ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పౌర చట్టాన్ని అమలు చేయవలసిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు ముస్లిం దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిసాతన్‌లలో మతపరమైన హింస మూలంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు భారతీయ పౌరసత్వం కల్పించేందు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఏ రాష్ట్రం కూడా ఆపలేదు. ఈ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదంటూ కేరళ, పంజాబ్ చేస్తున్న ప్రకటనలు, శాసన సభలో ఆమోదించిన తీర్మానాలు ఎంత మాత్రం చెల్లుబాటు కావు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ తమ శాసన సభల్లో తీర్మానాలు చేశాయి. కేరళ ముఖ్యమంత్రి విజయన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైన దీని అమలును నిలిపివేయాలని కోరారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో ఉన్నది. సి.పి.ఎం అధినాయకత్వం ఆదేశం మేరకే కేరళ ముఖ్యమంత్రి విజయన్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ శాసన సభలో తీర్మానం చేయటంతోపాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విధంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశం మేరకే పంజాబ్ ముఖ్యమంత్రి క్యాప్టెన్ అమరీందర్ సింగ్ కూడా శాసన సభలో తీర్మానం చేయటంతో పాటు సుప్రీం కోర్టు తలుపులు తట్టాలనుకుంటున్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా కేరళ, పంజాబ్ మాదిరిగా తమ శాసన సభల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయటంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయవచ్చు. అయితే ఇవేవీ చెల్లవనేది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులకు బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వం జాబితాలో ఉన్న పౌరసత్వ చట్టానికి సవరణలు చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నదనేది పచ్చి నిజం. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయము, కానివ్వమంటూ ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగా కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు ప్రకటించినా ఈ నిర్ణయాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేవు. ఈ విషయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను తెలుసుకోవటం మంచిది. కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు కపిల్ సిబల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను పలుమార్లు పరిశీలించటం మంచిది. కపిల్ సిబల్ కేరళలోని కోజికోడ్‌లో గత వారం జరిగిన కేరళ సాహిత్య సదస్సులో ముఖ్యోపన్యాసం ఇస్తూ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయలేమని ఏ రాష్ట్రం కూడా చెప్పేందుకు వీలు లేదని కుండబద్దల కొట్టినట్లు చెప్పారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకూడదంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న సమయంలో కపిల్ సిబల్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. కేంద్ర జాబితాలోని అంశంపై పార్లమెంటు చేసిన చట్టాన్ని అమలు చేసేందుకు నిరాకరించే అధికారం ఏ ఒక్క రాష్ట్రానికి లేదంటూ కపిల్ సిబల్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. కపిల్ సిబల్ కేవలం కాంగ్రెస్ నాయకుడే కాదు రాజ్యాంగాన్ని ఒడిసిపట్టిన పేరెన్నికగన్న న్యాయవాది అనేది మరచిపోరాదు. పౌరసత్వ సవరణ చట్టం అమలు ఏ కొద్దిగైనా రాజ్యాంగ బద్ధం కాకపోతే కపిల్ సిబల్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాడు కాదనేది మనం గ్రహించాలి. కరడుకట్టిన కాంగ్రెస్‌వాదైన కపిల్ సిబల్ మాటలను వామపక్షాలు, కాంగ్రెస్ అధినాయకులు కొట్టివేయగలరా? పార్లమెంటు పూర్తి మెజారిటీతో ఆమోదించిన చట్టాన్ని తిరస్కరించటం అంటే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించటమే.. పార్లమెంటు చట్టాన్ని అమలు చేసేందుకు నిరాకరించటం తిరుగుబాటుతో సమానమేననేది కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులకు తెలియదా? తెలిసి కూడా వీరిలా ఎందుకు వ్యవహరిస్తున్నారనేదే ప్రశ్న. పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా అమలు చేస్తుంది. జిల్లా కలెక్టర్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించగలుగుతారా? అంటే ఆ ప్రసక్తే రాదు. కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకూడదు.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే అదేశాలను బేఖాతరు చేయవలసిందిగా జిల్లా కలెర్టర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించగలవా? పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను అమలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయటం అంటే పార్లమెంటుకు విరుద్ధంగా వ్యవహరించటమే. పార్లమెంటును కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు బేఖాతరు చేయగలవా? పార్లమెంటును బేఖాతరు చేయటం అంటే ఏమిటో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులకు తెలియదా? పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేసేందుకు నిరాకరించటం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘిచే పక్షంలో అలాంటి రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది అందరికి తెలిసిందే. రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన నెలకొనే పక్షంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రభుత్వాలను రద్దు చేసి రాష్టప్రతి పాలన విధించవచ్చు. విజయన్, అమరీందర్ సింగ్‌లకు ఇది బాగా తెలుసు. అందుకే వారు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ తీర్మానాలు చేసినా, సుప్రీం కోర్టుకు వచ్చినా అది చూపించుకునేందుకే తప్ప అమలు చేసేందుకు కాదనేది పచ్చి నిజం. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయటం అన్ని రాష్ట్రాల రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కాంగ్రెస్, వామపక్షాలు ఇదంతా తెలిసి కూడా ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటే దీనికి ప్రధాన కారణం ఓటు బ్యాంకు రాజకీయం. ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం వామపక్షాలు, కాంగ్రెస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే రాజకీయ నాటకం అడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయక తప్పదనే వాస్తవాన్ని కుండ బద్ధలు కొట్టినట్లు కపిల్ సిబల్ చెప్పిన చోటే ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కూడా వామపక్షాలు, కాంగ్రెస్ కుటుంబ పాలన, జాతీయ వాదం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి కొన్ని నగ్న సత్యాలను కవులు, మేధావుల ముందు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సి.పి.ఐ., సి.పి.ఎం. తదితర వామపక్షాలకు భారత దేశం పట్ల ఎప్పుడూ ప్రేమ లేదు, ఈ పార్టీలకు విదేశాలంటేనే ఎక్కువ ప్రీతి.. అందుకే అవి ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయని రామచంద్ర గుహ స్పష్టమైన భాషలో చెప్పారు. వామపక్షాలకు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ అనేది భారత-చైనా యుద్ధం సమయంలో తేటతెల్లమైంది. వామపక్షాలకు భారతదేశం పట్ల ప్రేమాభిమానాలు లేవు కాబట్టే వారు జె.ఎన్.యు. తదితర విశ్వవిద్యాలయాల్లో టుక్డే, టుక్డే గ్యాంగ్‌లతో చేతులు కలుపుతారు. ఈ కారణం చేతనే వామపక్షాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ నాయకుడుగా ఎందుకు ఎదగలేకపోతున్నాడనేది రామచంద్ర గుహ తనదైన శైలిలో బయటపెట్టారు.
కాంగ్రెస్ కుటుంబ పాలనా విధానాన్ని దేశంలోని యువకులు ఎంత మాత్రం బలపరచటం లేదు, అందుకే కాంగ్రెస్ కుటుంబ పాలనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదోతరం వంశపారంపర్య నాయకుడైన రాహుల్ గాంధీ ఏ నాటికి కూడా దేశ స్థాయి నాయకుడు కాలేదు, యువత అతని నాయకత్వాన్ని ఆమోదించటం లేదని గుహ అభిప్రాయపడ్డారు. ఆయన మరో అడుగు ముందుకు వెళ్లి అట్టడుగు క్షేత్ర స్థాయి నుండి స్వయం కృషితో రాజకీయ నాయకుడుగా ఎదిగి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీకి ఏ మాత్రం పోటీ పడలేడనని స్పష్టం చేశారు. కుటుంబ పాలనకు ప్రాతినిధ్యం వహించే రాహుల్ గాంధీకి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందనేది అర్థం కానందుకే అతను ఎదగలేడన్నారు. నరేంద్ర మోదీ సెలవనేది లేకుండా అనుక్షణం కష్టపడి పనిచేస్తుంటే రాహుల్ గాంధీ తనకు ఇష్టమనిపించిన ప్రతిసారీ విదేశాలకు వెళ్లిపోతారని రామచంద్రగుహ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది రాహుల్ గాంధీకి ఎంత మాత్రం తెలియదు. దీనికితోడు కుటుంబ పాలనకు అలవాటుపడిన వ్యక్తి కాబట్టే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోంది తప్ప ముస్లింల ప్రయోజనాల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయటం లేదు.
మూడు ముస్లిం దేశాలలో మతపరమైన హింసకు గురై భారతదేశం వచ్చిన హిందువులు తదితర ఆరు మతాల వారికి భారతీయ పౌరసత్వం కల్పించే చట్టాన్ని వ్యతిరేకించటం, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు కానివ్వమంటూ అర్థరహిత ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయంలో మొదట కపిల్ సిబల్ తదితర న్యాయ కోవిదుల సలహా తీసుకోవటం మంచిది.

కె.కైలాష్ 98115 73262