ఉత్తరాయణం

మానవాళి చేష్టలతోనే మిడతల విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్రికా, ఆసియా (పాకిస్థాన్) తదితర ఖండాలలో గత కొంతకాలంగా మిడతల వల్ల పంటలు దెబ్బతిని ఆర్థికంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని అక్కడ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిడతల దాడివల్ల గోధుమ, మొక్కజొన్న, ప్రత్తి వంటి పంటలతోపాటు పలు కూరగాయల సాగుకు కూడా అవరోధం ఏర్పడుతుంది. పాకిస్థాన్ ఏకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న మిడతల నియంత్రణకై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2019 జూన్ నుండి పాకిస్తాన్ మిడతల బెడదని ఎదుర్కొంటోంది.
మిడతలు రోజుకు 150 కిలోమీటర్లు ప్రయాణించగల్గుతాయి. భారతదేశంపై కూడా వీటి ప్రభావం వుండవచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిడతలు బెడద గురించి ప్రపంచ ఆహార సంస్థ కూడా హెచ్చరికలు జారీచేసింది.
జీవవైవిధ్యానికి, ఆహారపు గొలుసుకు విడదీయరాని సంబంధం ఉంటుంది. మనిషి విచక్షణారహితంగా అడవులని నరికివేయడంవల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వాయుకాలుష్యంవల్ల అనేక పక్షిజాతులు అంతరించిపోయాయి. పక్షులు కీటకాలని, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. పలు పక్షి జాతులు అంతరించిపోవడంవల్ల కొన్ని కీటక జాతులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పర్యావరణ కాలుష్యంవల్ల భూతాపం పెరుగుతుంది. ఫలితంగా సముద్రాలు వేడెక్కుతున్నాయి. వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పులవల్ల మిడతలు విజృంభిస్తాయని ప్రపంచ ఆహార సంస్థ తెల్పుతుంది. బ్రెజిల్, ఆస్ట్రేలియాలో కార్చిచ్చువల్ల వందల కోట్ల జంతువులు మరణించాయి. ఆస్ట్రేలియాలో 113 రకాల జంతువులు మనుగడకి ముప్పు వాటిల్లిందని పర్యావరణ శాస్తవ్రేత్తలు వివరిస్తున్నారు. మిడతల విజృంభణ వల్ల కొన్ని నాగరికతలు కూడా అంతరించిపోయాయని చరిత్ర చెప్తుంది. పంటలు నాశనమైతే వ్యవసాయ రంగం కుదేలౌతుంది. భూమిపై క్షామ పరిస్థితులు ఏర్పడతాయి. ఆహార ధాన్యాల కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. పేదవారి కష్టాలు రెట్టింపు అవుతాయి. అడవులను పెంచి, పర్యావరణ సమతుల్యతని కాపాడటం ద్వారా వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. తద్వారా ప్రపంచ దేశాల్లో జీవవైవిధ్యం నిలకడగా వుండి ఆహార సంక్షోభం రాకుండా వుంటుంది.

- యం. రాంప్రదీప్, 9492712836