ఉత్తరాయణం

పెరుగుతున్న ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరగాయల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటమే గాక తగ్గడం లేదు. టమాటాలు, పచ్చిమిచ్చి, బెండకాయలు ఒకటేమిటి, చాలా రకాల కూరగాయల ధరలు శరవేగంగా పెరుగుతుండటమే తప్ప తగ్గే సూచనలు కనబడటం లేదు. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇక నిరుపేదలు పస్తులుండాల్సిందేనా? ప్రభుత్వం చొరవ తీసుకొని కూరగాయల ధరలు తగ్గేలా చూడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
మోదీ దూరదృష్టి
టోక్యోలో 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత ప్రభు త్వం ఆవిష్కరించిన రోడ్‌మ్యాప్ దేశంలో క్రీడలను ప్రోత్సహించి, అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు అద్భుతంగా రాణించేందుకు ఉపకరించేదిగా వుంది. అహర్నిశలు ఇంతవరకు క్రికెట్ నామజపం చేసిన గత ప్రభుత్వాల ఆలోచనా ధోరణికి భిన్నంగా అన్ని క్రీడలను సమానంగా ప్రోత్సహించి, అంతర్జాతీయ వేదికలపై భారత్ అద్భుతాలు సృష్టించే విధంగా మోదీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందించడం ముదావహం. 13-15 సం.ల మధ్య వున్న యువ ప్రతిభావంతులను ఎం పక చేసి సకల సౌకర్యాల మధ్య కఠిన శిక్షణ యిప్పించి వారిని ఒలింపిక్స్‌కు సిద్ధం చేసేందుకు సాయ్ ద్వారా 900 కోట్ల ప్రణాళిక యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చేదిగా వుంది. విదేశాలలో అంతర్జాతీయ పోటీలకు కనీసం ఎనిమిదేళ్ల ముందు నుండి క్రీడాకారులను సమాయత్తం చేస్తా రు. విదేశీ కోచ్‌లు, అత్యుత్తమ శిక్షణా వసతులు, మానసిక స్థయిర్యం కోసం యోగా, వ్యక్తిత్వ వికాస నిపుణులు వంటి విధానాలను మన ప్రభుత్వం సత్వరం అమలుచేయాలని నిర్ణయించడం మోదీ ప్రభుత్వం యొక్క దూరదృష్టికి నిదర్శనం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఎగ్జిట్‌పోల్స్‌ను నిషేధించాలి
ఇండియాలో ఎగ్జిట్ పోల్స్‌ను పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే ఎన్నో సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించి, తప్పుడు లెక్కలు ప్రజలకు అందజేస్తున్నారు. ప్రజలు దేనికి ఓటు వేసేది బయటకు చెప్పరు. కేవలం వూహించి తమ నిర్ణయాన్ని ఎగ్జిట్‌పోల్ సంస్థలు ప్రకటించటం తప్పేగాదు, ఓటరును పరోక్షంగా ప్రలోభపెట్టినట్లవుతుంది. ఉదాహరణకు తమిళనాడులో డియంకె అధికారంలో వస్తుందని చెప్పాయి. కాని ఎగ్జిట్‌పోల్ సంస్థలు చెప్పినవన్నీ తప్పని తేలింది. కేవలం డియంకె మీది సానుభూతితో తప్పుడు లెక్కలు ప్రకటించి, ఓటరును ప్రలోభపెట్టాలని చూశాయి. ఇది పరోక్షంగా ఓటరును డియంకెకు అనుకూలంగా మార్చాలని చూడటమే గదా! కావున కేంద్ర ప్రభుత్వం గాని, కేంద్ర ఎన్నికల కమీషన్‌గాని కలుగజేసుకొని ఎగ్జిట్‌పోల్స్‌ను నిలుపుదల చేయాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
ప్రత్యేక హోదా మరచారా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సరిగా వ్యవహరించటం లేదనిపిస్తోంది. ఒక్కోసారి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా అవసరం లేదు.. ప్యాకేజీకోసం ప్రయత్నిస్తున్నాం. అపుడే అభివృద్ధి జరుగుతుందని, మరో సమావేశంలో హోదాకోసం ప్రయత్నిస్తున్నాం అని అంటున్నారు. అసలు ముఖ్యమంత్రికే హోదా రావటం ఇష్టంలేనట్లుగా ఉంది. తెలంగాణా ఆవిర్భావ సమయంలో ప్రత్యేక హోదా వల్ల అభివృద్ధి జరుగుతుందని అంతా మాట్లాడినవారే. వెంకయ్యనాయుడుగారు కూడా పార్లమెంటులో పదేళ్లు కావాలి. అయిదేళ్లు సరిపోదని వీరోచితంగా డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక కనీసం దాని గురించి మాట్లాడటం లేదు. తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా టిడిపి-బిజెపిలు రెండూ హోదా గురించి హోరెత్తించారు. ఇపుడు హోదా గురించి ఇరు పార్టీల రాజకీయ నాయకులు తలోమాట మాట్లాడుతున్నారు. హోదా కనుక ఇవ్వకుండా ఆంధ్రకు అన్యాయం చేస్తే ప్రజలు మరోసారి నమ్మి మోసపోరు. ఎన్నికలలో చావుదెబ్బ తగులుతుంది.

- పి.శ్రీరామ్, పిప్పర

వైద్యసేవ ముఖ్యం

కార్పొ‘రేట్’వైద్యం గురించి ఈ శీర్షికలో ఎన్నో ఉత్తరాలొచ్చాయి. కించిత్ చలనం వచ్చినట్లు లేదు. ఒక మిషన్ హాస్పిటల్లో బోర్డు చూడటం తటస్థించింది. సుఖ ప్రసవం అంటే నార్మల్ డెలివరీకైతే 28వేలు, కాన్పు కష్టమైతే అంటే ఏదైనా కాంప్లికేషన్ ఎరైజ్ అయితే 68వేలని, లోపల ఏం జరుగుతున్నదో బైట కూర్చున్న వాళ్ళకు తెలీదుకదా బిల్లు చేతుల్లో పడేంతవరకు ఈ విషయం తీసి పక్కనపెడితే ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో
పేషెంట్ తాలూకువారికి గంటల తరబడి శోష రాకుండా టీ, బిస్కట్లు, మజ్జిగ యివ్వడం గమనించాను. భారీ ప్రకటనలకు జనం రారు. ఏదైనా యిటువంటి మంచి పనిచేస్తే ఆనోటాఆనోటా పడి హాస్పిటల్ పట్ల క్రేజ్ వస్తుంది బిజినెస్ ట్రిక్కే కావచ్చు. సామర్ధ్యం ఉండి మంచి వైద్యసేవలందితే ఎవరైనా ఇట్టే సదరు ఆసుపత్రులకు వస్తారు. జనంలో తెచ్చుకునే మంచిపేరు చాలు. ప్రకటనల వల్ల ఏవిధమైన ఫలితం ఉండబోదు.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