ఉత్తరాయణం

ఏపీ ప్రభుత్వ సముచిత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యావత్ రాష్ట్రం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంచడం శుభపరిణామం. ప్రజల వ్యతిరేకత, నిఘా వర్గాల నివేదికలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికారపార్టీకి వాటిల్లబోయే నష్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటిం చింది. అయతే ఉరుము ఉరిమి మంగలంమీద పడినట్టు ఈ జీవోకు అటవీశాఖ అధికారులను బాధ్యుల్ని చేసి వారిని సస్పెన్షన్‌కు గురిచేయడం అమానుషం. నిరుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి చారిత్రాత్మక తప్పిదమని, భవిష్యత్తులో ఇది జరగబోదని ప్రకటించారు. తీరా అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకొని పర్యావరణ శాస్తవ్రేత్తల అధ్యయనా లు, హియరింగ్‌లో ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకతను, తవ్వకాల వల్ల మన్యం ప్రాంతంలో కలుగబోయే నష్టంపై అటవీ శాఖ సమర్పించిన నివేదికలను బుట్టదాఖలు చేసి, కనీసం విపక్షాలనైనా సంప్రదించకుండా వెయ్య ఎకరా లను భారతీయ జనసంస్థకు కట్టబెట్టి, ఖనిజ తవ్వకాలకు అనుమతినిచ్చేశారు. గతంలో ఎప్పుడో చేసుకున్న దర ఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని, తనకు తెలియకుండానే అటవీశాఖ జీవో జారీ చేసిందని చెబు తున్న ముఖ్యమంత్రి మాటలకను ఎవరూ నమ్మబోవడం లేదు. మన్యం ప్రాంతాన్ని కాలుష్య కారకాలకు నెట్టివేసి, పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఇటువంటి ఖనిజ తవ్వకాలను శాశ్వతంగా ఆపేసేవిధంగా రాజ్యాంగ సవరణ జరగాలి.
- సి. సాయమనస్విత, విజయవాడ
చేతకాని ప్రజాప్రతినిధులు
ఎన్నికల్లో నిలబడి తామేంటో తమ సంపాదన ఏమిటో తమ ప్రవర్తన ఏమిటో తామెంత స్వచ్ఛమైన వారమో వివరించి చెప్పే స్థితిలో నేతలు లేరు. ఎంతసేపు ఎదుటివారిని దుమ్మెత్తిపోయటమే వేలెత్తి చూపడమే తమపై వచ్చిన నిందలు సరిదిద్దుకోలేక ఎదురుదాడి చేయడం. నాకావిషయాలు సంబంధం లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం, ఎన్నికల్లో ఎన్నో చెప్పి ఏమీ చెయ్యకుండా మళ్ళీ ఎన్నికల్లో సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలముందుకు రావడం. నిత్యావసర పప్పు దినుసుల ధరలు తగ్గించలేకపోయారు. రాజకీయాల్లోకి వచ్చి మీరు కోటీశ్వరులైపోతున్నారు. సామాన్య మానవుని జీవనశైలిలో మార్పును తీసుకువచ్చారా? మీలో మీ కుటుంబంలో ఎంతో మార్పు వచ్చింది, కాదనగలరా?
- మిస్సుల గాయత్రీదేవి శివరామకృష్ణ, హైదరాబాద్
అర్థవంతమైన చర్చలు ఎలా సాధ్యం?
నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి విలేకరులకు సమాధానంగా ‘ప్రజలకు ప్రభుత్వానికి చర్చలు కొరవడుతున్నాయి. దేశంలో అసహనం, ఓర్వలేనితనం పెరుగుతున్నాయి’ అని చెప్తూ ఎందుకైనా మంచిదని కాబోలు ప్రపంచంలోనే అసహనం పెరిగిపోతున్నదని చెప్పాడు. పార్లమెంటులో చర్చలు జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వంపై శత్రుభావంతో ఒక మేధావి వర్గం రెచ్చిపోతున్నది. ఇలాంటి వారితో అర్ధవంతమైన చర్చలు ఎలా సాధ్యం? సత్యార్థి లాంటివారు పూనుకొని రెండు వర్గాల వారిని ఒకచోట సమావేశపరిచి మాజీ న్యాయమూర్తి అధ్యక్షతలో చర్చలు జరిపిస్తే కొంత ఫలితం ఉండొచ్చు.
- మరుదకాశి, కరప
సనాతనం.. హిందూమతం
హిందూ మతం అనేది సనాతన ధర్మం. ప్రకృతిని దైవంగా పూజించే మతం. అన్నం పెట్టే మట్టిని భూదేవిగా పూజిస్తారు. విషం చిమ్మే సర్పాలనూ పూజిస్తారు. అతిథిని ప్రాణాలొడ్డయనా కాపాడే సంప్రదాయం ఉంది. పుస్తకాలను సరస్వతీదేవిగాను, ధనాన్ని ధనలక్ష్మిగా పూజించి, శుచి, మంచి మనస్సు లాంటి నాగరికతను చాటుతుంది ఈ సనాతన ధర్మం. యాంత్రిక జీవితానికి ఉపశమనం కలిగిస్తోంది సనాతన హిందూ మతం. మరి అలాంటి మతాన్ని కొందరు కాసుల కక్కుర్తికి ఆశపడి, మతం మార్చుకుంటున్నారు. ప్రతీ హిందూ వ్యక్తి హిందూ మతాన్ని తన పిల్లలకూ, తన స్నేహితులకూ, భావితరాల కు పంచాలి. మతం మార్పిడులను అడ్డుకోవాలి. సహనశీలత, జీవకారుణ్యం, శాంతి, సర్వజీవుల సమా నత్వం సనాతనంగా వస్తున్న హిందూమత సంప్రదాయం.
- కె.వి.రావు, విశాఖపట్నం
ఏపీ అవతరణ దినోత్సవం ఎప్పుడు?
‘నవ్యాంధ్రప్రదేశ్’ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీనా లేక జూన్ 2వ తేదీన జరుపుకోవాలా అనే అభిప్రాయ