ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చర్చల స్థాయి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు ఉభయ సభల్లో గొడవకు గుడ్ బై చెప్పి చర్చలు జరిపేందుకు చేయి, చేయి కలిపిన అధికార ప్రతిపక్షం దేశ సమస్యలను మరింత లోతుగా విశే్లషించే స్థాయికి ఎదగాలి. గత మూడు,నాలుగు సంవత్సరాల నుండి అధికార, ప్రతిపక్షాలు తమ పార్టీ రాజకీయాల కోసం పార్లమెంటు సమావేశాలను గొడవలు, గందరగోళానికి బలి చేయటం విదితమే. అయితే ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు మాత్రం వాడిగా, వేడిగా జరుగుతున్నా సజావుగా ముందుకు సాగుతున్నాయి. దేశాన్ని కుదిపేసిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత వేముల ఆత్మహత్య, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మిక జె.ఎన్.య గొడవలతోపాటు ఇతర పలు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపారు.
2016-17 వార్షిక ప్రణాలికపై కూడా చర్చ సజావుగా జరుగుతోంది. రియల్ ఎస్టేట్ బిల్లు, ఆధార్ బిల్లులపై చర్చ జరగటంతోపాటు వాటిని ఆమోదించి చట్ట రూపం ఇచ్చారు. జాతీయ బ్యాంకులకు దాదాపు పదివేల కోట్లరూపాయల కుచ్చు టోపి పెట్టి లండన్‌కు వెళ్లిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ మాల్యా మోసాలపై కూడా చర్చ జరిగింది. ఎన్.డి.ఏ ప్రభుత్వం పని తీరుపై కూడా సమీక్ష జరపటంలో ప్రతిపక్షం విజయం సాధించింది. అధికార, ప్రతిపక్షాలు పలు అంశాలపై వాడి,వేడి చర్చ జరిపినా ఉభయ సభలను స్తంభింపజేయకపోవటం గమనార్హం. పార్లమెంటు సమావేశాలు పార్టీ రాజకీయాలకు, గొడవలు, గందరగోళానికి బలి కావటం పట్ల దేశ ప్రజల్లో పెళ్లిబుకిన కోపతాపాల మూలంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరిని మార్చుకున్నాయి. గత నాలుగు సంవత్సరాల నుండి పార్లమెంటు ఉభయ సభలు దేశ సమస్యలను పక్కన పెట్టి పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వటాన్ని ప్రజలు ఈసడించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లే ప్రమాదకర పరిస్థితి ఎదురు కావటం వల్లనే అధికార, ప్రతిపక్షాలు గొడవ, గందరగోళానికి స్వస్త పలికాయి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు జరిపిన అఖిల పక్ష సమావేశాల్లో ఉభయ సభలు గొడవకు బలి కావటంపై ప్రజలేమనుకుంటున్నారనే అంశం చర్చకు వచ్చింది. పార్లమెంటు ఉభయ సభల్లో గొడవ, గందరగోళం ఇలాగే కొనసాగితే ప్రజలు మనల్ని క్షమించరనే అభిప్రాయాన్ని ఇరుపక్షాలు వ్యక్తం చేశాయి. బడ్జెట్ సమావేశాల నుండి పార్లమెంటును స్తంభింపజేయటం మానివేస్తామని ఇరు పక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్షం హామీ ఇచ్చింది. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు తాము ఇచ్చిన హామీకి కట్టుబడి పని చేశాయి. అయితే దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆశించిన స్థాయిలో లోతైన చర్చ జరగలేదు. చర్చ నామమాత్రంగానే ఉంటోంది తప్ప ఒక స్థాయిలో జరగటం లేదు. చర్చల్లో విషయాని కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. సమస్యపై ఒకరిపైఓకరు ఆరోపణలు చేసుకోవటం మినహా ఆచరణయోగ్యమైన పరిష్కారమార్గాలపై దృష్టి సారించటం లేదు.
రోహిత వేముల ఆత్మహత్య, జె.ఎన్.యు గొడవలపై వాడి,వేడి చర్చ జరిగినా అది పరస్పరారోపణలు చేసుకోవటం, దుమ్మెత్తిపోసుకుని రాజకీయపరమైన పాయింట్లు సంపాదించేందుకు పోటీ పడ్డారు తప్ప వీటికి పరిష్కారం ఏమిటి? వాటిని ఎలా అమలు చేయాలి? ఇలాంటి సంఘటనలు ఇక మీదట జరుగకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై చర్చ జరగలేదు. రాజకీయాల్లో అధికార పక్షంపై ఆరోపణలు చేయటం మామూలే కానీ ఒక స్థాయిని దాటి బురద చల్లుకోవటం వలన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ విలువ తగ్గుతుంది. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో ఇదే జరిగింది. విజయ మాల్యా మోసాలపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి తప్ప అతను మోసం చేసిన దాదాపు పదివేల కోట్ల రూపాయలను ఎలా రాబట్టాలనే అంశంపై ఏ ఒక్కరు మాట్లాడలేదు. విజయ మాల్యా విదేశాలకు వెళ్లిపోయేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం సహకరించిందని ప్రతిపక్షం ఆరోపిస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడే అతని రుణాలను పునర్‌వ్యవస్థీకరించటంతోపాటు అదనపు సౌకర్యాలను కల్పించారని అధికార పక్షం ఆరోపించింది.
అధికార, ప్రతిపక్షాలు రెండు రోజుల పాటు ఇలా ఒకరిపైమరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు తప్ప అతన్ని వెనకకు రప్పించి పదివేల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని ఎలా రాబట్టుకోవాలనే దానిపై దృష్టి కేంద్రీకరించలేదు. దేశానికి కోట్లాది రూపాయలను ఆదా చేసే ఆధార్ వ్యవస్థ కు చట్టపరమైన స్థాయిని కల్పించే బిల్లుపై కూడా అర్థవంతమైన చర్చ జరగలేదు. ఎన్.డి.ఏ మిత్రపక్షాలు, ప్రభుత్వం నుండి సహాయాన్ని ఆశిస్తున్న పార్టీలు ఆధార్ బిల్లుకు గుడ్డిగా మద్దతు ప్రకటిస్తే ప్రతిపక్షాలు గుడ్డిగా ఎదిరించాయి. వాస్తవానికి దేశానికి ఆధార్ వ్యవస్థ అత్యంత ముఖ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు మాత్రమే చేరేందుకు ఆధార్ వ్యవస్థ ప్రాతిపదిక అవుతుంది. మధ్యదళారీలు, బ్రోకర్లు తుడిచిపెట్టుకుపోతారు. దీనితోపాటు బోగస్ లబ్దిదారుల ఆట కట్టించటం సాధ్యమవుతుంది. ఆలాంటి ప్రయోజనకరమైన విషయాలను పార్లమెంటు ద్వారా ప్రజలకు వివరించే స్థాయికి ఎం.పిలు ఎదగాలి.