ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చెప్పడం సులభం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు అభివృద్ధి గురించి పాఠాలు చెప్పేబదులు మన దేశప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలంటూ ప్రతిపక్షాలు సూచించండం అర్థరహితం. కనీసం పాక్‌తో వ్యవహరించే విషయంలోనైనా ప్రతిపక్షాలు ప్రధానికి అండగా నిలబడటం మంచిది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశం ఏ మేరకు అభివృద్ధి చెందింది? పరిపాలన ఏ విధంగా మారుతోంది? అవినీతిని ఏ మేరకు అరికట్టగలుగుతున్నారనే అంశాలపై అధికార, ప్రతిపక్షాలకు ఎప్పుడూ ఏకాభిప్రాయం కుదరదనేది జగమెరిగిన సత్యం. అధికార పక్షాన్ని విమర్శించటమే ప్రతిపక్షం పని. ప్రభుత్వంలో తప్పొప్పులను ఎత్తి చూపించటంలో తప్పు లేదు కానీ, తిమ్మిని బమ్మిచేసి చెప్పటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. మోదీకి బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లాంటి నాయకులు హితవు చెప్పటాన్ని జీర్ణించుకోవటం కొంత కష్టమవుతుంది. పాకిస్తాన్, జమ్ముకాశ్మీర్‌కు సంబంధించిన అంశాల్లో ప్రతిపక్షం బాధ్యతతో వ్యవహించటం మంచిది.
జమ్ముకాశ్మీర్‌లోని యురీ సైనిక శిబిరంపై హిజ్బుల్ ముజాహిదీన్ ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడిని అరికట్టటంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షం విమర్శించటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. వాస్తవానికి యురీ సైనిక శిబిరంపై దాడి చేసింది పాకిస్తాన్ సైన్యమే. ఇస్లామిక్ ఉగ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ సైనికులు యురీ సైనిక శిబిరంపై దొంగదెబ్బ తీశారు. మన దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు పాకిస్తాన్ అనుసరిస్తున్న ‘వెయ్యి కోతల’ (్థసండ్ కట్స్) విధానంలో భాగంగానే యురీలో తన ఉగ్రవాద ముష్కరులతో దాడి చేయించింది. ఈ వాస్తవం ప్రతిపక్షానికి తెలిసినా, రాజకీయం కోసం- ఇంకా చెప్పాలంటే త్వరలోనే జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు దండుకునేందుకు మాయావతి, రాహుల్ గాంధీలు నరేంద్ర మోదీపై అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్‌ను అన్ని విధాలా ఏకాకి చేసేందుకు మోదీ సరైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెప్పకతప్పదు.
దేశం రెండుగా చీలిపోయి భారత, పాకిస్తాన్‌లు ఆవిర్భవించిన ఇన్నాళ్లకు మొదటిసారి భారత ప్రధానమంత్రి పాక్ విషయంలో ధైర్యంతో కూడిన విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పకతప్పదు. ‘ఆక్రమిత కాశ్మీర్ మాది ,అక్కడి నుండి మీరు ఖాళీ చేయకతప్పద’ని చెప్పటంతోనే మోదీ సరిపెట్టుకోకుండా గిల్గిట్, బలుచిస్తాన్‌లో స్థానిక ప్రజలు తమ హక్కుల కోసం కొనసాగిస్తున్న పోరాటం గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. మొట్టమొదటిసారి భారత ప్రధాని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రధాన మంత్రులెవరైనా ఈ విధంగా మాట్లాడారా? ఒకప్పుడు మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుండి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆక్రమిత కాశ్మీర్ గురించి ప్రస్తావించారు. ‘ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్తాన్ నుండి తిరిగి స్వాధీనం చేసుకోవడడమే మిగిలిపోయిన ఏకైక పని’ అంటూ ఆయన వ్యాఖ్యానించినందుకు అప్పట్లో కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నరసింహారావు తరువాత ఇప్పుడు నరంద్ర మోదీ కేవలం ఆక్రమిత కాశ్మీర్ గురించే మాట్లాడకుండా గిల్గిట్, బలుచిస్తాన్ గురించి కూడా మాట్లాడటం ద్వారా పాకిస్తాన్‌ను దౌత్యపరంగా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీ చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలే తప్ప వ్యతిరేకించకూడదు.
ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. బాహాటంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని మనపై ఉసిగొల్పుతోంది. భారత దేశంపై ఉగ్రవాద యుద్ధాన్ని ప్రకటించిన పాకిస్తాన్‌కు చైనా బరితెగించి మద్దతు ఇస్తోంది. పాకిస్తాన్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ చైనా అధికారికంగా ప్రకటించటం గమనార్హం. పాకిస్తాన్ మనపై కొనసాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద యుద్ధాన్ని చైనా పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తోందనేందుకు తాజా ప్రకటనే నిదర్శనం. పాకిస్తాన్ నిర్వహిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద యుద్ధం ద్వారా భారత దేశాన్ని దెబ్బ తీయటాన్ని చైనా తన ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. వీలున్నంత త్వరగా ఇరకాటంలో పడవేయటం ద్వారా భారత్ ఎదగకుండా చేయాలన్నది పాకిస్తాన్, చైనాల వ్యూహం. తమ దేశంలోని ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అత్యంత అమానుషంగా అణిచివేస్తున్న చైనా భారత్‌లో పాకిస్తాన్ కొనసాగిస్తున్న సీమాంతర ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం వెనక ఉన్న కుట్రను మన ప్రతిపక్షాలు అర్థం చేసుకోవటం మంచిది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు కూడగట్టుకునే నెపంతో- ఉగ్రవాద దాడులను అరికట్టటంలో మోదీ విఫలమయ్యారని విమర్శించటం అత్యంత సులభం. ఇలాంటి విమర్శల వలన మైనారిటీల ఓట్లు కొన్ని పడవచ్చు కానీ, దేశానికి అపారనష్టం కలుగుతుందనే వాస్తవాన్ని ప్రతిపక్షం గ్రహించటం మంచిది. మైనారిటీల ఓట్ల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెట్టటం సమర్థనీయం కాదు. అందుకే పాకిస్తాన్, జమ్ముకాశ్మీర్ విషయంలో ప్రతిపక్షాలు అత్యంత సంయమనంతో వ్యవహరించాల్సి ఉంది.