ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

బలప్రదర్శన మతలబు ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైన్మార్ నుండి బంగ్లాదేశ్ మీదుగా మన దేశంలోకి వచ్చి పలు ప్రాంతాల్లో తిష్ఠవేసిన రొహింగ్యా ముస్లింలను పంపించివేయకూడదంటూ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గత వారం లక్షలాది మంది ముస్లిం మైనారిటీలు ఉద్యమించటం కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించి ఉండాలి. రొహింగ్యాలపై దాడులు ఆపకపోతే రక్తపాతం తప్పదంటూ పశ్చిమ బెంగాల్ ముస్లింలు మైన్మార్ ప్రభుత్వాన్ని హెచ్చరించటంతోపాటు తమ ప్రయోజనాలకు భంగం కలిగించే వారిని దెబ్బకుదెబ్బ తీస్తామంటూ ముస్లిం పెద్దలు బెదిరింపులకు దిగారు. ఈరోజు మైన్మార్‌ను హెచ్చరించిన ముస్లిం పెద్దలు రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చే ప్రమాదం ఉన్నది. జైషే మహమ్మద్, లష్కరే తయ్యబా, ఐ.ఎస్.ఐస్ తదితర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న రొహింగ్యాల మూలంగా భారతదేశం శాంతిభద్రతలకు తీరని విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది. మైన్మార్‌లో సర్వస్వం కోల్పోయిన రొహింగ్యాలను ఆదుకునేందుకు ఆర్థికంగా, ఇతరత్రా పెద్దఎత్తున సహాయం చేయవచ్చు. కానీ వారికి ఏకంగా భారత పౌరసత్వం ఇచ్చి ఇక్కడే స్థిరనివాసం కల్పించటం సమర్థనీయం, శ్రేయస్కరం కాదు. ఇప్పటికే బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరబడి పశ్చిమ బెంగాల్‌తోపాటు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో పాతుకుపోయిన మైనారిటీలతో ఇప్పటికే పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వీరికి రొహింగ్యా ముస్లింలు తోడైతే తీవ్రమైన శాంతిభద్రతల సమస్యతోపాటు సామాజిక సమస్యలు ఎదురవుతాయి. జనాభాపరమైన అసమానతలు నెలకొని చివరికది మతాలు, వర్గాలమధ్య ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉన్నది. రొహింగ్యా ముస్లింలు దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాదు, జమ్ము, మేవాత్‌లలో పాటు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తిష్టవేసేంత వరకు ప్రభుత్వం ఎందుకు నిద్రపోయింది? నిఘా వర్గాలు చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చున్నాయి? రొహింగ్యాల మూలంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదకర పరిస్థితులు నెలకొనేందుకు ఎవరు కారణం అనేది నిర్ధారించవలసిన అవసరం ఎంతో ఉన్నది. మైన్మార్ ప్రభుత్వం 2012 సంవత్సరంలో తమ దేశంలోని రఖైన్ ప్రాంతంలో నివసిస్తున్న రొహింగ్యా ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేస్తూ చట్టం చేసినప్పటి నుండి వీరు బంగ్లాదేశ్, భారత్ తదితర దేశాలకు అక్రమంగా వలసపోవటం ప్రారంభమైంది. వాస్తవానికి రొహింగ్యాలు భారతదేశానికి వలస రాలేదు. వారు శరణార్థులు కాదు. దేశంలోకి అక్రమంగా అడుగు పెట్టి పలు ప్రాంతాల్లో తిష్ట వేశారు. మానవత్వం పేరుతో జరుగుతున్న రొహింగ్యా మత రాజకీయాన్ని అడ్డుకొనకపోతే దేశ భద్రతకు తీవ్ర ప్రమాదం వస్తుంది. రొహింగ్యాలను మానవతా దృక్పథంతో చూడాలి. వారు ఇక్కడ నివసించేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం అంగీకరించాలంటూ పలువురు మానవతావాదులు, వివిధ ఎన్.జి.