ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అజేయం నుంచి అపజయం వైపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటమి ఎరుగని ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా అపజయం వైపు పయనిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో తిరుగులేని నేతగా అవతారమెత్తిన మోదీ రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఆయన నాయకత్వంలో భాజపా మళ్లీ విజయం సాధిస్తుందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ‘మోదీ హవా ఖాయమ’ని అనుకున్నవారికి ఇ ప్పుడు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అవినీతికి దూరంగా ఉంటూ పటిష్టమైన పాలన అందజేస్తున్న ఆయనకు ఈ పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి? దీనికి చాలావరకూ ఆయన వైఖరే కారణమని భావించక తప్పదు. మొత్తం ఖ్యాతి అంతా తనకే దక్కాలనుకోవడం, మిగతా వారంతా తాను చెప్పేది వినాలనుకోవడం మోదీ విధానం. సమష్టి నిర్ణయాలు, ఇచ్చిపుచ్చుకునే విధానం ఆయన డైరీలో లేకుండాపోయాయి. దీంతో పార్టీలో ఆయన ఏకాకిగా మారే పరిస్థితి ఏర్పడుతోంది.
భారత, పాకిస్తాన్ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక ఇందిరాగాంధీ లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత ‘కోటరీ’ రాజకీయాల ఫలితంగా ఆమె ప్రజలకు దూరమయ్యారు. డీకే బారువా లాంటి నేతలు ‘ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా’ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తారు. ఇదంతా నిజమేననుకొని ఆమె నియంతలా వ్యవహరించి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు మోదీ కూడా పార్టీలో, ప్రభుత్వంలో తానే సర్వం అన్నట్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఒంటెత్తు పోకడలతో ఆ పార్టీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్డీయే ప్రభుత్వంలో ఇతర జా తీయ, ప్రాంతీయ నేతలకు ఎ లాంటి గౌరవం లేదు. అధికార భాజపాలో ఆ పార్టీ సీనియర్ నాయకులకే గుర్తింపులేదు. పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి గత నాలుగేళ్లుగా నిరాశే మిగిలింది. నేతలు, సీనియర్ కార్యకర్తలకు పదవులిస్తే అవినీతి పెరిగిపోయి ప్రజల్లో చెడ్డపేరు వస్తుందనే వాదనతో మోదీ కాలక్షేపం చేస్తున్నారు. పదవుల పందేరానికి జాబితాలు పలుమార్లు తయారై చెత్తబుట్టలోకి వెళ్లిపోయాయి తప్ప ఎవరికీ అందలాలు దక్కలేదు. కొందరికి పదవులు ఇప్పించుకున్న పెద్ద నాయకులు క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించారు. తమను నిర్లక్ష్యం చేస్తున్న పార్టీ అధినాయకత్వానికి రానున్న ఎన్నికల్లో గుణ పాఠం నేర్పించేందుకు క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో భాజపా పరాజయం పార్టీ అధినాయకత్వం పట్ల కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తికి, కోపతాపాలకు అద్దం పడుతోంది. అఖండ విజయం ఖాయమనుకున్న ఈ సీట్లలో భారీ మెజారిటీతో భాజపా అభ్యర్థులు ఓడిపోయారు. పార్టీ కార్యకర్తలే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు కూడా భాజపాకు షాక్ ఇచ్చారు. కొన్ని సామాజిక వర్గాలు దూరమవుతున్నందున దేశం మొత్తం మీద భాజపాకు ఎదురుగాలి వీస్తోంది.
2014లో మోదీ అధికారంలోకి రావటంలో వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కీలకపాత్ర నిర్వహించాయి. నాలుగు సంవత్సరాల తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీసీ వర్గాలు సమయం కోసం ఎదురు చూస్తుండగా, ఎస్.సిలు మాత్రం మోదీపై తమ అసంతృప్తిని ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రభుత్వంపై ‘దళిత వ్యతిరేకి’ అనే ముద్ర పడిపోతోంది. తాను బీసీ కులానికి చెందినందునే తనపై పగ బడుతున్నారంటూ ప్రతిపక్షాలపై మోదీ ఆరోపణలు చేయటం విడ్డూరం. మోదీ వ్యవహార శైలిని ప్రతిపక్షాలు విమర్శించటం అర్థం చేసుకోవచ్చు కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి. శివసేన, తెలుగుదేశం, అకాలీదళ్, కేంద్ర మంత్రి పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి, కాశ్మీర్‌లోని పీడీపీ వంటి పార్టీలు మోదీ తీరును తప్పుపడుతున్నాయి. కారణాలేమైనా శివసేన, తెదేపా ఎన్డీఏ నుండి తప్పుకున్నాయి. మోదీ చివరకు మంత్రివర్గ సహచరులను సైతం కలుపుకుని పోవటం లేదనే అపవాదున్నది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పాత్ర స్వల్పమనేది చాలా తక్కువ మందికి తెలుసు. దేశానికి బలమైన ప్రధాని ఉన్నప్పుడే ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తారు. పథకాల అమలు కూడా ఆశించిన స్థాయిలో ఉంటుంది. ప్రధాని తమ పనితీరును కనిపెడుతున్నారని, తప్పు చేస్తే శిక్ష తప్పదనే భయం మంత్రులకు ఉండాల్సిందే. అయితే మంత్రుల పనికూడా తనే చేయాలనుకునే ప్రధాని మంత్రి ఉండటం శ్రేయస్కరం కాదు. మంత్రులకు స్వతంత్రతను కల్పించాల్సి ఉంది. మోదీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాము ఏ పనిచేసినా మోదీ తప్పుపడతారని పలువురు మంత్రులు భయపడుతున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖకు చెందిన కార్యదర్శితో ఆయన నేరుగా మాట్లాడడం, ప్రతి మంత్రి వద్ద ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను పర్యవేక్షణ అధికారిగా నియమించడం సబబేనా? మోదీ సమర్థతపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే, అన్నీ తానే చేయాలనుకునే ఆలోచనా విధానం, మంత్రులపై నిఘా వంటివి సమస్యలకు కారణమవుతున్నాయి. గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఏ మేరకు పూర్తి చేయగలిగాము, ఇంకా చేయవలసింది ఎంత? అనేదానిపై మోదీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎన్నికలు సమీపిస్తున్నందున మోదీ వైఖరిలో మార్పునకు ఇదే అసలైన తరుణం. అయితే- ఇందుకు ఆయన ఎంతవరకూ సిద్ధమన్నది పెద్ద ప్రశే్న. ఇప్పటి పరిస్థితి ఇలాగే కొనసాగితే- భాజపాకు మళ్లీ అధికారం అనుమానమే.

- కె.కైలాష్ సెల్: 98115 73262