ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్ దురదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి దురదృష్టంగా మారారు. ఇవి నేను చెబుతున్న మాటలు కాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెబుతున్న మాటలు. రాహుల్ గాంధీ చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి తప్ప లాభం కలిగించటం లేదు, రాజకీయంగా మేలు చేయటం లేదని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని అడ్డం పెట్టుకుని చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు సైతం ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు కాస్తా ‘రేప్ ఇన్ ఇండియా’ గా మారిందని రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం జార్కండ్ ఎన్నికల ప్రచారం సంధర్భంగా వ్యాఖ్యానించటం తెలిసిందే. మేక్ ఇన్ ఇండియా అంటే విదేశాల నుండి దిగుమతులు తగ్గించుకుని స్థానిక తయారీని పెంచుకోవటం. విదేశీ సంస్థలు సైతం తమ ఉత్పత్తులను భారత దేశంలో చేయటం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలన్నది నరేంద్ర మోదీ పిలుపు. రాహుల్ గాంధీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాను పూర్తి స్థాయిలో వక్రీకరించి వ్యాఖ్యానించటం ద్వారా దేశాన్ని, దేశంలోని కోట్లాదిమంది మహిళలను ఘోరంగా అవమానించారు. నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కాస్తా రేప్ ఇన్ ఇండియాగా మారిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అంటే భారత దేశంలో పరిశ్రమలు స్థాపించి వస్తువులను ఇక్కడే తయారు చేయాలన్న మోదీ పిలుపును రాహుల్ గాంధీ పూర్తిగా మార్చివేసి భారత దేశానికి వచ్చి మహిళలను రేప్ చేయండి అనే అర్థంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఇక్కడికి వచ్చి రేప్ చేయండి అని ఏ బుద్దున్న నాయకుడైనా అంటారా? రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యతో రాహుల్ గాంధీ మరోసారి తనకు బుద్ది లేదనేది తనకుతాను రుజువు చేసుకున్నాడు. రేప్ ఇన్ ఇండియా అన్నందుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన రాహుల్ గాంధీ ఈ ప్రక్రిలో ‘నేను రాహుల్ సావర్కర్‌ను కాదు రాహుల్ గాంధీని’ అని చెప్పటం ద్వారా మహారాష్టల్రో మిత్రపక్షమైన శివసేనతో గొడవ పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ అర్థరహితంగా మాట్లాటంలో దిట్ట అనేది మాట,మాటకు రుజువవుతోంది. ఆయనకు మొదట్లో పప్పు (బుద్దిలేనివాడు) అని ప్రతిపక్షం పిలవటం తెలిసిందే. రాహుల్ గాంధీ మధ్యలోకొంత మారినట్లు కనిపించారు, తెలివితోమాట్లాడుతున్నాడనే అభిప్రాయం కలిగించాడు. రాహుల్ గాంధీ తాజాగా చేస్తున్న అర్థరహిత వ్యాఖ్యలు, విమర్శలు చూస్తుంటే ఆయన మరోసారి పాత ‘పప్పు’గా మారిపోయారనే విశ్వాసం కలుగుతోంది. రాహుల్ గాంధీకి స్వంత ఆలోచన, అవగాహన లేదనేది మరోసారి రుజువైంది. మేక్ ఇన్ ఇండియా కాదిది రేప్ ఇన్ ఇండియా అని తెలివి ఉన్న నాయకుడు ఎవరైనా వ్యాఖ్యానిస్తారా? అని కాంగ్రెస్ నాయకులే ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ స్వంతంగా ఆలోచించకుండా తన వ్యూహకర్తలు ఏం చెబితే అది చెబుతాడు, ఏం రాసి ఇస్తే అది చదువుతాడు, ఏం వ్యాఖ్యానించాలని రాసి