సాహితి

ఏకోపాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు జీవితాలు
ఎంచుకోవడం పరిష్కారం
నమ్మి నడవడం సమస్య
ఆలోచనా ఉరిని బిగించుకోవడం మరణం.
***
నువ్వొక కాలిబాటను ఆశిస్తావు.
ఏ సంకేతాలు లేని విశాల
అయోమయ తత్వాన్ని నేను
ఆదరంగా ఆహ్వానిస్తాను.

చేధించడానికి
నీకొక లక్ష్యం కావాలి.
నేను కలలుగంటాను
నిర్లక్ష్యాన్నై సంచరించాలని.

ఒడిదుడుకులే లేని రహదారిలో
పయనిస్తూ కూడా
క్షోభించుకునేంత గతుకులనే
నువ్వాస్వాదిస్తావు.
గోతులు తప్ప బాటే లేని చోట కూడా
నేను సాఫీగానే సాగిపోతుంటాను.

అచంచల స్థిరత్వ సిద్ధాంతాల చేత
శిఖరమై వెలిగే మార్తండ జ్యోతి నీవు
చంచల స్వభావాలచేత నేనొక
సీతాకోకనై భ్రమించే అల్పత్వాన్ని.

నీ చేతినే పట్టుకుంటాను
తప్పుకోలేని ప్రేమతో గట్టిగా
దారివెంట దిగులు
వాయుగుండమై వణికిస్తున్నా.

నువ్వొక నిప్పుల కొలిమైనా,
నేను నీలోనే నిండా మునిగిపోతాను
అదొక ఆత్మార్పణ అని అర్థమైనా.

- భాస్కర్ కొండ్రెడ్డి