జాతీయ వార్తలు
మంత్రి పదవి నుంచి రాజ్‌నాథ్‌ను తొలగించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్ నాయక్ డిమాండ్
న్యూఢిల్లీ, నవంబర్ 26: రాజ్యాంగంలో పొందుపరచిన ‘లౌకికం’ అన్న పదాన్ని తొలగించాలని లోక్‌సభ సాక్షిగా డిమాండ్ చేసిన హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, న్యాయ విభాగం స్థారుూ సంఘం మాజీ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి పదవిని స్వీకరించిన రాజ్‌నాథ్ సింగ్, అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వ్యవహరించారని నాయక్ ఆరోపించారు. రాజ్యాంగంలోని ప్రవేశికలో భాగమైన లౌకిక పదంతో అవసరం లేదని రాజ్‌నాథ్ చేసిన ప్రకటన, రానున్నకాలంలో అనేకమందికి రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడానికి, సలహాలు ఇవ్వటానికి ధైర్యాన్నిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే పెరిగిపోయిన అసహనంతో భయపడిపోతున్న ప్రజలకు రాజ్‌నాథ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయం మరిన్ని అవాంఛనీయ సంఘటనలకు దారితీసే ప్రమాదం ఉందని శాంతారామ్ నాయక్ పేర్కొన్నారు.
కిజుకు మరణం.. రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ, నవంబర్ 26: నాగాలాండ్‌కు చెందిన సిట్టింగ్ సభ్యుడు కిజుకు గురువారం ఉదయం మరణించడంతో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. చైర్మన్ హమీద్ అన్సారీ సంతాప తీర్మానం ప్రతిపాదించారు. గురువారం రాజ్యసభలో కూడా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళులు అర్పించి ఎస్‌సి ఎస్టీల సమస్యలపై చర్చించవలసి ఉంది. శుక్రవారం ఈ చర్చ జరుగుతుంది.