ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కేంద్రం కళ్లు తెరిచేది ఎపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వస్తున్న ముస్లింల కారణంగా అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా పరిస్థితులు మారిపోతున్నాయంటూ మన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన హెచ్చరికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తూ సైనికదళం అధిపతి ఈ ప్రకటన చేయటం చూస్తుంటే ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అసోంలో స్థానికుల జనాభాతో పోలిస్తే బంగ్లాదేశీయుల జనాభా బాగా పెరిగిపోయి ఉండాలి. వలస వచ్చే వారి వల్ల అసోంలో రాజ్యాధికారం చేతులు మారే విపత్కర పరిస్థితులు నెలకొనటం లేదా నెలకొనే ప్రమాదం ఏర్పడిందని భావించక తప్పదు. ఇస్లామిక్ జిహాదీల ద్వారా జమ్ము-కాశ్మీర్ లో పరోక్ష యుద్ధం కొనసాగిస్తున్న పాకిస్తాన్ తన కుట్రలో భాగంగా బంగ్లాదేశీయులను మన దేశంలోకి అక్రమంగా పంపిస్తోంది. తద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపుతోంది. పాకిస్తాన్ అమలు చేస్తున్న ఈ కుట్రకు చైనా సహాయ సహకారాలను అందజేస్తోదంటూ బిపిన్ రావత్ చేసిన ప్రకటన అక్కడ నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది. సైన్యాధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి బంగ్లాదేశ్ ముస్లింల అక్రమ వలసల గురించి హెచ్చరించవలసి వచ్చిందంటే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవటం లేదని భావించవలసి ఉంటుంది. బంగ్లాదేశీయుల వలసల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే మతపరంగా జనాభా సమతూకం దెబ్బతింటోంది. అసోంలో ముస్లింలకు నాయకత్వం వహిస్తున్న ఏఐయుడీఎఫ్ (అఖిల భారత సమైక్య ప్రజాస్వామ్య కూటమి) బంగ్లాదేశీయుల మద్దతుతో దినదినాభివృద్ది చెందుతోంది. అధికార భాజపాతో పోలిస్తే ఈ పార్టీ అభివృద్ది గణనీయంగా ఉన్నదని రావత్ చెప్పటం గమనార్హం.
ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వౌ లానా బద్రుద్దీన్ అజ్మల్ రావత్ ప్రకటనను ఖండించడమే గాక, ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. బద్రుద్దీన్ అజ్మల్ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తి అనే ఆరోపణ ఉంది. ఈ ఆరోపణపై పలు స్థాయిలలో విచారణ జరిగినా ఇంకా కొలిక్కి రాలేదు. ఈశాన్య రాష్ట్రాల్లోకి అక్రమంగా వలస వస్తున్న బంగ్లాదేశ్ పౌరులకు అజ్మల్ నాయకత్వంలోని ఫ్రంట్ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తూ భారత పౌరసత్వం సంపాదించేందుకు అండగా ఉంటోందన్నది మరో ప్రధాన ఆరోపణ. బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలను ఆపకపోతే అతి సమీప భవిష్యత్తులో అసోంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అక్రమ వలసలకు అజ్మల్ నాయకత్వంలోని ఫ్రంట్‌తోపాటు ప్రత్యక్షంగా పాకిస్తాన్, పరోక్షంగా చైనా పని చేస్తున్నాయనే మాట వినిపిస్తోంది. భారత్‌ను రెండు వైపుల నుండి ఇబ్బందుల్లో పడవేసే కుట్ర పూరిత వ్యవహాంలో భాగంగానే పాకిస్తాన్, చైనాలు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని, బంగ్లా ముస్లింల వలసలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయని చెప్పకతప్పదు.
ప్రపంచంలోనే మూడో అభివృద్ధి చెందిన దేశంగా మారటంతోపాటు అగ్రరాజ్యంగా అవతరించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న చైనా ఆసియాలో తన అధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు మన దేశాన్ని దెబ్బ తీస్తోంది. దీని కోసం పాకిస్తాన్‌ను ఒక ఆయుధంగా వాడుకుంటోంది. మన దేశంతో ఉన్న శత్రుత్వంతో పాకిస్తాన్ కూడా చైనాకు అన్ని విధాలా తోడ్పడుతోంది. జమ్ము- కాశ్మీర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ ముస్లింల వలసల ద్వారా మన దేశాన్ని దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను దెబ్బతీసేందుకు తరుణోపాయం ఏమిటన్నది కేంద్రానికి అర్థమవుతున్న సూచనలు కనిపించటం లేదు. ఎంత కఠినంగా శిక్షిస్తే పాకిస్తాన్ అంతే వేగంతో మళ్లీ మనపై విరుచుకుపడుతోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాకిస్తాన్‌ను దారికి తెచ్చేందుకు ప్రధాని మోదీ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ ప్రధాన మంత్రి నవాజ్‌షరీఫ్‌ను ఆహ్వానించటంతోపాటు ఆయన మనవరాలి పెళ్లి సందర్భంగా పాకిస్తాన్‌కు వెళ్లటం ద్వారా మోదీ దౌత్యనీతిని ఉపయోగించేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవటంతో పాకిస్తాన్‌కు వెన్నుదన్నుగా ఉంటున్న పలు ముస్లిం దేశాల మద్దతు సంపాదించేందుకు ప్రయత్నించారు. కానీ ఈ ప్రయత్నం కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పాకిస్తాన్‌ను దారికి తెచ్చేందుకు సామ,దాన,్భద, దండోపాయాలను మోదీ ఉపయోగించినా పరిస్థితుల్లో మార్పురావటం లేదు. పాకిస్తాన్‌కు చైనాతోపాటు సౌదీ అరేబియా తదితర ముస్లిం దేశాలన్నీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాయి. అణుబాంబు కలిగి ఉన్న ఏకైక ముస్లిం దేశం కాబట్టే పాకిస్తాన్‌కు ఇతర ముస్లిం దేశాలు అండగా నిలిచాయి. పాకిస్తాన్ పాలకులు ఈ మద్దతును దుర్వినియోగం చేస్తూ మన దేశంపై ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పటంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ ముస్లింల వలసలు పెంచుతోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ కుట్రను తిప్పికొట్టేందుకు మోదీ ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు అనేక చర్యలు తీసుకుంది. అయినా పాక్ ధోరణి మారడం లేదు.
జమ్ము-కాశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల సైనికుల మద్య ఘర్షణ జరగని రోజు లేదు. కాల్పుల విరమణను ఉల్లంఘించటం పాకిస్తాన్‌కు ఒక అలవాటుగా మారింది. కాల్పుల విరమణను ఉల్లంఘించటం, ఇస్లామిక్ ఉగ్రవాదుల ద్వారా మన సైనిక శిబిరాలపై దాడులు జరపటం వంటి చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం పలు మార్లు మెరుపు దాడులు నిర్వహించింది. సరిహద్దుల్లోని పాకిస్తాన్ బంకర్లను పేల్చివేయటం అనేది భారత సైన్యానికి ఒక దినచర్యగా మారింది. కాశ్మీర్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. రాష్ట్రంలో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నా హింసాత్మక చర్యలు మాత్రం తగ్గటం లేదు. ఇస్లామిక్ జిహాదీల దాడుల మూలంగా గత రెండు నెలల్లో 24 మంది సైనికులు, పౌరులు మరణించారు. కాశ్మీర్ సరిహద్దులో ఒక సంవత్సర కాలంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం వలన పాకిస్తాన్ సైనిక పాలకుల వైఖరిలో మార్పు రావచ్చునని మొదట భావించారు. అయితే ఇలాంటిదేదీ జరిగే అవకాశాలు లేవని సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు సూచిస్తున్నాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తే పాకిస్తాన్ పాలకులు, సైనిక పాలకులు అంత కంటే ఎక్కువ కఠినంగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ పాలకులకు, సైనిక అధికారులకు వారి దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఎలాంటి పట్టింపు లేదనిపిస్తోంది.
భారత్‌తో గొడవ పడటమే తమ ప్రథమ కర్యవ్యం అనే విధంగా పాకిస్తాన్ పాలకులు, సైనిక నేతలు వ్యవహరిస్తున్నారు. కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఇస్లామిక్ జిహాదీ కార్యక్రమలకు- ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ ముస్లింల వలస రాజకీయం తోడైతే మన దేశం ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతుందనేది సులభంగానే ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో జనరల్ బిపిన్ రావత్ చేసిన హెచ్చరికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వస్తున్న వారికి మయన్మార్ నుండి వస్తున్న రొహింగ్యా ముస్లింలు కూడా తోడైతే అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయి. ఫలితంగా దేశ సమగ్రత,్భద్రతకు పెను ప్రమాదం ఏర్పడుతుంది. *

- కె.కైలాష్ సెల్: 98115 73262