జాతీయ వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలుచేయటంలో కేంద్రం ఘోరంగా విఫలమవుతోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ కార్యదర్శి ఎ.రాజా, సిపిఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే అంశంపై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆదివారం ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇరువురు నాయకులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో సిపిఐ సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీతారాం ఏచూరి, రాజా, మేధా పాట్కర్‌తోపాటు పలువురు మేథావులు, నాయకులు, కార్యకర్తలు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వక్తలందరూ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో కేంద్రం అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలతోపాటు పార్లమెంటులో అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ వంతు కృషి చేయటంతోపాటు ఈ లక్ష్య సాధనకోసం పనిచేసే వారితో చేతులు కలుపుతామని అన్నారు. ప్రత్యేక హోదాకోసం కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు కలిసి పని చేయాలని ఏచూరి పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను కేంద్రం అర్థం చేసుకోవాలని రాజా హితవు చెప్పారు.