ఉత్తరాయణం

ఆర్టీసీ అడ్డగోలు చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమాన్యం (అసలు యజమానులు ప్రజలే) నిర్వహణా వ్యయాలు తగ్గించుకోకుండా నష్టాలు పూడ్చుకోవటానికి అంటూ చీటికి మాటికి ప్రజలపై భారం మోపుతున్నది. తాజాగా చార్జీలు పెంచకుండా ప్యాసింజర్, నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య తగ్గించి పాతబడిన లగ్జరీ బస్సులకే వీడయోలు ఏర్పాటుచేసి నాన్‌స్టాప్ సర్వీసులుగా తిప్పుతూ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల స్థాపన ముఖ్యోద్దేశం ప్రజలకు సేవేగాని లాభాపేక్ష కాదని గుర్తించాలి. ఇప్పటికే ధనికులు, స్థోమత గల వారు బస్సు ప్రయాణం మర్చిపోయారు. కనుక అత్యధిక ప్రజానీకం ప్రయాణించే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు పెంచాలి. మరియు ఈ క్రింది సూచనలు పరిగణనలోకి తీసుకుంటే సంస్థ లాభాల బాట పడుతుంది.
తమిళనాడులో వలే తక్కువ ఖర్చుతో ఎక్కువ సీట్లు (54) కలిగిన బస్సులు ప్రవేశపెట్టాలి. గ్లోబల్ పొజిషనింగు, ఎక్కువ శాతం అశ్లీల హింసాత్మక చిత్రాలు ప్రదర్శించే వీడియోల వంటివి అవసరం లేదు. ఎందుకంటే కాలక్షేపంకోరుకునే వారికి వీడియో ఫోన్లు వున్నాయి. ప్రయాణికులకు రణగొణ ధ్వనుల బాధ తప్పుతుంది. దుబారా, అవినీతి, బస్సు విడి భాగాల కొనుగోళ్ళలోని అక్రమాల వంటివి సాధ్యమైనంత కట్టడి చేయాలి. పెరిగిపోతున్న అధికారుల సంఖ్య, వారి వ్యయాలు తగ్గించి డ్రైవింగ్ తెలిసిన కండక్టర్లను కూడ నియమించాలి. నాన్‌స్టాప్ బస్సుల్లో కండక్టర్ లేకపోవటం, మరోవైపు పెరిగిపోతున్న చార్జీల మోతతో పేదలు లారీలు, ఆటోల వంటి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల పాలవుతున్నారు. బస్సు చార్జీలు పెంచినంతగా సేవల్లో నాణ్యత పెరగలేదు. పైగా పాత బస్సుల్లోనే అధిక చార్జీ చెల్లించి ప్రయణించాలి. తమకు సంబంధం లేకపోయినా సంస్థ ఉద్యోగులు సమైక్యాంధ్ర అంటూ నెలల తరబడి సమ్మె చేయటం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉదారంగా ఉద్యోగుల జీతాలు భారీగా పెంచటంతో సంస్థపై ప్రజలపై భారం పడింది. కనుక సంస్థకు విక్రయించే డీజిల్‌పై పెంచిన వ్యాట్‌టాక్సును తగ్గించి సంస్థను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
నైతిక హక్కు లేదు
దేశంకోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలి, ఉరికొయ్యను ఊయలగా భావించిన భగత్‌సింగ్‌తో భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసేవరకు నిద్రపోనని, పాక్ ప్రేరిత తీవ్రవాదులకు జిందాబాద్‌లు కొట్టిన దేశ ద్రోహి కన్నయ్యను వామపక్ష భావజాలంగల పార్టీ నేతలు పోల్చడం సిగ్గుచేటు. ఇటువంటి దేశ, జాతిద్రోహులకు కుహనా మీడియా వత్తాసు పలుకుతూ ప్రచారాలు చేయడం ఈ దేశ దౌర్భాగ్యానికి నిదర్శనం. కన్నయ్య వంటి దేశద్రోహులుకి భగవత్‌సింగ్, డా.అంబేద్కర్ వంటి మహనీయుల పేర్లను ఉచ్ఛరించే నైతిక హక్కు లేదు.
- వేదుల జనార్దనరావు, వంకాయలగూడెం
అమెరికా మంత్రం మానుకోవాలి
భారతదేశం పదే పదే అమెరికా మంత్రం జపించడం మానుకోవడం శ్రేయస్కరం. ప్రతి చిన్న విషయంలో ఆ దేశం సహాయ సహకారాలను అభ్యర్థించడం మన పాలకులకు ఒక బలహీనతగా మారింది. అమెరికాలో పాతబడిన విజ్ఞానసంపత్తి, మూతబడిన కంపెనీలు క్రొత్త రూపు సంతరించుకొని మన దేశంలోకి క్రొత్త సీసాలో పాత సారాయి చందాన దర్జాగా ప్రవేశిస్తూ కోట్లాది రూపాయల లాభం సంపాదిస్తూ స్వదేశీ కంపెనీలను మూసివేయించే స్థితికి చేరాయి. ఇంత జరుగుతున్నా అమెరికా పైపైకి మనతో ప్రేమ నటిస్తూ, మనతో వాణిజ్య సంబంధాలు, లావాదేవీలు కొనసాగిస్తునే మరొక ప్రక్క పాకిస్తాన్‌ను ఆయుధాలు, యుద్ధసామగ్రి కొనుగోలు కోసం సహాయం అందించడం మానలేదు. ఉగ్రవాదుల నిర్మూలనం అంటూ మనతో కబుర్లు చెబుతూ మరొకప్రక్క పాక్‌కు ఆయుధ సంపత్తి పెంచుతూ, భారత్‌పైకి ఎగదోస్తోంది. గతంలో దేశంలో జరిగిన మారణకాండలో పాక్‌లో శిక్షణ పొందిన ఉఘ్రవాదుల ప్రమేయంపై బలమైన సాక్ష్యాధారాలు అందించినా, ఉగ్రవాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాకిస్తాన్‌ను ఇంతవరకు బలంగా ప్రశ్నించకపోవడంలోనే అమెరికా ద్వంద వైఖరి అర్థవౌతోంది. దక్షిణాసియా ప్రాంతంలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు భారత్, పాక్‌ల మధ్య శత్రుత్వం రావణకాష్టంలా రగులుతుండడమే అమెరికాకు కలిసివచ్చే విషయం. అందువల్లనే భారత్ ఇకనుంచి తన ప్రయోజనాలకు అనుగుణమైన విధానాలనే అనుసరించాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం