జాతీయ వార్తలు

తమిళ ఆలయాల్లో భక్తులకు ఇక డ్రెస్‌కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన ఆలయాల్లో నోటీసు బోర్డులు
మదురై, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం (జనవరి 1) నుంచి తమిళనాడులోని ఆలయాల్లోకి వచ్చే భక్తులు కొత్త డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నిటిలోను ఈ విషయాన్ని ప్రముఖంగా పేర్కొంటూ నోటీసు బోర్డులు కూడా పెట్టారు. మద్రాసు హైకోర్టు ఈ నెల ప్రారంభంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కొత్త డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెలుపల ఉంచిన నోటీసు బోర్డు ప్రకారం ఆలయంలోకి వచ్చే మగ భక్తులు ధోతీ (పంచె), షర్టు, పైజమా లేదా ప్యాంట్ ధరించాల్సి ఉండగా మహిళలు, అమ్మాయిలు చీరలు లేదా చుడీదార్లు లేదా లంగా ఓణీ ధరించి రావలసి ఉంటుంది. లుంగీలు, బెర్ముడాలు, జీన్స్, బిగుతుగా ఉండే లెగ్గింగ్స్‌లు లాంటి ధరించి వచ్చే వారిని ఆలయంలోకి అనుమతించబోమని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలాంటి నోటీసు బోర్డులు పెట్టిన ఇతర ప్రధాన ఆలయాల్లో రామేశ్వరం, మదురై మీనాక్షి ఆలయం కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి ఆలయాల్లోకి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని మద్రాసు హైకోర్టు ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను ఆదేశించింది. ‘్భగవంతుడ్ని పూజించేటప్పుడు మనం సాధారణంగా ఆ సందర్భానికి తగిన డ్రెస్ ధరించాలి’ అని ఒక పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్ వైద్యనాథన్ స్పష్టం చేసారు. మగవాళ్లకు ధోతీ లేదా పైజమాలు, పైన ధరించే కండువాలు లేదా ఫార్మల్ ప్యాంట్లు, షర్టులు, ఆడవాళ్లకు చీర లేదా లంగా ఓణీ జాకెట్ లేదా చుడీదార్లు, పైన వేసుకునే చున్నీ, చిన్న పిల్లలయితే పూర్తిగా కప్పి ఉంచే ఏ డ్రెస్ అయినా ఉండాలని, ఈ డ్రెస్ కోడ్‌ను 2016 జనవరి 1నుంచి ఆలయాల్లో పాటించాలని న్యాయమూర్తి స్పష్టం చేసారు.