ఉత్తరాయణం

దేశభక్తీ మేలుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశభక్తీ! మేలుకో! ధీశక్తిని మేలుకొలుపు
కానీ కాదిది కవిత! జరుగుతున్న వాస్తవికత
సగటు భారతీయుని మనసులోని వ్యధ
నవ భారత యువ సమాజామా!
భావి భారత ప్రజానీకమా!
చూస్తున్నారా? మీరంతా?
స్వతంత్ర భారత ప్రజాస్వామ్యపు వింత
ధనానికి ధర్మం దాసోహం
దానికి తోడు పదవీ వ్యామోహం
తరతరాలు అనుభవించినా తీరని అధికారదాహం
వారసత్వాన్ని గద్దె దింపిన వారిపై పగబట్టిన కార్పణ్యం
రాటుదేలిన రాజవంశం మాది
రైల్వేస్టేషన్లో చాయ్‌వాలా నరేంద్ర మోదీ
అధికారమెప్పుడూ మాదే
మావూరినీ రానివ్వమని పంతం
దేశభక్తి స్థానంలో స్వామిభక్తిని పెంచిన సామ్రాజ్యవాదం
ఇదే నిజమైన ప్రజాస్వామ్యమని పదేపదే ప్రబోధం
‘‘కాలికి వేస్తే, మెడకు, మెడకు వేస్తే కాలికి’’ పద్ధతి వితండవాదం
వినండి వినండి! ఒక స్వామిభక్తుని సన్నాయ నొక్కు
‘‘తప్పు చేయడం మానవుని హక్కు’’
ఇది వారు సెలవిచ్చిన మహోన్నత వాక్కు’’
‘‘ఎర్ ఈజ్ హ్యూమన్’’ తప్పు చేయడం మానవ నైజం
అనే మాటకు వారిచ్చిన అఘోరింపు నిర్వచనం
ఇక మరో పేరెన్నికగన్న లాయరాగారీ మాట
దేశాన్ని తిడితే దేశద్రోహం కాదట
కొడితేనే, దేశద్రోహానికొడిగడితేనే దేశద్రోహమట
మరి న్యాయశాస్త్రంలోని క్రిమినల్ ఇంటిమిడేషన్
అనే మాటకు అర్థమేమిటో అడగాలి మరి
ఇక పరాయదేశపు పరాన్న భుక్కులు
ప్రజాదరణకు నోచుకోని మరికొన్ని చిల్లర పక్షులు
మేత వేస్తే కూత కూసే మేధాశక్తులు
స్వజాతి వైరం వారి జన్మహక్కు
గెలిచినవారి కంటే ఓడిపోయన వారే వీరికి దిక్కు
ఉద్ధరిస్తాడనుకున్న వాడు ఉలకడు పలకడు
పరాయ దేశాలలో ప్రాణాయామ పాఠాలు నేర్పుతున్నాడు
ఏవౌతుందో ఈ దేశం
పొరుగు దేశాల వ్యూహంలో
ఇంటి శత్రువుల మంటపోరులో
ఏవౌతుందో ఈ దేశం
అందుకే మరి, దేశభక్తీ మేలుకో
ధీశక్తిని మేలుకొలుపు
భారతీయుడా! భాధ్యతను తెలుసుకో!
- ఉమాపతి శర్మ, సికిందరాబాద్
ఉమ్మడి పరిష్కారం అవసరం
ఇటీవల యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిణామా లను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. వివిధ సమూహాల ఆకాంక్షలు, భావ సంఘర్షణలు సహజంగానే విశ్వవిద్యాల యాల్లో విద్యార్థుల మేధోమధనానికి గురవుతుంటాయ. ప్రొఫెసర్లు విద్యార్థుల వ్యవహారశైలి అదుపు తప్పకుండా కృషి చేయాలి. ఒక వాదనను విద్యార్థులు సమర్థిస్తున్నప్పు డు వౌలికంగా దేశ ప్రయోజనాల రీత్యా ఒనకూడే ఫలి తాలను బేరీజు వేయాలి. విద్యార్థులు రాజకీయ శక్తులకు పావులుగా మారకుండా జాగ్రత్త వహించాలి. భిన్నత్వంలో ఏకత్వమై నిలిచే మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కు విద్యార్థులు పూనుకోవాలి. రోహిత్ మృతి, కన్హయ్య అరెస్ట్ సంఘటనలపై ప్రొఫెసర్లు సత్యానే్వషణ చేసి సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉన్నది. సర్వజనామోద, ఉమ్మడి పరిష్కారానికి కృషి చేయాలి.
- తంగెళ్లపల్లి కనకాచారి, హైదరాబాద్
రిటైర్మెంట్ వయసు పెంచాలి
నేడు దేశవ్యాప్త్త్తంగా దాదాపు 21 రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా ఉంది. అంతేకాదు చాలా కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పదవీ విరమణ వయసు ఇదే కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచగా, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. అయతే ఇందుకు అనేక కారణాలుం డవచ్చు. కానీ నేటి ఆరోగ్య అయుప్రమాణాల దృష్ట్యా భారతీయుల సరాసరి సంభావిత జీవన ప్రమాణం 65 ఏళ్లకు పెరిగింది. 58 సంవత్సరాల పదవీ విరమణ నిర్ణ యంచే నాటి ప్రమాణాలకు, ఇప్పుడు ఎలాంటి పోలిక లేదు. సీనియర్ ఉద్యోగులు కూడా తెలంగాణ ఉద్య మంలో తమవంతు కీలక పాత్ర పోషించారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, అలాంటి సీనియర్ ఉద్యోగు లు రెండేళ్ల పొడిగింపు కోరుకోవడం సహజమే. ప్రభుత్వ సానుభూతితో ఈ కోర్కెను పరిశీలించాలని మనవి.
- అన్వర్ పాషా, హైదరాబాద్
రిజర్వేషన్ లొల్లి
రిజర్వేషన్లు కొద్దికాలమేనని ఇప్పటికి 68 ఏళ్లుగా నెట్టుకొస్తున్నారు నాయకులు. ప్రతిభకు పట్టం కడితే దేశం ముందుకు వెళుతుందన్న విచక్షణా జ్ఞానాన్ని మరచి కేవలం ఓట్లకోసం గాలం వేసి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులను చూసి భారతావని పులకించి పోతున్నదనాలా? గుజరాత్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు మరవక ముందే ఆంధ్ర ప్రదేశ్‌లో మరొక రకంగా బిసి లొల్లి రావడం ప్రజాస్వామ్యానికి మంచి సూచన కాదు. ప్రతిభకు పట్టం కడుతూ పేదలకు లబ్ది ఇస్తూ మహిళలకు సమాన న్యాయం చేస్తేనే దేశం ముందుకు వెళుతుందని గ్రహించకపోతే దేశంలో మిగిలేది