ఉత్తరాయణం

ఆ గొప్పదనం హైందవానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం విశ్వమంతా హిందూమతం విస్తరించి ఉండేది. ఏమతం వారైనా వారు పేర్కొనే దేవుళ్లు లేరు అని అనుకుంటే ఆయా మతాలు లుప్తమైపోతాయ. కానీ ఏ దేవుడూ లేడని వాదించినా హిందూమతం మాత్రం తన ఉనికిని కోల్పోదు. భగవంతుడు కాంతి స్వరూపుడు ఆయన్ను మనం చూడటం మనం చేసుకున్న పుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. భగవానుని రూపంపై దృష్టి కేంద్రీకరించడానికి ఒక ఆధారం అవసరం. అందుకే హిందువైనవారు ఒక రూపాన్ని మనసులో ప్రతిష్ఠిం చుకొని ఆరాధిస్తారు. విగ్రహారాధన ఆవిధంగా వచ్చిందే. భక్తుడి పూజలు సఫలీకృతమైననాడు విగ్రహం స్థానే జ్యోతి సాక్షాత్కారం అవుతుంది. అప్పుడతనికి విగ్రహం అవసరంలేదు. అతని మనోఫలకంపై భగవానుని రూపం నిత్యమై నిలుస్తుంది. ఈ గొప్పతం హిందూమతానిదే.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
హరితహారం విజయవంతం
తెలంగాణలో సరైన సమయంలో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటిన ‘హరితహారం’ విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థులను భాగస్వామ్యం చేయడం దానికి ఒక కారణంగా చెప్పవచ్చు. రాష్ట్రం నలుమూలలా ఒకేసారి తొలకరి వానలు కురిసిన సమయంలో ఇంతటి భారీ కార్యక్రమం చేపట్టడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. అయతే నాటిన మొక్కల సంరక్షణకు గట్టి కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణ మన కర్తవ్యంగా భావించాలి. చెట్లతోనే మానవ జీవనం ముడివడి ఉన్నదన్న సత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే ప్రజలు చైతన్యవంతులై నాటిన మొక్కల పరిరక్షణ చేపడతారు. హరితహారం లక్ష్యం నెరవేరుతుంది.
-జి.వి. రత్నాకర్ రావు, హనుమకొండ
అలుపెరుగని వక్త ‘దివాకర్ల’
పువ్వుపుట్టగానే పరిమళిస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం దివాకర్ల వేంకటావధానిగారు. అద్భుతమైన ధారణాశక్తి, మేధా సంపత్తితో ఆయన తెలుగు సాహిత్యంలో తనకంటూ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అవ దానిగారు పంచకావ్యాల మీద గంటల తరబడి అలు పులేకుండా ఉపన్యసించేవారు. తర్వాత జ్ఞాపకశక్తి తగ్గి అవధానాలు చేయడం మానేశారని చెప్పేవారు. అవధాని గారు జన్మించింది యండంగండి పశ్చిమ గోదావరి జిల్లా, బీమవరం-తాడేపల్లి గూడె మధ్య దారిలో ఉన్నది.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
తిరస్కారం తప్పదు
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరూ అవినీతిపరులని, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శిస్తుండేవారు. శాసనసభలో బహిరంగ సభల్లోనూ, విలేకర్ల సమావేశాలలోను ఈ విమర్శలు ఊతపదంలా వస్తుండేవి. అయితే ఇప్పుడు ఏపిలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవటంతో తమ విమర్శలు వైయస్‌ఆర్ సిపి వైపు ఎక్కుపెడుతున్నారు. ఆ పార్టీని రోజూ విమర్శిస్తున్నారు.
వైయస్‌ఆర్ సిపి నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాల్లో తప్పులు వెతుకుతున్నారు. ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, నాటకాలాడుతున్నారని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. అయితే ఒకపక్క వారిని విమర్శిస్తూ మరోవంక ఆ పార్టీ నేతలను అక్కున చేర్చుకుంటూ ఆదరిస్తున్నారు. ఆ పార్టీ నేతలను సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ కండువాలు కప్పుతున్నారు. వారి నోటికి బలయిన కాంగ్రెస్ వైయస్‌ఆర్‌సిపి నేతల్లో చాలామంది ఇప్పుడు టిడిపిలోనే ఉన్నారు. ఇలా విమర్శిస్తూనే ఆ పార్టీ నాయకులను ఎలా తమ పార్టీలో చేర్చుకుంటున్నారో ఏం ఆశించి చేర్చుకుంటున్నారో తెలియటం లేదు. వారికే తెలియాలి. తెలంగాణాలో టిఆర్‌ఎస్ కూడా ఇదే విధంగా చేస్తున్నది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
అణు నిబంధనలు తగవు
కొద్దికాలం క్రిందట జపాన్‌లోని పుకుషిమా అణుకేంద్రంలో జరిగిన ప్రమాదానికి 200 బిలియన్ డాలర్ల పరిహారం ప్రకటించి, అందుకు అంగీకరించని కారణంగా అణు కేంద్రాన్ని మూసివేయడంతోపాటు ఆపరేటర్లపై కేసు వేయడం జరిగింది. ఈ సంఘటన ప్రాతిపదికగా భారత్‌లో నిర్మించే అణు కేంద్రాలలో దురదృష్టవశాత్తు ప్రమా దం సంభవిస్తే ప్రజలకు, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పరిహారంపై పరిమితి విధించాలని అమెరికా, ఫ్రాన్స్‌వంటి అగ్ర రాజ్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. గత యుపిఏ ప్రభుత్వం ఈ ఒత్తిడులను తట్టుకొని కఠినంగా వ్యవహరించడంవలనే ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం లభించలేదు. అయితే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో కొంత సరళీకృత విధానాన్ని అవలంభించవచ్చునన్న మీడియా కథనాలు ప్రజలలో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నష్టపరిహారం ఆపరేటర్ మాత్రమే చెల్లించాలని, అణు రియాక్టర్లను సరఫరాచేసిన కంపెనీలపై బాధ్యత వుంచకూడదన్న షరతుకూడా మంచిది కాదు. అణ్వస్త్ర, అణుశక్తి రంగాలకు సంబంధించి నిబంధనలను భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా విధించే విధానాన్ని ఎదిరించాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