శిప్ర వాక్యం

నట రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయం చిట్టచివరి లక్ష్యంగా మారుతుండటం నడుస్తున్న చరిత్ర. చలనచిత్ర రంగ ప్రసిద్ధులను ఈ లక్ష్యం మరింతగా ఆకర్షిస్తోంది. చలనచిత్ర మహాకళాకారుడు కమలహాసన్ బుధవారం కొత్త రాజకీయ పక్షాన్ని ఆరంభించడంతో కొనసాగుతున్న జాతరలకు కొత్త ఊపు సిద్ధించినట్టయింది! వాణిజ్యవేత్తలు, క్రీడాకారులు, పారిశ్రామిక ప్రఖ్యాతులు, మేధావులు, సాహిత్య సామ్రాట్టులు మొదలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల వరకు నిస్వార్థంగా సమాజసేవ చేయడానికి నడుములు బిగించి ఉన్న సంఘటకుల వరకూ, ప్రచార మాధ్యమ ప్రసిద్ధుల వరకూ- ఇలా సకల విధ జీవన రంగాలలోని అధికాధిక జనావళికి అంతిమ గమ్యం రాజకీయం కావడం మన ప్రజాస్వామం సంతరించుకున్న విచిత్ర స్వభావం! అడ్డదారిన కొందరు, దొడ్డిదారిన మరికొందరు, మహారాజపథం వెంట మరికొందరు- ఇతరేతర రంగాల ప్రముఖులు - రాజకీయాలలోకి చట్టసభలలోకి చేరిపోవడం, చేరిపోవడానికి యత్నిస్తుండడం బహిరంగ రహస్యం. ఇందుకోసం ‘‘గొప్ప త్యాగాలు’’ కూడా చేస్తున్నవారున్నారు. ఇలా ‘‘త్యాగాలు చేస్తున్న’’వారు బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమర సమయంలో ఆచార్య పదవులకు, ‘ఐసిఎస్’ పదవులకు రాజీనామా చేసిన మహనీయులతో సైతం తమను సరిపోల్చుకొనడానికి వెనుదీయడం లేదు. లక్షలాది రూపాయలను ఆర్జించి పెట్టే న్యాయవాద వృత్తిని, వైద్య వృత్తిని, ఇతర వాణిజ్యాలను, వృత్తులను పరిత్యజించి బ్రిటన్ వ్యతిరేక సమరంలో దూకిన ‘స్వాతంత్య్ర యోధుల’ వలె తాము కూడా రాజకీయ సార్వజనిక సేవారంగ ప్రవేశం చేసినట్టు, చేస్తున్నట్టు ఈ ‘అభినవ త్యాగపురుషులు’’ చాటింపు వేస్తున్నారు! వారు వేయకపోయినా వారి అభిమానులు డప్పులను, ఢక్కాలను, మృదంగాలను, కుండలను, బండలను వాయించి పారేసి ‘అకాండ తాండవం’ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇలాంటి అభిమానులు చలనచిత్ర ప్రముఖులకు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం విరివిగా చిత్రనటులు, నటీమణులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండడానికి కారణం. కమలహాసన్ కొత్త రాజకీయ పక్షాన్ని ప్రారంభించడానికి ఇదంతా నేపథ్యం! అనేకమంది నటులు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు, ప్రదర్శకులు వివిధ రాజకీయ పక్షాలలో చేరిపోయి చట్టసభలలోకి దూరిపోవడం దేశమంతటా దశాబ్దులుగా ఆవిష్కృతమవుతున్న వి‘చిత్రాలు’...
ఇలాంటి చిత్ర ప్రముఖులు ఎన్నికలలో పోటీ చేసి శాసన సభలలోను, లోక్‌సభలోను ప్రవేశించారు. అలా గెలవలేని వారు రాజకీయ పక్షాల అధిష్ఠానవర్గాల అనుగ్రహం సాధించుకొని శాసనమండలిలోకి రాజ్యసభలోకి వెళ్లగలిగారు. ఇలా ఎన్నికయినవారు, వెళ్లగలిగినవారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టసభలలో చేసిన కృషి జన విఖ్యాతం! సభలకు నియతంగా హాజరయ్యారా? ఎన్నిసార్లు ఏఏ అంశాలపై వీరంతా ప్రసంగించారు? వీరు ప్రజలకు సాధించిపెట్టిన ప్రయోజనాలు ఏమిటి? ఎవరికైనా గుర్తుందా? సంజయ్‌దత్ అనే హిందీ చిత్ర నటుడు దేశద్రోహ కలాపాలకు పాల్పడినట్టు ఏళ్ల తరబడి ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమంగా ఆయుధాలను నిలువచేసిన నేరానికి ఇతగాడు కారాగృహ నిర్బంధ శిక్షను అనుభవించాడు కూడా. ప్రత్యేక న్యాయస్థానం ఆరేళ్ల కారాగృహ నిర్బంధాన్ని విధించిన తరువాత సంజయదత్ ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలకు ‘వినతి’ చేసుకున్నాడు. ఈ న్యాయ యాచికలపై తుది తీర్పు వెలువడక ముందే సంజయ్‌దత్ ‘సమాజ్‌వాదీ పార్టీ’- సపా- తరఫున లోక్‌సభకు పోటీ చేయడానికి 2009లో ముస్తాబయ్యాడు. సుప్రీంకోర్టు ఈ చర్యను నిరోధించింది కాబట్టి ఆ ప్రమాదం తప్పిపోయింది..