ఓ సంస్థలు, ఇతరులు విజ్ఞప్తి చేస్తున్నారు. చివరకు ఐక్యరాజ్యసమితి కూడా రొహింగ్యాలను దేశం నుండి పంపించివేయటం అన్యాయమంటూ విమర్శలు గుప్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విజ్ఞప్తులు, విమర్శలను పక్కన పెట్టి రొహింగ్యాలను పంపించివేస్తామని స్పష్టం చేసింది. రొహింగ్యాల మూలంగా దేశ భద్రతకు ముప్పు ఉన్నదని సుప్రీం కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టుకు కేంద్రం అలా చెప్పినంత మాత్రాన సరిపోదు. రొహింగ్యాలను వీలున్నంత త్వరగా దేశం నుండి పంపించివేయటం మంచిది. కేంద్ర హోంశాఖ చెబుతున్న లెక్కల ప్రకారం నలభై వేల మంది రొహింగ్యాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి అక్రమంగా వచ్చారని చెబుతోంది. మైన్మార్ నుండి బయలు దేరిన రొహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడి నుండి పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హైదరాబాద్, జమ్ముకశ్మీర్‌కు చేరుకున్నారు. రొహింగ్యాలు జమ్ము, ఢిల్లీ, హైదరాబాదుకు ఎలా చేరుకోగలుగుతున్నారనేది నిఘా వర్గాలు ఇంతవరకు ఛేదించలేకపోవటం సిగ్గుచేటు. తెరవెనక నుండి పావులు కదుపుతున్న కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు రొహింగ్యాలను ఒక పథకం ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి పంపిస్తున్నారు. మైనారిటీ ప్రజల సంఖ్య పెంచే లక్ష్యంతో రొహింగ్యాల మోహరింపు జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ‘మైనారిటీలు’ మెజారిటీ సంఖ్యకు చేరిపోయారు. అందుకే వీరు ముస్లిం మైనారిటీల సంఖ్య తక్కువ ఉన్న ప్రాంతాలలోకి రొహింగ్యాలను పంపిస్తున్నారు. మైన్మార్‌లో రొహింగ్యాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లక్షలాది స్థానిక ముస్లింలు ప్రదర్శనలు నిర్వహించారు. రొహింగ్యాలపై దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. మన దేశంలోని రొహింగ్యాలను పంపించివేయకూడదని భారీ ప్రదర్శన నిర్వహించిన నాయకులు ఎన్.డి.ఏ ప్రభుత్వానికి విజప్తి చేశారు. రొహింగ్యాలను పంపించివేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందంటూ వారు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వారు భారీ ప్రదర్శన ద్వారా బల ప్రదర్శనకు దిగారు. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లోని హిందువులు, సిక్కులపై జరుగుతున్న దాడులు, మత మార్పిడుల గురించి పట్టించుకోని వీరు మైన్మార్ ముస్లింల గురించి ఎందుకు భారీ ప్రదర్శనకు దిగారు. దీని వెనుక మత రాజకీయం ఉన్నదనేది స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ మైన్మార్ ముస్లింలకు మద్దతు ఇస్తోంది. దేశంలోని అక్రమంగా వచ్చిన మైన్మార్ ముస్లింలను పంపించకూడదంటూ ప్రకటనలు జారీ చేస్తోంది. ఆమె అంతటితో ఆగకుండా ముస్లింల పండుగ పూర్తి అయ్యేంత వరకు దుర్గాపూజా కేంద్రాల్లో రాత్రి పది గంటల తరువాత పూజ జరుగకూడదని నిషేధం విధించింది. ఆమె దుర్గ విగ్రహాల విసర్జనపై నిషేధం విధించారు. అయితే మమతా బెనర్జీ ఆదేశాలను పశ్చిమ బెంగాల్ హైకోర్టు కొట్టివేయటంతో వివాదానికి తెరపడింది. మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయం మూలంగా బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌లోకి వచ్చిన రొహింగ్యాలు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సంపాదించుకున్నారు. వీటి ఆధారంగా రొహింగ్యా ముస్లింలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు స్థిర నివాసానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవటంలో కొన్ని సంస్థలు సహకరిస్తున్నాయి. ఒక పథకం ప్రకారం వీరిని కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాలకు పంపిస్తున్నారు. జమ్ము పట్టణంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రొహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పాటు చేయించటం వెనక ఒక పకడ్బందీ వ్యూహం ఉన్నది. జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు, జమ్ము, కాశ్మీర్, లద్దాక్ ఉన్నాయి. కాశ్మీర్‌లో ముస్లింలు మెజారిటీలో ఉంటే జమ్ములో హిందువులు, లద్దాక్‌లో బౌద్ధులు మెజారిటీలో ఉన్నారు. రొహింగ్యాలకు జమ్ములో బస ఏర్పాటు చేయటం ద్వారా మైనారిటీల సంఖ్య పెంచే ప్రయత్నం జరుగుతోంది. లద్దాక్‌లో కూడా ఇదే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీనితో లే పట్టణంలో గత వారం మత ఘర్షణలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పాత బస్తీలో రొహింగ్యా ముస్లింలకు బస ఏర్పాటు చేయిస్తారు. హైదరాబాద్‌లోని పాత బస్తీకి రొహింగ్యాలను పంపించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని హోం శాఖ అధికారులు చెబుతున్నారు. వీరు కొంత స్థిరపడిన తరువాత తమ హక్కుల కోసం పోరాడితే అదుపు చేయటం కష్టమని హోం శాఖ చెబుతోంది. తమను భారతదేశం నుండి పంపించివేసేందుకు వీలు లేదంటూ కొందరు రొహింగ్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రొహింగ్యాలు స్థానిక ముస్లిం సంస్థలు, నాయకుల సహాయంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
రొహింగ్యా ముస్లింలకు పలు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయ్యబా తదితర ఉగ్రవాద సంస్థలు వీరికి ఆయుధాలను చేరవేస్తున్నాయి. మైన్మార్‌లో బౌద్ధులను ఎదుర్కొనేందుకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. మైన్మార్‌లోని రఖైన్ ప్రాంతంలోల రెండు వర్గాల మధ్య పెద్దఎత్తున ఘర్షణలు జరుగుతున్నాయి. రొహింగ్యా ముస్లింలు స్థానిక పోలీస్ స్టేషన్‌పై జరిపిన దాడిలో దాదాపు 32 మంది పోలీసులు మరణించిన తరువాతనే స్థానిక ప్రభుత్వం కళ్లు తెరిచింది. మైన్మార్ సైన్యం ఒక పథకం ప్రకారం రొహింగ్యాలను దేశం నుండి తరిమివేస్తోంది. బౌద్ధులకు తోడుగా సైన్యం దిగటంతో రొహింగ్యా ముస్లింలపై దాడులు మరింత ఉధృతమయ్యయి. మైన్మార్‌లో రొహింగ్యా ముస్లింపై బౌద్ధులు దాడుల చేయటానికి పలు కారణాలున్నాయి. బ్రిటిష్ పాలకులు తెచ్చి పెట్టిన రొహింగ్యా ముస్లింలు తమ ప్రాంతంలో ఉన్న బౌద్ధులను తరిమివేయటం ప్రారంభించారు. తమ ఆధిపత్యం పెంచుకునేందుకు రొహింగ్యాలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. రెండో ముఖ్యమైన కారణం బంగ్లాదేశ్‌లోని బౌద్ధులపై జరుగుతున్న అత్యాచారాలు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పర్వత ప్రాంతాల్లో దాదాపు ఆరు లక్షల మంది బౌద్ధులుండేవారు. అయితే బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలతోపాటు స్థానిక పోలీసులు వీరిపై అత్యాచారాలు కొనసాగించటం వలన పలువురు మైన్మార్‌కు పారిపోయారు. ఇలా మైన్మార్‌కు పారిపోయిన బౌద్ధులు ప్రతీకార చర్యగా రొహింగ్యా ముస్లింలపై దాడులు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో బౌద్ధులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మైన్మార్‌లోని రొహింగ్యాలను ఊచకోతకు గురి చేస్తున్నారు. బంగ్లాదేశ్ ముస్లింలకు, బౌద్ధులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు మన దేశానికి ప్రమాదంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోత తీరని నష్టం వాటిల్లుతుంది.

కె కైలాష్