ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మోదీ, షా ఏకఛత్రాధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన నిరాశపరిచిందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేసిన ప్రకటన సత్యదూరం. మోదీ ప్రభుత్వం ప్రచారం, ప్రసంగాలు తప్ప సమర్థ పాలనను అందజేయలేకపోతోందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శ వెనక రాజకీయం తప్ప మరేమీ లేదు. ఎన్.డి.ఏ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో సమర్థంగానే పని చేసింది. అవినీతికిఅ అడ్డుకట్ట వేయటంలో మోదీ ప్రభుత్వం కొంత వరకు విజయం సాధించింది. గత రెండు సంవత్సరాల్లో ఎలాంటి పెద్ద కుంభకోణాలు జరగలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం పూర్తి నిజాయితీతో పని చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు మంత్రులు చిలక్కొట్టుడు కొడుతుండ వచ్చు కానీ మంత్రులు, వారి సిబ్బంది చేసే నిలువు దోపిడి అనేది ఇప్పుడు లేదని చెప్పవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం స్థాయిలో కూడా అవినీతి, అక్రమాలు కొంత వరకు అదుపులోకి వచ్చాయి.
నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతికి పాల్పడే అవకాశం లేకపోవటంతో మంత్రులు, అధికార యంత్రాంగం కూడా బరితెగించి అవినీతికి పాల్పడేందుకు ధైర్యం చేయలేకపోతోంది. అవినీతి పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేము కానీ యు.పి.ఏ హయాంలో జరిగినట్లు విచ్చలవిడి అవినీతి ఆగిపోయింది. మోదీ ప్రభుత్వం అభివృద్ది మంత్రం బాగానే పని చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ అదుపు, నియంత్రణతోపాటు క్రమం తప్పకుండా చేస్తున్న సమీక్షల మూలంగా మంత్రులు కష్టపడి పని చేస్తున్నారు. మంత్రుల్లో పోటీ తత్వాన్ని తెచ్చిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుంది. మంత్రులు తమ బాధ్యతల నిర్వహణ కోసం కష్టపడి పని చేస్తున్నారు. మంత్రులతోపాటు అధికారులు కూడా పని చేయకతప్పటం లేదు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మోదీ వేగాన్ని అందుకోలేకపోతోంది.
మోదీ ప్రారంభించిన పలు పథకాలు ప్రజల్లోకి వెళుతున్నాయనేది నిజం. ధనవంతులు రాయితీ గ్యాస్ సిలెండర్లను వదలుకోవాలంటూ మోదీ ఇచ్చిన పిలుపు సమాజంపై రెండు రకాల ప్రభావాన్ని చూపించింది. ధనవంతులు ఆత్మ పరిశీలన చేసుకునేందుకు అవకాశం ఇవ్వటంతోపాటు సమాజం పట్ల తమకున్న బాధ్యతను ఈ పిలుపు గుర్తు చేసింది. లక్షలాది మంది స్వచ్చందంగా రాయితీ గ్యాస్ కనెక్షన్లను వదులు కోవటం మామూలు విషయం కాదు. ప్రజలను ఆలోచింపచేసిన ఈ పథకం ప్రభావం ఇతర అంశాలపై కూడా పడితే సమాజానికి మరింత లాభం కలుగుతుంది. ధనవంతులు వదలుకున్న గ్యాస్ కనెక్షన్లను బీదరికం స్థాయికి దిగువన ఉన్న ఐదు లక్షల మందికి మందికి కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పించటం మామూలు విషయం కాదు. పది లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారి రాయితీ కనెక్షన్లు తొలగించటం సమర్థనీయ విధానం. జనధన్ యోజన కూడా సమాజంలోని బడుగు,బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తోంది. ఇప్పుడు ఎవరైనా బ్యాంకుకు వెళ్లి తమ ఖాతాను తెరిచేందుకు వీలు కలిగింది. ఈ పథకం కింద తెరిచిన బ్యాంక్ ఖాతాలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. జనధన్ ఖాతాలను నగదు బదిలీ పథకాలతో జోడించటం ద్వారా సంక్షేమ పథకాల అమలులో ఇంత కాలం చోటు చేసుకున్న అవినీతికి అడ్డుకట్టపడటంతోపాటు ప్రభుత్వ ధనం దుబారా పూర్తగా ఆగిపోయే పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేసే ఒక రూపాయిలో దాదాపు ఎనభై పైసలు నిర్వహణ, దుబారా, అవినీతికి ఆహుతైపోయేది. నగదు బదిలీ పథకం ద్వారా అరవై నుండి తొంబై శాతం, కొన్ని కేసుల్లో నూటికి నూరు శాతం ప్రభుత్వ నిధులు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయ. డిజిటల్ ఇండియా, స్టార్డ్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు ముందు,ముందు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. స్మార్ట్ నగరాల పథకం మన నగరాల రూపు రేఖలను మార్చుతుందని ఆశించాలి. అయితే స్వచ్చ భారత్ పథకం ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. స్వచ్చ భారత్ ఎంతో మంచి ఆలోచన అయితే ఇది సగటు మనిషిని చేరుకోవటం లేదు.
మరుగుదొడ్ల పథకం గ్రామీణ ప్రాంతంలో పెను మార్పుకు శ్రీకారం చుడుతోంది. ఇంటింటికి మరుగుదొడ్డి పథకం గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మారుస్తుందని చెప్పకతప్పదు. ఎన్.డి.ఏ ప్రభుత్వం రహదారులు, రైల్వే, ఇంధనం, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం తదితర రంగాల్లో పెను మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారత దేశం ముఖ చిత్రాన్ని మార్చివేస్తామంటూ నరేంద్ర మోదీ 2014 ఎన్నికల ప్రసంగాల్లో ఇచ్చిన హామీని పూర్తి చేసేందుకు ఈ పథకాలన్నీ తోడ్పడతాయి. అయితే కేంద్రంలో బి.జె.పి అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలో నెలకొన్న, నెలకుంటున్న మతపరమైన ఘర్షణ వాతావరణాన్ని తొలగించటంలో మోదీ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారు. నరేంద్రమోదీ, ఆర్.ఎస్.ఎస్ గత రెండు సంవత్సరాల్లో రామమందిర నిర్మాణం గురించి ఎలాంటి మాట మాట్లాడకపోవటం గమనార్హం. అయితే భజరంగ్ దళ్ లాంటి ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు మూలంగా మతపరమైన అసహనం బాగా పెరుగుతోంది. దీనిని అదుపు చేసేందుకు మోదీ గట్టిగా ప్రయత్నించాలి.
అంతా తానై చేయాలనే ఆలోచనా విధానానికి మోదీ ఇకనైనా స్వస్తి పలకం మంచిది. ఒకరిద్దరు తప్ప మిగతా మంత్రులకు పెద్దగా స్వేచ్చ లేదు. ప్రభుత్వంలో నరేంద్ర మోదీ, బి.జె.పిలో అమిత్ షా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది మంచిది కాదు. ప్రభుత్వం, పార్టీలో అంతర్గత స్వేచ్చ లేకుండా చేయటం మంచి విధానం కాదు. నరేంద్ర మోదీ ఒక హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నారు తప్ప అందరిని కలుపుకునిపోయే నాయకుడిగా వ్యవహరించటం లేదు.