ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పనిచేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఉరుకులు, పరుగులపై పని చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను కష్టపడి పని చేయటంతోపాటు మంత్రులు, అధికారుల చేత పని చేయిస్తున్నారు. దేశానికి ఇది శుభ పరిణామమని చెప్పకతప్పదు. నరేంద్ర మోదీ మంత్రుల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించటంతోపాటు అధికారుల పని తీరును కూడా సమీక్షించటం హర్షణీయం. కేవలం అధికారులపై ఆధారపడి మంత్రులను గాలికి వదిలివేయకుండా ముందుకు సాగటం నరేంద్ర మోదీ పాలనా దక్షతకు నిదర్శమని చెప్పాలి. ఆయన హెడ్ మాస్టర్‌గా వ్యవహరించటంతోపాటు అంతా తానై చేస్తున్నారనే ఆరోపణ ఉన్నది. ఇందులో కొంత నజం లేకపోలేదు. మోదీ అంతా తానై చేయటంతోపాటు మంత్రులతో కూడా పని చేయించేందుకు ప్రయత్నించటంతోపాటు వారి పని తీరును కాలానుగుణంగా సమీక్షిస్తున్నారు. మోదీ అంతా తానై పని చేయటం వలన మంచే జరుగుతోంది తప్ప చెడు జరగటం లేదు. కేవలం దేశాభివృద్ధి లక్ష్యంగా పని జరగటం వలన ముందు, ముందు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రధాన మంత్రి గత వారం కేంద్ర మంత్రుల పని తీరును దాదాపు ఆరు గంటల పాటు సమీక్షించిన తీరు చూస్తే నరేంద్ర మోదీ ఏ స్థాయిలో పరిపూర్ణత సాధించేందుకు ప్రయత్నిస్తున్నారనేది అర్థమవుతుంది. మోదీ మంత్రులపై తనకున్న ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు సమీక్షా సమావేశాలు జరపటం లేదు.
మంత్రుల పనితీరును సమీక్షించేందుకు ఆయన తనను తాను సిద్ధం చేసుకోవటం ముదావహం. మంత్రులతో సమావేశమయ్యేందుకు ముందు మోదీ పెద్ద ఎత్తున హోం వర్క్ చేశారు. ప్రతి మంత్రిత్వ శాఖ పని తీరుపై నివేదికలు తయారు చేయించుకున్నారు, బడ్జెట్‌లో ఆయా శాఖలకు కేటాయించిన నిధులు, పథకాల వివరాలతో కూడిన ఒక నివేదిక సిద్ధం చేసుకోవటంతోపాటు ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకాలు ఏ స్థాయిలో అమలు జరుగుతున్నాయనేది నిగ్గు తేల్చుకున్నారు. ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసుకున్న తరువాతనే మంత్రులతో సమీక్ష జరపటం గమనార్హం. ఆయా మంత్రులు కూడా తమ పని తీరు, తమ శాఖ పని తీరుపై నివేదికలు సిద్ధం చేసుకుని సమీక్షా సమావేశంలో ప్రధాన మంత్రికి వివరించారు. మంత్రులు ఇచ్చిన నివేదికలోని వివరాలు ప్రధాన మంత్రి తమ నివేదికలోని ఫలితాలతో పోల్చుకుని నిగ్గు తేల్చేందుకు ప్రయత్నించారు. తద్వారా వాస్తవంగా జరుగుతున్నదేమిటి? అభివృద్ధి పథకాలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయి? ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతోంది? ఆభజివృద్ధి ఫలాలు ఏ మేరకు వారికి చేరుతున్నాయి? అనేది అంచనా వేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో చాలా మంది మంత్రుల పని తీరుకు సంబంధించిన నిజ స్వరూపం ముందుకు వచ్చిందని చెప్పకతప్పదు.
నరేంద్ర మోదీ ప్రతి మంత్రిత్వ శాఖ పనితీరును సమీక్షించటంతోపాటు ఆయా మంత్రులు ఎంత సమర్థతతో పని చేస్తున్నారనేది తేల్చారు. ఆయన కొందరు మంత్రుల పని తీరును ప్రశంసిస్తే మరికొందరు మంత్రులకు చురకలు వేశారు. మంత్రులు మరింత సమర్థంగా పని చేయాలని స్పష్టంగా చెప్పటంతోపాటు కష్టపడి పని చేయకపోతే ఉద్వాసన తప్పదనేది కూడా స్పష్టంగా చెప్పటంలో మోదీ వెనకాడలేదు. ఐదు గంటల పాటు జరిగిన మంత్రుల సమీక్షా సమావేశం కేంద్ర ప్రభుత్వం మరింత సమర్థంగా పని చేసేందుకు దోహదపడిందని చెప్పకతప్పదు. గతంలో కొందరు ప్రధాన మంత్రులు తమ మంత్రుల పని తీరును సమీక్షించేందుకు ప్రయత్నించినా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. తప్పులు చేయటమే కాదు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్న మంత్రులను అదుపు చేయటం అటుంచితే పల్లెత్తు మాట కూడా అనలేకపోయారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో పది సంవత్సరాల పాటు సాగిన యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు. ప్రధాన మంత్రికి సైతం వారి శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వీలుండేది కాదు. కొందరు మంత్రులైతే మన్మోహన్ సింగ్ నాయకత్వాన్ని ప్రశ్నించే స్తాయికి ఎదిగిపోవటం తెలిసిందే.
యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్.డి.ఏ సంకీర్ణ ప్రభుత్వం ఎంతో సమర్థంగా పని చేయటంతోపాటు అవినీతి అనేది లేకుండాపోయింది. నరేంద్ర మోదీకి పని చేసే ప్రధాన మంత్రి అని ముద్ర వేయటంలో ఎలాంటి తప్పు లేదు. మోదీ సమీక్షల మూలంగా కొందరు మంత్రులు ఇబ్బంది పడటమే కాదు బాధ కూడా పడుతున్నారు. మంత్రులు కూడా తమ వైఖరిని మార్చుకోవటం మంచిది. ప్రధాన మంత్రితో పోటీ పడి పనిచేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడు దేశం రూపు,రేఖలు మారుతాయి. ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం అంటే అసమర్థత, అవినీతికి ప్రతీకగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలకు ఇష్టానుసారం వచ్చే రోజులు పోయాయి. బయోమెట్రిక్ విధాన మూలంగా ఉద్యోగులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకతప్పటం లేదు. మోదీ మూలంగా మంత్రుల, ఉద్యోగుల్లోవచ్చిన సహేతుక మార్పు శాశ్వతమై ఒక కొలబద్దగా మారాలి.