శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో రైతులకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జిల్లా కలెక్టర్ ఎం జానకి స్పష్టం
నెల్లూరు , డిసెంబర్ 18: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించటంలో క్రిభ్‌కో సంస్థ ప్రధాన భూమిక పోషిస్తుందని జిల్లా కలెక్టర్ ఎం జానకి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గోల్డెన్ జూబ్లీ హాలులో శుక్రవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కో ఆపరేటివ్ డీలర్ల సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 9.5లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయ అవసరాలు తీర్చడానికి వివిధ పరిశ్రమలు ముందుకు వస్తున్నాయన్నారు. ఇప్పటికే క్రిభ్‌కో సంస్థ జిల్లాలోని వెంకటాచలం మండలంలో పరిశ్రమ స్థాపన జరుగుతుందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా రైతులకు అవసరమైన యూరియా, ఎరువులను సరఫరా చేయటం జరుగుతుందన్నారు. జిల్లాలో దాదాపు 30వేల మట్టినమూనాలు సేకరించి రైతులకు భూసార కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ పరపతి సంఘాలు ఆయా గ్రామాల పరిధిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. క్రిభ్‌కో పరిశ్రమకు 200 ఎకరాల భూమిని కేటాయించామని, దీనికి సంబంధించిన పనులు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయితే రైతులకే కాకుండా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఎరువులను పరిమితంగా వాడి అపరిమితంగా దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. తాజా సాంకేతిక పరిఙ్ఞనంతో రైతులకు అవగాహన కల్పించాలని, ఇందుకు సహకార సంఘాలు చేయూతనివ్వాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉందన్నారు. క్రిభ్‌కో పరిశ్రమ రైతులకు పూర్తి స్థాయిలో సహకారమందించి గణనీయమైన అభివృద్ధి సాధించాలన్నారు. క్రిభ్‌కో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ సాంబశివరావు మాట్లాడుతూ పరిశ్రమకు అవసరమైన వౌలిక సదుపాయాలు పూర్తి చేసి త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ పరిశ్రమ నుండి 42లక్షల టన్నుల యూరియా, ఎరువులు అందిస్తున్నామన్నారు. సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ విఎస్ రోహిత్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకు వేణుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.