ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

దిగజారుతున్న ఎన్నికల వ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు అభివృద్ధి మంత్రానికి బదులు కుల కుతంత్రాలకు పెద్ద పీట వేయటం అత్యంత దురదృష్టకరం. ఈ సంవత్సరాంతం లేదా వచ్చే సంవత్సరం జనవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రాం తీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలు సైతం ముఖ్యమైన కులాలకు చెందిన ప్రజల మద్దతు సంపాదించేందుకు రక, రకాల ఎత్తులు వేయటం రాజకీయ వ్యవస్థకు పట్టిన దుర్గతికి అద్దం పడుతోంది. రాష్ట్భ్రావృద్ధికి తాము అనుసరించే విధానాలను ప్రజల ముందు పెట్టి ఓట్లు అడగవలసిన పార్టీలు ఇందుకు భిన్నంగా ఆయా కులాలకు తాయిలాల ఆశ చూపిస్తూ మద్దతు సంపాదించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేయటం సిగ్గు చేటు. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ, అధికారం తమదేనని కలలు కంటున్న బి.ఎస్.పి, బి.జె.పిలతోపాటు తమ ఉనికిని కాపాడుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం కుల సమీకరణలతో తల మునకలవుతోంది.
ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ తన యాదవ్ ఓట్ బ్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంటూ ముస్లిం, కుర్మి, ఇతర వెనుకబడిన కులాల మద్దతు సంపాదించేందుకు గట్టిగా కృషి చేస్తోంది. మా యావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ దళిత ఓటు బ్యాంకుకు ముస్లిం, బ్రాహ్మణులతోపాటు యాదవుల ఓట్లు కలిపేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కనీ,వినీ ఎరుగని రీతిలో ప్రయత్నిస్తున్న బి.జె.పి తన బ్రాహ్మణ ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటూ వెనుకబడిన కులాలకు చెందిన పాల్, కుర్మి కులాలతోపాటు జాట్ కులం ఓట్లు కూడగట్టుకునేందుకు ఎత్తులు వేస్తోంది. ఇక కనుమరుగయ్యేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ దళితులతోపాటు బ్రాహ్మణ ఓట్లు సంపాదించేందుకు విశ్వ ప్రయ త్నం చేస్తోంది.
ఈ నాలుగు పార్టీల నాయకులు కులాల సమీకరణాన్ని బాహాటంగా చేస్తున్నారు. ఏ ఒక్క పార్టీ కూడా అభివృద్ధి విధానాల గురించి మాట్లాడటం లేదు. వీరి దృష్టి అంతా అధిక సంఖ్యలో ఉన్న కులాల వారి మద్దతు కూగట్టేందుకు ఎలాంటి తాయిలాలు ఇవ్వాలనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నది. ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయ, సామాజిక రంగంలో కులం అత్యంత కీలక పాత్ర నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరు తమ కులానికి కట్టుబడి ఉండటంతోపాటు పూర్తి స్థాయి కులతత్వాన్ని పాటిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో కులతత్వం మహమ్మారి రూపం ధరించి విలయతాండవం చేస్తోంది. ఇక్కడి ప్రజలు కులం కోసం ఎంతటి దా రుణానికైనా ఒడిగడతారు. కులాల మధ్య పోరాటం ఇక్క డ సర్వసామాన్యం. ఉత్తర ప్రదేశ్‌లో మనువాద సిద్ధాంతాన్ని తుచతప్పకుండా పాటిస్తారు. అందుకే ఇక్కడకు లాల కొట్లాటలు తరచుగా జరుగుతుంటాయి. ఈ కుల తత్వాన్ని నిర్మూలించేందుకు కృషి చేయవలసిన రాజకీయ పార్టీలు తమ అధికార దాహాన్ని తీర్చుకునేందుకు కులతత్వాన్ని మరింత ప్రోత్సహించటంతోపాటు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అంటే యాదవ కుల కేంద్రం, బహుజన్ సమాజ్ పార్టీ అంటే దళితుల అధిపత్యానికి ప్రతీక, బి.జె.పి, కాంగ్రెస్‌లు బ్రాహ్మణ కులానికి ప్రతీకలుగా మారాయి.