ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పాక్‌తో సత్సంబంధాలు సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జైషె మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనటం అసాధ్యమనే అభిప్రాయం మరింత బలపడుతోంది. భారత దేశం ప్రతిసారి చొరవ తీసుకుని పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధం కాగానే ఇస్లామిక్ ఉగ్రవాద సం స్థల సహాయంతో పాకిస్తాన్ సైన్యం వెన్నుపోటు పొడు స్తూ దేశ ప్రధాన మంత్రి కేవలం ఉత్సవ విగ్రహం తప్ప మరేమీ కాదనే సందేశాన్ని స్పష్టమైన భాషలో పంపిస్తున్నాయి. పాక్ సైన్యం ఆలోచనా విధానం మారనంత వరకు భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు ఎలాంటి అవకాశాలు లేవని భావించకతప్పదు.
పాకిస్తాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలతో శాంతి చర్చలు జరపటం వృధా ప్రయాస అనేది ఇప్పటికి పలుమార్లు రుజువైంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు చిత్తశుద్దితో ప్రయత్నాలు జరిగాయనేది అక్షర సత్యం. భాజపా మత తత్వం ఓట్ల కోసమే తప్ప దేశాన్ని నడిపించేందుకు కాదనేది పలు మార్లు వెలుగులోకి వచ్చింది. భాజపా నాయకులు మతపరమైన ప్రకటనలు ఎన్ని చేసినా పాకిస్తాన్‌తో సత్సంబంధాలు నెలకొల్పే విషయంలో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గట్టి ప్రయత్నాలు జరిగాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు జరిగాయి. వాజ్‌పేయి లాహోర్‌కు బస్సులో వెళ్లి అప్పటి ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపారు. అయితే వాజ్‌పేయి లాహోర్‌లో నవాజ్ షరీఫ్‌తో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలోనే అప్పటి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ దురాగత పథకాలకు కార్యరూపం ఇచ్చారు. భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే పార్లమెంటుపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారు. కార్గిల్, పార్లమెంటు దాడిలో రెండు దేశాలు యుద్ధానికి సిద్ధం కావటం ఆ తరువాత వెనకకు తగ్గటం అందరికి తెలిసిందే.
ఇప్పుడు నరేంద్ర మోదీ దౌత్యపరమైన అన్ని సంప్రదాయాలు, విధానాలు, నియమాలను పక్కన పెట్టి లాహోర్‌కు ఆకస్మిక పర్యటన చేసి నవాజ్ షరీఫ్‌కు స్నేహ హస్తం అందిస్తే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రాహీల్ షరీఫ్ మాత్రం గతంలో పర్వేజ్ ముషారఫ్‌ను ఆదర్శంగా తీసుకుని పటాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేయించాడు. భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనటం అసాధ్యమనేందుకు ఈ రెండు సంఘటనలు చాలు. భారత దేశంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ ఎంత కోరుకున్నా పాక్ సైన్యం ఇందుకు సిద్ధం కానంత వరకు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనటం అసాధ్యం. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు అవసరమైన ప్రాథమిక చర్చలను కూడా పాక్ సైన్యం సహించటం లేదు. వెయ్యి కోతలతో భారత్‌ను రూపుమాపాలన్నది పాక్ సైన్యం ప్రధాన వ్యూహం.
జైషె మహమ్మద్, లష్కరే తయ్యబా తదితర ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల ద్వారా వెయ్యి కోతల వ్యూహాన్ని పాక్ సైన్యం అమలు చేస్తోంది. భారత దేశంతో నేరుగా యుద్ధానికి దిగితే ఓటమి ఖాయమనేది పాకిస్తాన్ సైన్యానికి బాగా తెలుసు. ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండా కార్గిల్ దురాగతం, పార్లమెంటుపై దాడి, పఠాన్‌కోట్ ఎయిర్ బేస్, ముంబాయిపై దాడి చేయటం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం యువతను ఛాంధసవాదులుగా తయారు చేసి తమ ఇష్టానుసారం ఉగ్రవాద కార్యకలాపాలు చేయించటం ద్వారా భారత దేశాన్ని మెల్లి, మ్లెల్లిగా చంపాలన్నది వెయ్యి కోతల వ్యూహం ప్రధాన లక్ష్యం. పాకిస్తాన్ సైన్యం వెయ్యి కోతల వ్యూహానికి ఆ దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తే మరి కొన్ని పార్టీలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి. ఇటీవలి కాలం వరకు కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగిన పాక్ సైన్యం ఇప్పుడు కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవటంతోపాటు మొత్తం దేశంలోని వీలునన్ని ఎక్కువ రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టటం ద్వారా భారత్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి. పాక్ సైన్యం వ్యూహానికి చైనా పరోక్షంగా మద్దతు ఇస్తోంది.
ఆక్రమిత జమ్ముకాశ్మీర్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించటం ద్వారా చైనా అక్కడ తమ అస్తిత్వాన్ని భారీగా పెంచుకుంటోంది. పాకిస్తాన్‌లో చైనా ప్రభావం పెరగటం అంటే మన దేశానికి రెండు వైపుల ప్రమాదం మరింత పెరిగినట్లే. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న అమెరికా మాత్రం పాకిస్తాన్ విషయంలో చూసి,చూడనట్లు వ్యవహరిస్తోందనేది పచ్చి నిజం. ఈ పరిస్థితుల్లో భారత పాలకులు ఎంత ప్రయత్నించినా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనటం దాదాపుగా అసాధ్యం. ఈ స్థితిలో భారత దేశం శాంతి చర్చల కోసం పట్టుపట్టటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే పాకిస్తాన్ ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు రావాలి, మతపరమైన దేశంగా కాకుండా ప్రజాస్వామ్య దేశంగా మారాలి, పాకిస్తాన్ సైన్యం దేశం పరిపాలనలో జోక్యం చేసుకోకూడదు. అయితే పాకిస్తాన్‌లో పై పనులేవీ జరిగే పరిస్థితి లేదు. పాకిస్తాన్ చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వెనక నుండి ఇస్లామిక్ ఉవ్రాదం దాడులతో వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుందనేది పచ్చి నిజం.