ఉత్తరాయణం

నరకానికి (రహ)దారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు నరకాన్ని తలపింపజేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అడుగడుతునా ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు స్పీడ్ బ్రేకర్లతో నింపివేశారు. ఇక రోడ్లు ఎక్కడెక్కడ బాగుంటాయో ఎక్కడ గుంతల మయమై ఉంటాయో తెలియని పరిస్థితి. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమై ఈ నీళ్ళలో స్పీడ్ బ్రేకర్లు, గుంటలు అర్ధంకాక వాహనాలు పల్టీ గొట్టడంవంటి సంఘటనలు కోకొల్లలు. మరి ఈ సంవత్సరం మరిన్ని భారీ వర్షాలు పొంచి ఉన్నందున రోడ్లు మరెంత అధ్వాన్నంగా తయారవుతాయో, మరెన్ని ఇబ్బందులు తలెత్తుతాయో! అవసరమైనచోట్ల రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలి. అనవసరమైన స్పీడ్‌బ్రేకర్లు తొలగించి, అత్యవసరమైన ప్రదేశాలలోనే ఉంచి, అక్కడ హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయాలి. స్పీడ్‌బ్రేకర్లకు రేడియం రంగులు వేయాలి. నిరంతర పర్యవేక్షణతో వాహనదారుల అతివేగానికి కళ్ళెం వేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
దేవాదాయశాఖ నిర్లక్ష్యం
ఏ పనైనా మొదలుపెట్టేముందు విఘ్నాలు తొలగించి, సకల జయాలు సిద్ధింపజేయమని విఘ్నేశ్వరునికి పూజ చేయడం భారతీయుల ఆచారం. గుంటూరు జిల్లా, తాడపల్లి మండలం గీతానగరం గ్రామంలో 17వ శతాబ్దానికి చెందిన విఘ్నేశ్వరుని ఆలయం పాలకుల నిర్లక్ష్యానికి ఫలితంగా భూగర్భంలో కలిసిపోతోంది. కోట్లాది రూపాయల ఆదాయం, లక్షలాది భక్తులు నిత్యం దర్శించుకునే ఈ ఆలయానికి దేవాదాయశాఖ నిర్లక్ష్యం ఫలితంగా దుస్థితి దాపురించింది. కార్యాలయ భవనం నిర్మాణం సమయంలో ఈ గుడి ప్రక్కనుండి మట్టిని తొలగించారు. అందువలన వర్షం కురిస్తే గుడి నీటిలో మునిగిపోయే పరిస్థితి వచ్చినందున ఈ గుడిలో వున్న విగ్రహాలను తొలగించారు. ఇది జరిగి రెండు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఆలయ పునర్ నిర్మాణం జరగలేదు. గుడికి వున్న అపారమైన మహాత్యం, భక్తులలో వున్న భక్తివిశ్వాసాలను దృష్టిలో వుంచుకొని తక్షణం ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టాలని అశేష భక్త జనావళి కోరుతున్నారు. పుష్కరాలకోసం కోట్లాది రూపాయలు కేటాయించే ప్రభుత్వం ఈ ఆలయ పునర్నిర్మాణంకోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం బాధాకరం.
- ఎం.కనకదుర్గ, తెనాలి
హోర్డింగులను నిషేధించాలి
రాజకీయ పార్టీలవారు, సినిమాలవారు, వాణిజ్య సంస్థలవారు, దేవాలయాలవారు, పాఠశాలలు, కళాశాలలు, మున్సిపాలిటీలు వారు వీరు అననేల అన్ని రకాలవారు రోడ్ల ప్రక్కన పెద్ద భారీ హోర్డింగులు, కటౌట్లు పెడ్తున్నారు. ఎవరి ఇష్టానుసారం వారు యథే4చ్ఛగా పెడ్తున్నారు. గాలి వాన వచ్చినప్పుడు అవి కూలి వాహనముల మీద మనుషుల మీద పడి గాయపడటం, మృతి చెందడం, ఆస్తులకు నష్టం కలుగడం మొదలైన ప్రమాదాలు జరుగుతున్నాయ. ఇవేగాక రోడ్లకు అడ్డంగా తోరణాలు కడుతున్నారు. అవి తెగిపోయి దారిలో వెళ్లే వారి మెడలకు, కాళ్లకు చుట్టుకొని గాయాలపాలై ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటివల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. హైకోర్టు దీనిని సుమోటోగా తీసుకొని రోడ్లమీద హోర్డింగులు, కటౌట్లు పెట్టడాన్ని, తోరణాలు కట్టడాన్ని నిషేధించి, దానిని మున్సిపాలిటీలు, పోలీసువారు అమలుపరిచేటట్లు ఆదేశించవలసినవిగా కోరుకుంటున్నాం.
- బి.సత్యప్రకాశ్, సూర్యాపేట
పదవి లేకుంటే బతకలేరా?
అభివృద్ధి పేరుతో వలసలు పోతున్నారు. గతం ప్రభుత్వాల హయాం అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి ఇప్పుడే జరుగుతోంది! ఎం.ఎల్.ఏలు, ఎంపీలుగా, ఎంఎల్‌సిగా స్థానికంగా ప్రముఖ నాయకులుగా ఎదగటానికి సహకరించి, ఎన్నో ఏళ్ళుగా గుర్తింపును ఇచ్చిన మాతృ పార్టీకి ద్రోహం చేసి కేవలం అభివృద్ధి వలసలు వెళ్ళటం ఏమాత్రం సభ్యత. పార్టీని చూసి ఎన్నుకున్న ఓటర్లను ముంచటమే. ఒక్క ఐదు సంవత్సరాలు పదవులు లేకపోతే బ్రతకలేరా? పోరాటాల ద్వారా ప్రజలకు దగ్గరై తిరిగి అధికారంలోకి కృషిచేయాలే తప్ప తరచు పదవులకోసం పార్టీలను మార్చేవారికి ప్రజలు గుణపాఠం చెప్పకపోతే మనం నష్టపోతాం. ఆలోచించి ఓటువేయాలి. నిలదియ్యాలి. అభివృద్ధిపరంగా ప్రతిపక్షమైనా ఏదైనా నియోజకవర్గ నిధులు అందుతాయి. దాంతో తృప్తిపడాలి తప్ప తల్లి పాలుతాగి రొమ్ముగుద్దే సంస్కృతి విడనాడాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం
అభివృద్ధికి ప్రణాళికలు మంచి పరిణామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టడం సంతోషదాయకం. రెండేళ్ల తరువాత ఆలస్యంగానైనా శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికిగాను రూ.2కోట్ల వంతున కేటాయించడం మంచి పరిణామం. ఈమేరకు సంబంధిత ఎమ్మెల్యే, నియోజకవర్గ నోడల్ అధికారి సంయుక్తంగా ప్రజాపనులను ఎంపిక చేసి జిల్లా కలెక్టర్లద్వారా ప్రణాళిక శాఖకు పంపాల్సి ఉంటుందని తాజా నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక నిధులకోసం శాసనసభ్యులు ప్రభుత్వాధినేతల చుట్టూ తిరగాల్సిన పని తగ్గుతుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమన్యాయం జరుగుతుంది. కేంద్రం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.350 కోట్లు కేటాయిస్తుంది.
- వి.కొండలరావు, పొందూరు