ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిపక్షంతో కలిసి పని చేస్తేనే పార్లమెంటు సజావుగా కొనసాగుతుందనే వాస్తవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నందుకు సంతోషించాలి. ప్రతిపక్షంతోపాటు స్వపక్షాన్ని కూడా కలుపుకుని పని చేయాలనే జ్ఞానోదయం కూడా కలిగితే బాగుంటుంది. ప్రతిపక్షంతో కలిసి పని చేయనందుకే గత పదహారు నెలల్లో జరిగిన పార్లమెంటు సమావేశాలు కొట్టుకుపోయాయి. స్వపక్షాన్ని దూరం పెట్టినందుకే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యిందనే పచ్చి నిజాన్ని మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
నరేంద్ర మోదీ జి.ఎస్.టి బిల్లుకు పార్లమెంటు ఆమోదం సంపాదించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో సుధీర్ఘ చర్చలు జరపటం ముదావహం. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించి ఉంటే గత పదహారు నెలల్లో జరిగిన పార్లమెంటు సమావేశాలు వృధా అయ్యేవి కావు. భూసేకరణ సవరణ బిల్లు విషయంలో కూడా మోదీ, ఆయన మిత్ర బృందం ప్రతిపక్షంతో కలిసి పని చేసి ఉంటే ఎంతో మేలు జరిగేది. రాజ్యసభలో ప్రతిపక్షం మెజారటీలో ఉన్నదనే వాస్తవాన్ని మోదీ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించి ఉంటే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా సజావుగా జరిగేవి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాజ్యసభలో తమ సంఖ్యను పెంచుకోవటం ద్వారా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనాలని మోదీ భావించి ఉండవచ్చు. అయితే ఇప్పుడా ఆశ ఆడియాస కావటంతో ఆయనకు దిగిరాకతప్పలేదని భావించవలసి ఉంటుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి విజయం సాధించి ఉంటే మోదీ పద్ధతి మారేదా అనేది అనుమానమే.
పార్లమెంటు సమావేశాల కోసం ప్రతిపక్షాన్ని కలుపుకుపోయేందుకు సిద్దపడిన నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు, పార్టీ నాయకుల విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంభించాలి. ఎన్.డి.ఏ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించటం నరేంద్ర మోదీకి ఒక వ్యసనంగా మారిందనే అనుమానం కలుగుతోంది. ఆయన ఇకనైనా ఈ వ్యసనం నుండి బైటపడాలి. విదేశీ పర్యటనకు వెళుతూ విదేశాంగ మంత్రిని దూరం పెట్టటం వంటి ఓంటెద్దు వ్యవహారానికి ఇకనైనా స్వస్తి పలకాలి. మంత్రులందరిని కలుపుకుని పని చేస్తే దేశాభివృద్ది త్వరిత గతిన సాధించేందుకు సాధ్యమవుతుందనేది గ్రహించాలి. మంత్రుల పని తీరును పరిశీలించటం,పర్యవేక్షించటం ఆయన అధికార పరిధిలోనిదే. దీనిని ఎవ్వరు కాదనను కానీ మంత్రులను పని చేయకుండా వారి కార్యదర్శుల ద్వారా వారి శాఖలను అదుపు చేసేందుకు ప్రయత్నించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. మంత్రులకు అభివృద్ది లక్ష్యాలు నిర్ధారించి వాటిని సాధించేలా చేయాలి, అభివృద్ది లక్ష్యాలను సాధించటంలో విఫలమయ్యే మంత్రులను ఇంటికి పంపించాలి కానీ ఆయా శాఖలను పరోక్షంగా ఆజమాయిషీ చేయటం మంచి పద్ధతి కాదు.
ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా వ్యవహరించటం ప్రజాసామ్యం మనుగడను దెబ్బతీస్తుందనే నిజా న్ని గ్రహించాలి. మోదీ ఇకనైనా ఏకఛత్రాధిపత్యానికి తెర దించి మంత్రులందరితో సమిష్టిగా పని చేసేందుకు ప్రయత్నించాలి. గత పదహారు నెలల కాలంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన ప్రకటనలు, ప్రారంభోత్సవాలే జరిగాయి తప్ప అవి ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదు. మంత్రులకు తమ శాఖలపై స్వయంప్రతిపత్తి లేకపోవటం వల్లనే అభివృద్ది పథకాలు ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదనేది మోదీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. బి.జె.పిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. అమిత్ షా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి బి.జె.పిలో ప్రజాస్వామ్యం కొరవడింది. ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని అంతా తానై నడిపించేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నించినట్లు అమిత్‌షా కూడా పార్టీని తన చిటికెని వేలుపై నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని మూలంగా బి.జె.పిలో ప్రజస్వామ్యం కొరవడి కుటుంబ పాలనకు పేరు గాంచిన కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తయారవుతోంది. ప్రభుత్వంలో మోదీ చెప్పిందే వేదమైనట్లు పార్టీలో అమిత్‌షా చెప్పిందే వేదంగా మారింది. బి.జె.పి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వారికి పార్టీలో స్థానం లేకుండా పోతోంది. కాకారయుళ్లకు పెద్ద పీట వేయటం ద్వారా కాంగ్రెస్ సంసృతికి అద్దం పడుతూండటంతో విలువలతో కూడిన రాజకీయం చేస్తామనే బి.జె.పి విధానం మట్టికొట్టుకుపోతోంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కారకులైన వారిని నిర్ధారించకుండా సమిష్టి బాధ్యత పేరుతో కాంగ్రెస్‌ను తలదనే్నలా వ్యవహరించటం సిగ్గు చేటు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను గుర్తించి ఉంటే బా గుండేది. సీనియర్ నాయకుడు, మాజీ ఉపప్రధాన మంత్రి లాల్‌కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషి తదితర సీనియర్ నాయకుల నోళ్లు మూయించినంత మాత్రాన సరిపోదు. ప్రతిపక్షంతో చర్చించినట్లే మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ప్రభుత్వాన్ని, పార్టీకి ముందుకు నడిపించాలి. ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా బి.జె.పి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఇంత వరకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. పెద్ద నాయకులు మంత్రులయ్యారు కానీ సామాన్య కార్యకర్తకు ఇంత ఎవరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కేంద్రం ప్రభుత్వంలో వేలాది పదవులు ఖాళీగా పడి ఉన్నా పార్టీ విజయం కోసం ఆహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలను ఎందుకు నియమించటం లేదు?