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జనాభా దాదాపు ఇరవై కోట్లుంటే ఇందులో వెనుకబడిన కులాల వారి సంఖ్య దాదాపు నలబై శాతం. బి.సిల్లో యాదవులు ఏడు శాతం ఉన్నారు. పాల్, గడరియా, ధన్‌గర్,్భగేల్ పేర్లతో పిలవబడే గొర్రెల కాపర్ల జనాభా దాదాపు ఆరు శాతం, కుష్వాహ, లోధ్, తదితర బి.సిలు ఇరవై శాతం మంది ఉన్నారు. షెడ్యూల్డు కులాల జనాభా దాదాపు ఇరవై ఒక్క శాతం ఉండగా ఇం దులో జాతవ్ (మాదిగల) జనాభా 12 శాతం ఉన్నది. పసి, దోబి, కోరి,బాల్మీకి తదితరులు మిగతా 8 శాతం మంది ఉన్నారు. ముస్లింల జనాభా దాదాపు19 శాతం ఉన్నది. ఉన్నత వర్గం ప్రజల్లో బ్రాహ్మణులు అత్యధికం, 10 శాతం ఉన్నారు. ఠాకుర్, రాజ్‌పూత్‌లు 4 శాతం, వైశ్యు లు 4 శాతం, త్యాగి, భూమిహార్‌లు 2 శాతం ఉన్నారు. రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య నామమాత్రమే. రాష్ట్ర జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న యాదవులు, పాల్, జాతవ్, ముస్లిం, బ్రాహ్మణ ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తే వారు విజయం సాధించటం ఖాయం. అందుకే సమాజ్‌వాదీ, బి.ఎస్.పి, బి.జె.పి కాంగ్రెస్ పార్టీలు కుల సమీకరణాలపై తమ దృష్టిని కేంద్రీకరించాయి. తమ రాజకీయ కుల సమీకరణాల కోసం కుల తత్వాన్ని తీవ్ర స్థాయిలో రెచ్చగొడుతున్నాయి. రాష్ట్రంలోని యాదవులంతా సమాజ్‌వాదీకి ఓ టు వేస్తారు. ఇతర పార్టీలు ఏం చేసినా యాదవుల మెజారిటీ ఓట్లు సమాజ్‌వాదీ పార్టీకి స్వంతం. అందుకే బి.జె.పి యాదవులతో సమానంగా ఉన్న గొర్రెల కాపర్ల మద్దతు కూడ గట్టేందుకు ఎత్తులు వేస్తోంది. గొర్రెల కాపర్ల వర్గానికి చెందిన మాజీ ఎం.పి ఎస్.పి.సింగ్ భగేల్‌ను వెనుకబడినకులాల మోర్చా అధ్యక్షుడుగా నియమించింది. బి.జె.పి సహజ మద్దతుదారులైన బ్రాహ్మణులు, జాట్‌లతోపాటు పాల్, భగేల్ వర్గం ఓట్లు సంపాదించగలిగితే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయసంగా విజయం సాధించగలుగుతామని బి.జె.పి జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని కుర్మి వర్గం ఓట్లను సంపాదించేందుకు బి.జె. పి ఏకంగా ఈ కులానికి చెందిన మహిళా ఎం.పికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వటం గమనార్హం. బి.జె.పికి యాదవులు, దళితులు, ముస్లింలు పెద్దగా ఓట్లు వేయరు. అందుకే బి.జె.పి అధినాయకత్వం వెనుకబడిన కులాలకు చెందిన పాల్,్భగేల్ ఓట్లు సంపాదించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఎస్.పి.సింగ భగేల్ ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతి జిల్లాకు వెళ్లి పాల్, భగేల్ వర్గాల ఓట్లు కూడగట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బి.ఎస్.పి అధినేత మాయావతి దళిత, ముస్లిం ఓట్లతోలపాటు మరోసారి బ్రాహ్మణ వర్గం ఓట్లు సంపాదించేందుకు పావులు కదుపుతోంది. మాయావతి గతంలో ఒక సారి దళిత, ముస్లిం ఓటు బ్యాంకుకు బ్రాహ్మణ ఓటు బ్యాంకును చేర్చుకోవటం ద్వారా అధికారంలోకి రావటం తెలిసిందే. ఆమె ఇప్పుడు మరోసారి ఇదే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే పార్టీకి చెందిన ఒక సీనియర్ బి.సి నాయకుడు బైటికి వెళ్లిపోవటంతో బి.ఎస్.పి కొంత ఇబ్బందిని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో కనుమరుగయ్యేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం ద్వారా బ్రాహ్మణ వర్గం ఓట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది.