ఉత్తరాయణం

కుల రిజర్వేషన్లకు అంతం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుల రిజర్వేషన్లు ఫలితంగా భారతదేశంలో ఎంతోమంది తెలివైన మేధావులు వారియొక్క శక్తియుక్తులు మనం వినియోగించుకోక పోవడంతో, విదేశాలకు ఉపయోగపడటంతో అవి అగ్ర రాజ్యాలుగా తయారయ్యాయి. అగ్రవర్ణాలలో చదువుకున్న అనేకమంది నూటికి నూరుమార్కులు సాధించినా వారికి సరైన ఉపాధి లేదు. అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణులైన వారికి కులం ఆధారంగా ఉన్నత ఉద్యోగాలు లభిస్తున్నాయి. భార్య, భర్త పిల్లలు అంతా రిజర్వేషన్ల ఫలితంగా సునాయాసంగా ప్రభుత్వ కొలువులు లభిస్తున్నాయి. చదువుల్లో, ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్ల కారణంగా అటెండర్‌గా చేరిన అనతికాలంలోనే ఆఫీసర్‌గా స్థిరపడగా తనతో, తనకంటె ముందు చేరిన వారు మహా అయితే సీనియర్ గుమస్తాగా పదవీ విరమణ చేయడం గమనార్హం. తనకంటే జూనియర్ వద్ద సహాయకులుగా పనిచేయవలసిన దుర్గతి ఏర్పడుతుంది. ఓనమాలు రానివారు వార్డు సభ్యులనుండి పార్లమెంట్ సభ్యులుగా ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అఖిల భారత సర్వీసు (ఐ.ఏ.ఎస్; ఐ.పి.ఎస్)లో ఉత్తీర్ణులైన వారికి సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇచ్చే పరిస్థితి కంటి ముందు సాక్షాత్కరిస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలవల్ల ఏ పార్టీ అధికారంలో ఉన్నా అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డించడం జరుగుతుంది. కొన్ని కులాలకు కొంతకాలం రిజర్వేషన్ల ప్రక్రియ అమలుచేసి పదేళ్ల పిదప పరిస్థితులను పరిశీలించి అవసరమైతే కొనసాగించడం లేదా రద్దు చేయమని రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అప్పట్లో సూచించారు. 60 ఏళ్ళు దాటినా ఇంకా కొనసాగించడంతోపాటు మరికొన్ని రాష్ట్రాలు మరికొన్ని కులాలను ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో కొనసాగించేందుకు రాజ్యాంగ సవరణలు చేయించడం జరుగుతుంది. ఫలితంగా అగ్రవర్ణ మేధావుల సేవల మన దేశానికి అందని ద్రాక్షగా మిగులుతున్నాయి. నరేంద్రమోడీ అధికారం చేపట్టాక ఎన్నో క్లిష్ట సమస్యలకు సునాయాసంగా పరిష్కరించడం జరిగింది.

- యర్రమోతు ధర్మరాజు