ఉత్తరాయణం

‘భారతరత్న’కు అర్హత ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భారతరత్న’ బిరుదు ఇవ్వడానికి అర్హత ఏమిటి? యోగ్యత ఏమిటి? ఎందుకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఈమధ్య ‘భారతరత్న’ హోదా విచక్షణారహితంగా ఎవరికి పడితే వారికి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో తెలియడం లేదు. ‘భారతరత్న’ పురస్కారం అత్యంత గౌరవప్రదమైన, ఉన్నతమైన పురస్కారంగా చెబుతున్నారు. కాని, జన బలం, ధన బలం, రాజకీయ పలుకుబడి బట్టి, కేవలం సిఫార్సుబట్టి, రాజకీయమైన ప్రలోభంతో ఇస్తున్నట్లుగా తోస్తున్నది. అంతేకాదు, నిర్యాణం పొందినవారికి, కీర్తిశేషులైన వారికి కూడ ఇస్తున్నారు. అంటే వారు బ్రతికి ఉన్నంతకాలం వారి విలువ, గొప్పదనం గ్రహించలేదన్నమాట. బి.జె.పి. ప్రభుత్వం అటల్‌బిహారి వాజ్‌పాయికి, కీ.శే. పండిత మదనమోహన మాళవ్యాకి భారతరత్న ఇవ్వ డం సమంజసమే. న్యాయమే. వాజ్‌పాయి కన్నా గొప్పవారు లేరా? ‘వాజ్‌పాయి’ని అంతటివారుగా చేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ లేరా? డా.కేశవరావుబలరామ్‌హెడ్గేవర్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం) నిర్మాతలేరా? వారికి ఎందుకు ఇవ్వకూడదు? బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వినాయక దామోదరవీర సావర్కారు, అల్లూరి సీతారామరాజు, అపర దుర్గ్భావాని ఝాన్సిలక్ష్మీబాయి లేరా? భారతభూమిలో కీర్తిశేలైనవారి అమరవీరుల సంఖ్య ఒక్క శతాబ్దంలోనే అనేక వందల మంది ఉన్నారు. ఝాన్సీలక్ష్మీబాయి, స్వామి వివేకానంద, శ్రీ అరవిందులు మొదలగువారికి భారతరత్న మాత్రమేకాదు, వారు ప్రపంచరత్న కూడ ఇవ్వాలి. మరణించిన వారికి భారతరత్న ఏ సంవత్సరంనుండి లెక్కవేయాలో తెలియజేస్తారా?
బాబుజగజ్జీవన్‌రామ్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎం.జి.రామచంద్రన్ మొదలైన రాజకీయ నాయకులకు భారతరత్న ఇవ్వడం హాస్యాస్పదంగా ఉన్నది. డా.ఎం. ఎస్. సుబ్బులక్ష్మికి ఇచ్చారు. సంతోషమే. అదే విధంగా డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణకు కూడ ఇవ్వాలి. భారతావని మహాపురుషులకు, మహాత్ములకు, పుట్టిల్లు ‘్భరతరత్న’ పురస్కారం ప్రపంచం అంతా గుర్తించే ‘పర్సనాలిటీ’ (మూర్తిమత్వం) కలిగినవారికే ఇవ్వాలి.
- పున్నావఝల వెంకటేశ్వరరావు, హైదరాబాద్
విద్వేష కేంద్రాలుగా మార్చవద్దు
సరస్వతీ నిలయమైన సెంట్రల్ యూనివర్సిటీని చాలా కాలంగా విదేశీ తొత్తులు దేశ విద్రోహ కార్యకలా పాలకు వేదికగా మార్చడం శోచనీయం. మాతృదేశ భావజాలానికి అడ్డుకట్టవేయడానికి సామాజిక న్యాయం పేరుతో కొందరు విద్యార్థులకు మద్దతిచ్చే వారిలో కొందరు టీచింగ్ స్టాఫ్ ఉండటం దురదృష్టకరం. అంబేద్కర్‌ను ఒక తురుపు ముక్కగా పలువురు రాజకీయ నాయకులు వాడుకోవడం శోచనీయం. బడుగు వర్గాల యువతకు విద్య, ఉపాధి రంగాల్లో చేయూతనివ్వాలే కానీ, అ మహనీయుని పేరుతో వర్సిటీలను విద్వేష కేంద్రాలుగా మార్చరాదు.
