ఉత్తరాయణం

అర్థం లేని అంతరాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ రేడియో స్టేషన్ నుంచి వార్తలు వస్తూ మధ్యలో ఆగిపోవడం, ఇతర విధాలైన శబ్దాలు రావడం, ఒక కార్యక్రమం చెప్పబోయ ఇంకొక కార్యక్రమం చెప్ప డం, ఉదాహరణకు మధ్యాహ్నం ప్రసారం చేసే పసిడి పం టలు, వేరే కార్యక్రమంలో చెప్పడం. ఉదయం ప్రసార మయ్యే నాదస్వరం ఒక్కొక్కసారి సక్రమంగా విని పించదు. ఇవన్నీ చూస్తుంటే చాలా విసుగ్గా ఉంటోంది. పోనీ కడప కేంద్రం చూద్దామంటే దూరం వల్ల సరీగ్గా రాదు. ఎందుకు ఈవిధంగా అంతరాయం కలుగుతు న్నదో శ్రోతలకు అర్థంకాని ప్రశ్న.
- సుబ్బరాయ వర్మ, విజయవాడ
జలపాతాల వద్ద భద్రత కరవు
పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే జలపాతాల వద్ద భద్రత, నిఘా కరవు అవడంతో మందుబాబులు విచ్చల విడిగా పేట్రేగిపోతున్నారు. సందర్శకులకు ఆటంకాలు కల్పిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. జలపాతం లో ఈతకోసం దూకి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. అక్కడ పోలీసు నియంత్రణ కొరవడడం వల్ల అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. జలపాతాల వద్ద విపరీతపైన రద్దీ ఉన్నప్పుడు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రక్షణకు సంబం ధించిన ఎటువంటి బోర్డులు కూడా ఎక్కువ ఏర్పాటు చేయలేదు. ప్రమాద సూచికలు ఉండవు. మచ్చుకైనా పో లీసులు కనబడరు. ఆహ్లాదం కంటె తాగుడుకు స్పాట్లుగా మారుతున్నాయ. ఇటువంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఖమ్మంజిల్లా వాజే డు మండలం చీకుపల్లి గ్రామంలో గల బోగత జలపాతం వద్ద ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయ. ఇప్ప టికైనా అక్కడ పోలీసు నియంత్రణ అవసరం.
- అయనం రఘురామారావు, ఖమ్మం
ఉపయోగం లేని హోర్టింగ్‌లు
జంటనగరాలలో అనధికార హోర్టింగ్‌ల తొలగింపు విషయంలో తెలంగాణ పురపాలక శాఖ కనె్నర్ర చేస్తున్న వార్త ముదావహం. అలాగే అధికార హోర్టింగ్‌లూ ప్రమా ణాలు పాటిస్తున్నదీ లేనిదీ పరిశీలనకు పూనుకోవాలి. మరో విషయం ఏమంటే-వివిధ రాజకీయ పక్షాలవారి పార్టీ ప్రచార సందర్భంలో ఉపయోగించే ఫ్లెక్సీలు, కాగి తాల తోరణాలు సందర్భం ముగియగానే తీసివేయడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఆచరణను ప్రభుత్వం నిఘావేసి గమనించాలి. ప్రతిదీ ప్రభుత్వ యంత్రాంగం అనుమతితో జరగాలి. లేకపోతే ఆయా కాలానుగుణంగా ఆయా పార్టీల్లో ఉండే గ్రామకమిటీ ఉపనేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే అరవై తలకాయల ఫ్లెక్సీ మళ్లీ జన్మదినం వచ్చేవరకు అట్లాగే ఉంటుంది. మూడవ వరు సలో ఎనిమిదవ తల నాదే అని చెప్పుకునే కార్యకర్తలు పెరగడం తప్ప ఉపయోగం ఉండదు.
- వి.ఆర్. ఎ. రాజు, హైదరాబాద్
పుష్కర పనులు పూర్తయ్యేనా?
కృష్ణానది పుష్కరాలకోసం రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా చేస్తున్న ఏర్పాట్లు కనీసం పుష్కరాల నాటికి అయనా పూర్తి అవుతాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే గోదావరి పుష్క రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కనీసం కృష్ణ పుష్కరాల ఏర్పాట్లనైనా ముందు పూర్తి చేస్తారని అను కున్నాం. అరకొర పనులు, నాసిరకం ఘాట్ల నిర్మాణం, రోడ్లకు పైపైన మెరుగులు చూస్తుంటే ఇవన్నీ కాంట్రాక్టర్లు ముందుగా బాగుపడటానికి తప్ప వీటితో సామాన్యునికి ఒరిగేది ఏమీ లేదన్న విషయం స్పష్టమవుతుంది. దీనికితోడు విజయవాడ లో ఆలయాలను తొలగించే విషయంలో మాత్రం అధికార్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పుష్కర స్నానం చేసిన భక్తు లు ఎవరిని దర్శించుకోవాలి? ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టం గా కనిపిస్తున్నది.
-మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
కుల రాజకీయాలతో కలుషితం
తెలుగు రాష్ట్రాల ఉపకులపతుల నియామకాల్లో కుల రాజకీయాలకు పెద్దపీట వేయడం దురదృష్టకరం. ఒకసారి ఓ సామాజిక వర్గంవారిని ఉపకులపతిగా నియ మిస్తే, రెండోసారి మరో సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కుల రాజకీయాలవల్ల విశ్వవిద్యాల యాలు కలుషితమైపోతున్నాయ. ఫ్యాకల్టీ నియామకాల్లో కూడా కుల జాడ్యం ప్రవేశించింది. ఈ దుస్థితిని దూరం చేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు