ఉత్తరాయణం
గిరిజన వర్సిటీకి గిడుగు పేరు పెట్టాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన గిరిజన విశ్వవిద్యాలయానికి- అలనాడు సవర (గిరిజన) భాషా వికాసానికి సేవలందించిన గిడుగు రామ్మూర్తి పేరు పెట్టాలి. రాష్ట్ర సవర భాషా సంఘం కూడా ఈ ప్రతిపాదనను పరిశీలించాలని గత నాలుగేళ్లనుండి డిమాండు చేస్తోంది. ప్రస్తుతం విజయనగరంలోని ఏయూ పీజీ సెంటర్‌లో తాత్కాలికంగా ఈ నెలాఖరు నుంచి గిరిజన విశ్వవిద్యాలయ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పీజీ, ఇంటిగ్రేటెడ్, పీజి డిప్లమో కోర్సులకు ప్రవేశాలు పూర్తయ్యాయి. ఈ విశ్వవిద్యాలయం సాలూరు సమీపంలోని పాచిపెంటలో నిర్మించనున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర మానవ వనరులశాఖ 420 కోట్లు మంజూరు చేసింది.
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయానికి గిడుగు పేరుపెట్టడమే సమంజసంగా ఉంటుంది. సవర వర్గీయులకు గిడుగు ప్రాతఃస్మరణీయుడు తెలుగు లిపిలో ఆయన నాలుగు సవర వాచకాలను రాశారు. ఆయన రాసిన సోర (సవర) ప్రయోగ దీపిక ఈ వర్గాలకు దిక్సూచి లాంటిది. రామ్మూర్తి సవర భాష నేర్చుకోవడం ప్రారంభించినప్పటినుంచి సవరులకు సంబంధించిన పాటలను కూడా సేకరించారు. వీటిని ఓ గ్రంథంగా ప్రచురించారు. ఈ పుస్తకంలో మొత్తం 32 పాటలున్నాయి. వీటిలో ముప్పై పాటలను ఆయన సేకరించారు. మిగతా రెండు పాటలను స్వయంగా రచించారు. మన్య ప్రాంతంలోని కొండ కోనల్లో తిరిగి సవరల జీవన సరళిని పరిశీలించారు. సవర భాషకు లాటిన్ భాషతో సంబంధం ఉందని రామ్మూర్తి గుర్తించారు. గిడుగు ప్రోత్సాహంతోనే ఆయన కుమారుడు సీతాపతి సవర భాషలో అంతర్జాతీయ ధ్వని లిపిని (ఐపిఎ) రూపొందించాడు. ఇక తెలుగు భాషలో వ్యవహారిక భాషావాదానికి శ్రీకారం చుట్టిన దార్శనికుడు గిడుగు రామ్మూర్తి కావడం విశేషం. 1919లో తెలుగు పత్రికను ప్రారంభించి విశిష్ట సేవలందించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి గిడుగురామ్మూర్తి పేరుపెడితే అదే సరైన నివాళి అవుతుంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వై.ఎస్.ఆర్.సీపి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని కోరుకుందాం.
- వాండ్రంగి కొండలరావు, శ్రీకాకుళం