పంపిస్తే అది వ్యాఖ్యానిస్తాడు, అది అతని గొప్పతనం. తన వ్యూహ కర్తలు ఏం రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? వారు రాసి ఇచ్చింది సరైనదేనా? తాను చెప్పవచ్చా? లేదా? అది తన స్థాయికి తగునా? కాదా? అని రాహుల్ గాంధీ ఎప్పుడు విశే్లషించరు. నోటికి వచ్చింది మాట్లాడటం రాహుల్ గాంధీకి వెన్నతో పెట్టిన విద్య. రేప్ ఇన్ ఇండియా వంటి వ్యాఖ్యల ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిస్తున్నారని అధికార పక్షం కాదు స్వపక్షం విమర్శిస్తున్నారు. రేప్ ఇన్ ఇండియా విమర్శ కాంగ్రెస్‌కు రాజకీయంగా తీరని నష్టం కలిగిస్తోందనేందుకు పార్లమెంటులో జరిగిన గొడవ ఒక ఉదాహరణ. రాహుల్ గాంధీ చేసే ప్రతి తప్పును బి.జె.పి తనకు అనుకూలంగా వాడుకున్నది. ఇప్పుడు రేప్ ఇన్ ఇండియా విమర్శను కూడా రాజకీయంగా వాడుకోవటంలోబి.జె.పి విజయం సాధించింది. బి.జె.పి ఎం.పిలు ముఖ్యంగా మహిళా ఎం.పిలు ఈ విషయాన్ని లోకసభలో పెద్ద ఎత్తున ప్రస్తావించటం గమనార్హం. పార్లమెంటు శీతాకాల సమావేవాల ఆఖరు రోజు అంటే డిసెంబర్ 13 తేదీనాడు బి.జె.పి మహిళా మంత్రులు, ఎం.పిలు లోకసభను స్థంభింపజేశారు. రేప్ ఇన్ ఇండియా అంటూ దేశంలోని కోట్లాది మంది మహిళలను అవమానించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలంటూ పట్టపట్టటం ద్వారా కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బ తీయగలిగారు. రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా విమర్శను ఏ ఒక్క కాంగ్రెస్ ఎం.పి కూడా సమర్థించలేకపోయారు. రాహుల్ గాంధీ రేప్ ఇన్ ఇండియా విమర్శను సమర్థిస్తారా అంటూ ఎన్.సి.పి సభ్యురాలు సుప్రియా సూలే, డి.ఎం.కె సభ్యురాలు కనిమోళిని ప్రశ్నించటం ద్వారా బి.జె.పి ఎం.పిలు ప్రతిపక్షాన్ని ఇరకాటంలోపడవేశారు. బి.జె.పి ఎం.పిల వ్యాఖ్యలకు సుప్రియా సూలే సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. అయితే కనిమోళి లేచి దేశంలో పెరిగిపోతున్న మానభంగాల పట్ల తన బాధను వ్యక్తం చేసేందుకు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేసి ఉండవచ్చునంటూ సమర్థించేందుకు ప్రయత్నించారు. ఇతర ప్రతిపక్షాలకు చెందిన ఎం.పిలు ఎవ్వరు కూడా రాహుల్ గాంధీ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యకు మద్దతుగా నిలబడలేదు. అంటే వారందరు కూడా రాహుల్ గాంధీని తప్పుపట్టినట్లే కదా. తన రేప్ ఇన్ ఇండియా విమర్శ మూలంగా పార్టీకి రాజకీయంగా జరుగుతున్న నష్టాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికి గుర్తించకపోవటం సిగ్గుచేటు. రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ రేప్ ఇన్ ఇండియా విమర్శకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని మొండిగా మాట్లాడటం ద్వారా ఆయన మరోసారి తన ‘పప్పు’ తనాన్ని బైటపెట్టుకున్నారు. రాహుల్ గాంధీ అవమానించారంటూ కొందరు సీనియర్ నాయకులు బాహాటంగానే అతన్ని విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ మొదట్లో నరేంద్ర మోదీని సూట్‌ళబూట్‌గా సర్కార్ అని ఎద్దేవ చేయటం తెలిసిందే. