ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు ఎసిపిలకు పోలీసు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 25: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది విశాఖ నగరంలో పనిచేస్తున్న ఇద్దరు ఎసిపిలకు కేంద్రప్రభుత్వం ఇండియన్ పోలీసు పతకాలను ప్రకటించింది. నగరంలో ట్రాఫిక్ ఎసిపిగా పనిచేస్తున్న కింజరాపు ప్రభాకర్, తూర్పు సబ్ డివిజన్ ఎసిపి రాజాపు రమణ ఈ పతకానికి ఎంపికయ్యారు. కింజరాపు ప్రభాకర్ 1991లో ఎస్సైగా పోలీసు శాఖలో చేరి, 2001లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా, 2011లో డిఎస్పీగా పదోన్నతి పొందారు. ఈయన ఇప్పటి వరకు 25 క్యాష్ రివార్డులు పొందారు. 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు సేవా పతకాన్ని అందించింది. ఇదిలా ఉండగా నగరంలోని తూర్పు సబ్ డివిజన్ ఎసిపిగా పనిచేస్తున్న రాజాపు రమణ 1991లో ఆర్‌ఎస్సైగా సర్వీసులో చేరి, 1995లో సివిల్ ఎస్సైగా ఎంపికయ్యారు. సివిల్ ఎస్సై శిక్షణలో గోల్డ్ మెడల్ పొందారు. 2012లో డిఎస్పీగా పదోన్నతి పొందారు. ఇప్పటి వరకు ఆయనకు 69 క్యాష్ రివార్డులు లభించాయి.