ఉత్తరాయణం

ఆత్మహత్యలను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణికావేశంలో విలువైన జీవితాన్ని ఆత్మహత్య పేరుతో చిదిమేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మార్కులు సరిగ్గా రాలేదనో, అమ్మనాన్నలు తిట్టారనో, ప్రేమించే అమ్మాయి తిరస్కరించిందనో లాంటి చిన్నచిన్న కారణాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం. నేటి చిన్న కుటుంబాలలో నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పి, చిన్నపాటి ఓదార్పు అందించే వ్యవస్థ కనుమరుగు అవడంవలన కూడా తమ సమస్యలను ఎవ్వరికీ చెప్పుకోలేక, డిప్రెషన్‌కుగురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు సామాజిక విశే్లషకులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం చొరవ చూపి విదేశాలలో వున్నట్లు ప్రతీ నగరంలో సూసైడ్ హెల్ప్‌లైన్‌లను ఏర్పాటుచేయాలి. ప్రతీ ఆత్మహత్య వెనుక కారణం విశే్లషించి అందుకు ఇతరులు బాధ్యులైతే వారిని కఠినంగా శిక్షించాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ఆత్మహత్య ఎంతటి పిరికితనమైన చర్యో అవగాహనను తెలియజేయాలి. ప్రతీ కాలేజీ, స్కూలులో విద్యార్థుల కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటుచేయాలి. ఇటువంటి వారిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు ముందుగా గుర్తించి వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకువెళ్లడంతోపాటు సానుకూల దృక్పధంతో మసలు కునేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. జీవితం విలువను వారికి స్పష్టంగా తెలియజెప్పాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
విద్యార్హతలు అవసరం
గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో స్ర్తిల ప్రాతినిధ్యాన్ని 33 నుండి 50 శాతానికి పెంచడంకోసం ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకువస్తుందని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బీరేంద్రసింగ్‌లు వెల్లడించారు. ఇప్పుడు కేవలం పేరుకు మాత్రమే స్ర్తిలు, ప్రతినిధులు. కాని వారి భర్తలైన పురుషులే ఎక్కువ భాగం వారి బదులు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. దీని అంతటికి స్ర్తిలలో నిరక్షరాస్యతే ప్రధాన కారణం. ఈ పరిస్థితిలో స్ర్తిల ప్రాతినిధ్యాన్ని పెంచినా ఎట్టి ప్రయోజనం కలుగదు. కావున స్ర్తిలు కాని పురుషులు కాని ప్రాతినిధ్యం వహించాలంటే గ్రామ పంచాయితీకి 5వ తరగతి, పురపాలక సంఘానికి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలని చట్టం చేయాలి. అదేవిధంగా శాసనసభకు, లోక్‌సభకు ప్రాతినిధ్యానికి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలని చట్టం చేయాలి. అప్పుడే ప్రయోజనం చేకూరుతుంది.
- యామా జనార్దన్, సూర్యాపేట
సైరను మోతల్లో తేడా ఉండాలి
పోలీసు సైరనుకు అంబులెన్సు సైరనుకు శబ్దంలో తేడా చాలా అవసరం. ప్రజలకు చాలా ఉపయోగమున్నది. రెండు వాహనాల శబ్దం ఒకటిగా వుండకూడదు. రెండు సైరన్ శబ్దాలు వేర్వేరుగా పెట్టడం చాలా సులభం. ఖర్చు తక్కువ. పోలీసు సైరను, అంబులెన్సు సైరనులకు తేడా చూపించటం వలన ప్రజలకు పోలీసులకు ప్రభుత్వానికి చాలా ఉపయోగమున్నది. ప్రభుత్వం వెంటనే శబ్దాలు మార్చాలి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ
సంయమనం పాటించాలి
ఈమధ్య న్యాయవ్యవస్థలో అస్థిమిత పరిచే కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. విచారణ సమయంలో ప్రభుత్వంపైగాని మంత్రులపై గాని వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటించమని న్యాయమూర్తులకు సుప్రీం దిశానిర్దేశం చేసింది. కానీ- పనె్నండు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలుపై పడిన పిల్‌ను విచారిస్తూ గుజరాత్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారొక సుప్రీం న్యాయమూర్తి. నిక్కర్లు ధరించి లాఠీలతో తిరిగే వారికి భయపడి ఓట్లు వేయడం మానేయవద్దని గుజరాత్ ముస్లింలకు ఉద్బోధ చేశారొక విశ్రాంత సుప్రీం న్యాయమూర్తి. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఒకరు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని, అసహనం పెరిగిపోతున్నదని చెప్తూ గోవధ నిషేధానికి సంబంధించిన అధికారణాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఒక సదస్సులో ఉద్ఘాటించారు. లాయర్లు సమ్మెలు చేయరాదని సుప్రీం రూలింగ్ ఇచ్చినా అనేక కోర్టుల్లో లాయర్లు సమ్మెలకు పాల్పడుతున్నారు. ఒక సమ్మెలో మద్రాసు హైకోర్టు భవనంలో విధ్వంసం సృష్టించిన ఇరవై మందిని బార్ కౌన్సిల్ నుంచి తొలగించవలసి వచ్చింది. ముంబాయి హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచిలో ఒక న్యాయమూర్తి ‘‘అవినీతిని అరికట్టలేకపోతే పన్నులు కట్టకండి’’ అని పిలుపు ఇచ్చారు.