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన కొత్తలో ఒక విదేశీ ప్రముఖుడిని ఆహ్వినించేందుకు ధరించిన బట్టలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూ ఇది సూటు,బూటు సర్కార్ (సూట్ బూట్ కా సర్కార్ ) అని ఎద్దేవ చేశారు. రాహుల్ గాంధీ చేసినీన ఈ వ్యాఖ్య పట్ల ప్రజలు కొంత అనుకూలంగానే స్పందించారు. నరేంద్ర మోదీ లక్షలు విలువ చేసే బట్టలు ధరించవలసిన అవసరం లేదని భావించిన ప్రజలు చాలా మంది రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఏకీనించారు. నరేంద్ర మోదీ పట్ల రాహుల్ గాంధీ ఆ తరువాత చేసిన పలు వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు నష్టం కలిగించాయి తప్ప లాభం కలిగించలేదు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్న రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ జేబులో పెట్టారంటూ చేసిన వ్యాఖ్య కాంగ్రెస్‌కు లోకసభ ఎన్నికల్లో తీరని నష్టం కలిగించింది. లోకసభ ఎన్నికల ప్రచారం సంధర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రతి ఎన్నికల సభలో రాహుల్ గాంధీ ఈ ముప్పై వేల కోట్ల రూపాయల గురించి ప్రస్తావించారు. మోదీ ముప్పై వేల కోట్ల ప్రజాధనాన్ని అనీల్ అంమానీకి ఇచ్చారంటూ అలుపెరుగకుండా చేసిన ఆరోపణలు చివరకు ఎన్.టి.ఏ ప్రభుత్వానికి కలిసి వచ్చాయి. చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై చేసిన మరో తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కింది స్థాయి నుండి దెబ్బతీశాయి. చౌకీదార్ చోర్ హై (కాపలాదారు దొంగ) అంటూ రాహుల్ గాంధీ వెళ్లిన ప్రతి చోట చేసిన విమర్శల మూలంగా దేశంలోని కోట్లాది మంది కాపలాదారులు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. కోట్లాది మంది చౌకీదారులు బి.జె.పికి అనుకూలంగా ఓటు వేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ లోకసభ ఎన్నికల సంధర్భంగా చేసిన ఆరోపణలు ఎంత మాత్రం పలించలేదు. నిజాయితీగా పని చేస్తున్న నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నిరనే అభిప్రాయానికి దేశ ప్రజలు ముఖ్యంగా ఓటర్లు వచ్చారు కాబట్టే లోకసభ ఎన్నికల్లో వారు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చౌకీదార్ చోర్ హై (కాపలాదారు దొంగ) నినాదం తమను నిండా ముంచిందని లోకసభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒప్పుకున్నాడు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా అది కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తోంది తప్ప ప్రయోజనకారి కావటం లేదన్నది వారి వాదన. అందుకే హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రాంతంలో ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీ వస్తానని చెప్పినా కాంగ్రెస్ అభ్యర్థులు ఒప్పుకోలేదు. రాహుల్ గాంధీ తమ నియోజకవర్గంలోప్రచారం చేసేందుకు రాకపోతేనే మంచిదని వారు భాహాటంగా చెప్పారు. రాహుల్ గాంధీ హాజరైన ఒక బహిరంగ సభకు పి.సి.సి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి భుపేందర్‌సింగ్ హుడ్డా హాజరు కాలేదంటే పార్టీ మాజీ అధ్యక్షుడి ఎన్నికల ప్రచారం పట్ల వారికి ఎంత నమ్మకం ఉన్నదనేది స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకోవాలి, వాస్తవాల ఆధారంగా రాజకీయం చేసేందుకు ప్రయత్నించటం మంచిది.

-కె.కైలాష్ 98115 73262