- దండు కృష్ణవర్మ, హైదరాబాద్
నామమాత్రంగా పరిశోధనలు
నేడు విశ్వవిద్యాలయాల్లో కొద్దిపాటి పరిశోధనలు మినహా అత్యధిక పరిశోధనలు నామమాత్రంగానే జరుగుతున్నాయ. సరైన అర్హతలు, అనుభవాలు లేని వారిని గైడ్స్‌గా నియమించడం వల్ల పరిశోధనలు దారి తప్పుతున్నాయ. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో పరిశోధ నలు సక్రమమైన రీతిలో సాగాలంటే అసిస్టెంట్ ప్రొఫె సర్‌గా ఐదేళ్ల అనుభవం ఉన్నవారినే పరిశోధక విద్యా ర్థులకు గైడ్‌గా నియమించాలి.
-జె.జె.సి.పి. బాబూరావు, మహబూబ్‌నగర్
ఆన్‌లైన్ సేవల బుకింగ్ వద్దు
రోజుకో కొత్త విధానానిన అమలు చేస్తూ భక్తులను ఇక్కట్లకు గురి చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డులను అధిగమిస్తోంది. సుప్రభాతం, కళాగీతోత్సవం, విశేష పూజ, అష్టదళం, సహస్ర కలశా భిషేకం వంటి విశిష్ట సేవలకోసం తితిదే ఇప్పటి వరకు అమలు చేస్తున్న లక్కీ డిప్ విధానం వల్ల లబ్ది పొందిన భక్తులు కొండపై నిరీక్షించకుండా సమయానికి ఆలయానికి చేరుకునే సౌలభ్యం ఉడేది. ఇప్పుడు ఈ విధానాన్ని తోసిరాజని 75 శాతం ఇంటర్‌నెట్ బుకింగ్, 25 శాతం విఐపి కోటాకు మళ్లించడం వల్ల ఇంటర్నెట్ విధానంపై అవగాహన లేని సామాన్య భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అట్లాగే అన్ని రకాల బుకింగ్‌లను ఆన్‌లైన్ విధానానికి తరలిస్తామని దేవస్థానం ప్రకటించింది. నిరక్షరాస్యులైన సామాన్య ప్రజానీకానికి ఈ విధానం నిరుపయోగం. అంతా ఆన్‌లైన్‌కు మార్చే విధానానికి దేవస్థానం స్వస్తి పలకాలి.
- సి. ప్రతామ్, శ్రీకాకుళం
తెలుగు భాషను అభివృద్ధి చేయాలి
ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. ఎవరి భాష వారికి గొప్ప. అలాగే మన భాష మనకు గొప్ప. మన భాష తెలుగు అయినప్పటికీ మనకు భాషా స్వాతంత్య్రంరాలేదు. ఈనాడు అనేక భాషలు అంతరించిపోతున్నాయి. దానికి ప్రధాన కారణం వారి భాషయొక్క ప్రాముఖ్యత లేకపోవడమే. ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల ప్రజలు తెలుగు మాట్లాడమే పెద్ద తప్పుగా భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తెలుగు మాట్లాడటం ఒక నేరంగా భావిస్తూ తెలుగులో మాట్లాడితే జరిమానా విధిస్తున్నారు. ముఖ్యంగా రెండు జంటనగరాల్లో ఇదే ఎక్కువగా ఉంటోంది. ఒకప్రక్క పేదవాడు ఉన్న ఆస్తిమొత్తం ధారపోసి ఆంగ్లమాధ్యమంలో చేర్పించటం జరుగుతున్నది. కానీ వారు ఆశించిన స్థాయిలో కృషి చేయటం లేదు. ముఖ్యంగా భాష నేర్పటం ఒక తప్పుగా భావిస్తున్న ఈ సమయంలో మన తెలుగుభాషను రక్షించుకోవాలి.