కానీ ఇలా రాజకీయ పక్షాలలో చేరడం వల్ల చట్టసభ్యత్వాలు, ప్రచార వేదికలపైకి పిలుపులు, ప్రశంసలు మాత్రమే దక్కుతాయన్నది చిత్ర ప్రముఖులకు లభించిన అనుభవం! ఎమ్‌జి రామచంద్రన్ వంటి విశ్వవిఖ్యాత నటునికి సైతం సొంతంగా ‘పార్టీ’ని పెట్టుకునే వరకూ ఇదే అనుభవం లభించింది. అందువల్ల ముఖ్యమంత్రి కావాలన్నా, పార్టీకి అద్వితీయ అధినేత కావాలన్నా సొంతంగా పార్టీ పెట్టుకోవడం మాత్రమే మార్గం అన్నది వర్తమాన, ప్రవర్థమాన చిత్ర ‘నాయకులు’ గ్రహించిన చారిత్రక పాఠం! అందువల్ల చలనచిత్రాలలో గిరాకీ తగ్గుతున్న కథానాయకులు, తగ్గబోతోందని పసికట్టినవారు ‘‘కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టే అభినయ వృత్తిని త్యాగం చేసి’’ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలలోకి దూకుతున్నారు. కమల్‌హాసన్ కూడా ఈ ‘అభినయం’ చేస్తున్నాడు, ‘‘మక్కల్ నీతిమయ్యమ్’’ - మనీమ-ను స్థాపించడం కోసం చలనచిత్ర నటనను త్యాగం చేస్తున్నాడట! ఈ ‘మక్కల్ నీతిమయ్యమ్’- ప్రజాన్యాయ కేంద్రం- ద్వారా తాను ‘ముఖ్యమంత్రి’ కావాలన్నది బహుశా ఆయన కంటున్న పగటికల! మరో తమిళ కథానాయకుడు రజనీకాంత్ కూడా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నాడు! ఇలా ప్రారంభిస్తున్న వారందరూ ఎమ్‌జి రామచంద్రన్ వలె, ఎన్‌టి రామారావు వలె ముఖ్యమంత్రులు కాగలరా?? కాలేరని తమిళనాడులో పార్టీలు పెట్టిన ఇతర నటులు ఇదివరకే నిరూపించి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానటుడు చిరంజీవి నిరూపించాడు! అయినప్పటికీ చిరంజీవి సోదరుడు, మరో మహాకథానాయకుడు పవన్‌కళ్యాణ్ కొత్త రాజకీయ ‘జనసేన’ను స్థాపించడం చారిత్రక పునరావృత్తి... ఎన్‌టి రామారావు మొదటిసారి ఘన విజయం సాధించడానికి ఏకైక కారణం ఈ దేశ ప్రజాజీవనంలో రఘురామునికీ, యదుకుల కృష్ణునికీ ఉన్న అద్వితీయ సముత్కర్ష ప్రాధాన్యం. నందమూరి తారక రామారావు ఈ చారిత్రక పురుషుల పాత్రలను పోషించడం ద్వారా ప్రజలకు ఆరాధ్యుడు కావడం ఆయన విజయానికి ప్రాతిపదిక! మిగిలిన మహానటులకు ఈ ‘రామకృష్ణుల’ అభినయ అనుభవం లేదు. అందువల్ల వారు అభిమానులకు మాత్రమే ఆరాధ్యులయ్యారు, ప్రజలకు కాదు!! ఈ వాస్తవం ధ్రువపడింది, మళ్లీమళ్లీ ధ్రువపడనుంది.
జనజీవనంలో రాజకీయానికి, రాజకీయాలలో ‘చిత్ర’ ప్రభావానికి ప్రాధాన్యం పెరగడం నడుస్తున్న చరిత్ర! యువజనులు విద్యార్థులు - అధికాధికులు- ఋషులను, సాహిత్యకారులను, సద్గుణమూర్తులను, సాధ్వీమణులను ఆరాధించేవారు. వారిని ఆదర్శంగా గ్రహించేవారు! బ్రిటన్ వ్యతిరేక సమరం చివరి దశ నుండి రాజకీయ వేత్తలు ఆరాధ్యులైపోయారు? ఇది కూడా మరుగున పడుతోంది. అభినయ కళాకారులు యువజనుల పాలిట దేవుళ్లయి పోతున్నారు! మహానటి దీపికా పదుకొనె ‘మనసు గట్టితనం’ గురించి అంతర్జాతీయ వేదికపై పాఠం చెప్పడం సరికొత్త ఉదాహరణ! చలనచిత్రాలలో ఉదాత్తమైన పాత్రలను పోషిస్తున్న మహానటులు కొందరు నిజ జీవితంలో ఎలా వ్యవహరిస్తున్నారు... భార్య కాని మహిళతో సహజీవనం చేస్తున్నారు! వాహనాలను అడ్డదిడ్డంగా నడిపి హత్యలు చేస్తున్నారు. విజయా సంస్థ అధినేత స్వర్గీయ చక్రపాణి మరో సినీ ప్రముఖునితో చెప్పినట్టు ‘‘నువ్వు ప్రేక్షకులకు నీతులు చెప్పేదేంది? నీకే నేతి లేదు...’’!