జాతీయ వార్తలు

స్తంభించిన రాజ్యసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికె సింగ్ వ్యాఖ్యలపై గందరగోళం
బిఎస్సీ ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు
కేబినెట్ నుంచి తప్పించాలని ఆజాద్ డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దళితులను కించపరిచే తీరులో వ్యాఖ్యలు చేసిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ వికె సింగ్ సభలో అడుగుపెట్టటానికి వీలులేదంటూ బహుజన్ సమాజ్ పార్టీ ప్రారంభించిన ఆందోళనకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించటంతో శుక్రవారం రాజ్యసభ పూర్తిగా స్తంభించింది. సింగ్‌ను మంత్రి వర్గం నుంచే కాక పార్లమెంట్ నుంచి కూడా బయటకు పంపివేయాలని ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ అజాద్ డిమాండ్ చేయటంతో ఒక్క సారిగా సభలోవాతావరణం వేడెక్కింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించకుని రాజ్యాంగంపై చర్చించి తీర్మానం చేసి చేతులు దులుపుకోవడమే కాకుండా అంబేద్కర్ ఆశలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు. మంత్రి వికె సింగ్ చేసిన వ్యాఖ్యలు దళితుల మనసులను గాయపరచటంతోపాటు దేశ పరువును మంట గలిపాయాని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా సింగ్‌ను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు, అజాద్ తన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగానే బిఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి దళిత విరోధి అయిన సింగ్ రాజీనామా చేసి తీరాలని నినాదాలు చేస్తూ సభను నడవనీయలేదు. నినాదాలు నిలిపివేసి సభ్యులు తమతమ స్థానాలకు వెళ్లిపోవలసిందిగా డిప్యూటీ చైర్మన్ కురియన్ చేసిన విజ్ఞప్తి ఫలించలేదు. సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తరువాత చైర్మన్ అన్సారీ ఒక సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు. తరువాత కురియన్ సభను నిర్వహించటానికి ఉపక్రమించగానే బిస్పీ అధినేత్రి మాయావతి బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో సామరస్యత దెబ్బ తింటోందని నిప్పులు చెరిగారు. దళితులలో అభద్రతాభావం పెరిగిపోయిందని చెప్పారు. వికె సింగ్ దళిత విరోధని ఆమె ఆరోపించారు. సింగ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించి తీరాలని మాయావతి డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకుని సింగ్ తన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరించాయన్న వివరణ ఇవ్వటంతో పాటు దళిత పిల్లల సజీవదహనాన్ని ఖండించారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ సమాజంలో సమానత్వం కోసం పాటుపడుతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికే తమ ప్రభుత్వం అంకితమై పనిచేస్తోందని ఆయన తెలిపారు. 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. చైర్మన్ అన్సారీ ప్రశ్నోత్తరాలను చేపట్టకుండానే గంటలవరకూ సభను వాయిదా వేశారు. రెండున్నర గంటలకుమొదలైన సభ ప్రయివైట్ మెంబర్స్ బిల్లును చేపట్టి సాఫీగానడిచింది.