హైదరాబాద్

హడ్కో పనులు వేగవంతం తగు జాగ్రత్తలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: శివార్ల దాహర్తిని తీర్చేందుకు రూ. 1900 కోట్లతో చేపట్టిన హడ్కో ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన జలమండలి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ల వారీగా జరుగుతున్న పనులపై ఆయన ఆరా తీశారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్లను ఆదేశించారు. రిజర్వాయర్ పనులు, రిజర్వాయర్ ఇన్‌లెట్, ఔట్‌లెట్ పనులు, పైప్‌లైన్ విస్తరణ పనులు, రోడ్ల మరమ్మతు పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పనులు వేగవంగా జరుగుతున్న పలు ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాద నివారణ ప్రమాణాలను అమలు చేయాలన్నారను. వీటిలో భాగంగా పనులు జరుగుతున్నట్లు ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పైప్‌లైన్ విస్తరణ పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని, ఏ చిన్నపాటి వర్షం కురిసినా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరగా పూర్తి చేయలని సూచించారు. ఈ సమీక్షలో జలమండలి ప్రాజెక్టు 1 డైరెక్టర్ ఎం. ఎల్లస్వామి, ప్రాజెక్టు 2 రెవెన్యూ డైరెక్టర్ శ్రీ్ధర్‌బాబు, ప్రాజెక్టు విభాగం సిజిఎంలు, జిఎంలు పాల్గొన్నారు.