సంజీవని

‘గుండె గుట్టు’ తెలిపే ఇసిజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె కొట్టుకునేప్పుడు అది ఉత్పత్తి చేసే ఎలక్ట్రికల్ ఇంపల్స్‌ని కనుక్కునే విధానాన్ని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఇసిజి) స్టెస్ టెస్ట్‌ని ఎక్సర్‌సైజ్ ఇ.సి.జి అంటారు. శ్రమిస్తున్నపుడు ఇ.సి.జిని తీస్తారు. గుండె కొట్టుకునే రేటు ఓ స్థాయికి చేరేవరకు ఎక్స్‌ర్‌సైజ్ చేయిస్తారు. గుండె జబ్బు తీవ్రతని ఈ పరీక్షలో నిర్థారించవచ్చును.
హోల్టర్ మానిటర్ చిన్న పరికరం. భుజం దగ్గర కట్టవచ్చు. రోజువారి మనం చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు. ఎలక్ట్రోడ్స్ శరీరానికి తగిలించి ఉంటాయి. మాగ్నటిక్ టేప్ మీద ఇసిజి రికార్డ్ అవుతుంది. 24 గంటలు ఇలా రికార్డు చేస్తారు. దాన్ని టెక్నీషియన్స్, డాక్టర్ చూసి రోగి పరిస్థితిని అంచనా వేస్తారు.
రక్తనాళాల ఎక్స్‌రేని ‘యాంజియోగ్రామ్’ అంటారు. ఆర్టెరి యాంజియోగ్రామ్‌ని ‘ఆర్టెరియోగ్రామ్’ అంటారు. వీన్ యాంజియోగ్రామ్‌ని వీనోగ్రామ్ అంటారు.
న్యూక్లియర్ స్కానింగ్‌ని రేడియో ఐసోటోప్ స్కానింగ్ అని కూడా అంటారు. రేడియో యాక్టివ్ పదార్థాన్ని శరీరంలోకి పంపిస్తారు. అపుడు వైద్యుడు ఏ కణజాలాన్ని కావాలంటే ఆ కణజాలాన్ని పరిశీలిస్తారు.
ప్రతిసారి గుండె గట్టిగా ముడుచుకోవడానికి వీలుగా గుండె గోడల్ని గట్టిపరిచే మందులున్నాయి. అలాగే రక్తం చిక్కగా ఉంటే గడ్డలు కట్టే ప్రమాదముంది కాబట్టి రక్తం పలుచనవడానికి మందులున్నాయి. పరిస్థితిని బట్టి ఏమీ చేయాలో వైద్యుడు చెబుతాడు.
**