి.పి చేతిలో ఓడిపోయి, పైగార్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో భాజపా పరిస్థితి చావుతప్పి కన్నులోట్టపోయినట్లయ్యింది. నాగాలాండ్ సీటును ఎన్.పి.ఎఫ్ నుండి లాగేసుకోవటంలో ఎన్.డి.పి.పి విజయం సాధించింది. ఖైరానా స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిపక్షాలు మరోసారి ఐక్యమత్యంతో వ్యవహరించి భాజపాను నిలువరించాయి. ఇక్కడ ప్రతిపక్షాల తరఫున రంగంలోకి దిగిన ఆర్.ఎల్.డి అభ్యర్థి విజయం సాధించారు. గత నవంబర్‌లో కర్నాటకలో మూడు లోక్‌సభ స్థానాల (బళ్లారి, మాండ్యా, శివమొగ్గ) కు జరిగిన ఉపఎన్నికల్లో భాజపా రెండు చోట్ల ఓటమిని చవి చూడకతప్పలేదు. శివమొగ్గ సీటును మాత్రమే భాజపా కాపాడుకోగలిగింది. బళ్లారిలో కాంగ్రెస్, మాండ్యాలో జెడీ (ఎస్) అభ్యర్థులు గెలిచారు.
గత ఏడాది త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో మూడు చోట్ల బి.జె.పి, రెండింటిలో కాంగ్రెస్ అధికారంలో ఉండేవి. గత ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. త్రిపురలో కమ్యూనిస్టులను ఓడించి భాజపా చరిత్ర సృష్టించింది. మేఘాలయలో కాంగ్రెస్ ఓటమిపాలు కాగా ఎన్.పి.పి అధికారంలోకి వచ్చింది. నాగాలాండ్‌లో ఎన్.పి.ఎఫ్ ఓడిపోయి ఎన్.డి.పి.పి అధికారంలోకి వచ్చింది. కర్నాటక శాసనసభకు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో బి.జె.పి ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించినా అధికారాన్ని నిలబెట్టుకోలేకోయింది. కాంగ్రెస్ రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించి జేడీ(ఎస్)తో చేతులు కలిపింది. కేవలం ముప్పై ఐదు సీట్లు గెల్చుకున్న కు మార స్వామిని ముఖ్యమంత్రి చేసి బి.జె.పిని అధికారానికి దూరంగా ఉంచటంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో భాజపా అధికారాన్ని కోల్పోగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఛత్తీస్‌గఢ్‌లో తాము ఇంత ఘోరంగా ఓడిపోతామని భాజపా నేతలు కలలో కూడా ఊహించలేదు. గత సంవత్సరం 12 రాష్ట్రాలలోని పదహారు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మెజారిటీ సీట్లు గెలుచుకున్నాయి. శాసన సభలకు జరిగిన పదహారు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సీట్లలో, ఇతర ప్రతిపక్షాలు ఆరు సీట్లలో విజయం సాధించాయి. భాజపా కేవలం రెండు సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. ఉత్తర ప్రదేశ్‌లోని నూర్‌పూర్ ఉపఎన్నికలో ప్రతిపక్షాలు సమాజ్‌వాదీ అభ్యర్థిని గెలిపించుకోవటం ద్వారా భాజపాను దెబ్బ తీశాయి.
సమైక్యంగా పోరాడడం ద్వారా భాజపాను మట్టి కరిపించిన ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో మాత్రం బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేకపోయాయి. ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు జరిగిన రెండు,మూడు ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్.పి అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి విపక్ష నేతలు రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేంకు విముఖత చూపడం గమనార్హం. ఎన్.సి.పి అధ్యక్షుడు శరద్ పవార్ కాంగ్రెస్ నాయకత్వంలో పటిష్టమైన ప్రతిపక్ష కూటమిని తయారు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసినా, ఆ తర్వాత ఆయన ప్రయత్నం ఇంకా తుది దశకు చేరుకోలేదు. అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు అఖిలేశ్ యాదవ్, మాయావతి అంగీకరించటం లేదు. ఎనభై లోక్‌సభ సీట్లున్న యూపీలో ప్రతిపక్షం ఐక్యంగా పని చేయకపోతే జాతీయ స్థాయిలో ఎన్‌డిఏకు ప్రత్యామ్నాయం ఏర్పడటం కల్ల. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రారంభించిన ప్రయత్నాలు జాతీయ రాజకీయాలను మరో మలుపు తిప్పాయి. *