ఉత్తరాయణం

అనవసర వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతోమంది కాశీకి, హరిద్వార్‌కు వెళ్లలేనివాళ్ళు ఉన్నా రు. గంగాజలం తాగాలని మాత్రం ప్రతి హిందువుకు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వంవారు స్వచ్ఛమైన బాటిళ్ళలో కోరిన వారికి అందజేయడానికి పోస్ట్ఫాసుల ద్వారా ఏర్పాటుచేసింది. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఇలా జరిగింది. ఇప్పు డు కృష్ణా పుష్కరాల సందర్భంగా అలా చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. ఇది మంచి పని. కాని ప్రతి మంచి పనిని వ్యతిరేకించేవాళ్లు కొందరు సమాజంలో తప్పక ఉంటారు. మతపరమైన మంచి పనులు ద్వారా అధిక సంఖ్యాకుల ఓట్లు వారు పొందుతారని మరొకరి బాధ. ఇప్పుడు కరుణానిధి ఈ కార్యక్రమాన్ని ఎద్దేవా చేశా రు. దీనితోపాటు పసుపు కుంకుమలను కూడా పంపండి అని వ్యంగ్యంగా అన్నారు. తమిళనాడులోని హిందూ మున్నాని దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పసుపు, కుంకు మ గంగాజలం ప్యాకెట్లను కరుణానిధి ఇంటికి పోస్టు పార్సెల్ ద్వారా పంపి తమ నిరసన తెలియజేశారు.
- కాకుటూరి సుబ్రహ్మణ్యం, చెన్నై
కరవుభత్యం మంజూరు చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2015 జూలై 2016 జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు విశ్రాంతి ఉద్యోగులకు రావాల్సిన కరువుభత్యం బకాయిలను ఇంతవరకు మంజూరు చేయకపోవడం విచారకరం. కేంద్ర ప్రభుత్వం నేడోరేపో ఈ ఏడాది జూలైకి సంబంధించి కరవుభత్యాన్ని మంజూరు చేయనుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడి వున్న రెండు డి.ఏ.లను వెంటనే మంజూరు చేయాలి. కరవుభత్యం ఇంతవరకు మంజూరుకాకపోవడంతో ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వర్గాలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లో నవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈవర్గాల వారికి నూతనోత్సాహాన్ని నింపేందుకు బకాయిపడిన రెండు డి.ఏ.లను వెంటనే మంజూరుచేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
పంట విరామం ఎందుకంటే..
పంట కాలువలకు నీరుసరఫరా లేటు (2నెలలు 15రోజులు) ఎరువులు, పురుగు మందులు, కూలీలు కొరత, విత్తనాలు, దుక్కి వంటి వాటికి పెట్టుబడి విపరీతంగా పెరిగింది. ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంవలన పంట బోడెలు, మురుగు కాలువలు త్రవ్వించకపోవుట వలన రైతు నష్టాలఊబిలో కూరుకుపోతున్నాడు. అందువల్లనే రైతు పంట విరామం ప్రకటించుకొంటున్నా డు.
- కొండ్రెడ్డి రామమోహనరావు, పుల్లెటికుర్రు
దేవాలయాల్లో దోపిడీలు
ఇటీవల మన రాష్ట్రంలో ప్రసిద్ధ ప్రాచీన దేవాలయాలలో దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతుండటంతో ఆలయాలు పవిత్రతను కోల్పోతున్నాయి. దేవతామూర్తుల పంచలోహ విగ్రహాలు దోపిడీకి గురౌతున్నాయి. గుప్తనిధుల పేర్లతో మన శిల్ప సంపదను ధ్వంసంచేస్తూ హిందూ మతం ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు గ్రహణం పట్టిస్తున్నారు. మన ప్రాచీన శిల్పసంపదను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై వున్నది.
- ఉప్పు సత్యనారాయణ, తెనాలి
బస్టాండ్‌లేక ఇబ్బందులు
నల్గొండ జిల్లాలో ముఖ్యమైన ప్రదేశంగా ప్రఖ్యాతిగాంచిన నడిగూడెంలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. మండలంలోవున్న ఇరవై గ్రామ పంచాయితీలనుండి నిత్యం వందలాది మంది ఈ ప్రాంతానికి వస్తుంటారు. బస్సులు, ఆటోలకోసం వేచిచూసేందుకు ఎండ, వానకు తడుస్తూ నిలబడాల్సిన పరిస్థితి వుంది. వెనకటి కాలంలో నిర్మించిన బస్టాండ్ పైకప్పు కూలి శిథిలావస్థకు చేరి బిచ్చగాళ్ళు, సన్యాసులకు నిలయంగా మారింది. జాతీయ రహదారినుండి నడిగూడెం వరకు 7కి.మీ. రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తున్నా ఇక్కడ బ స్టాండ్ నిర్మాణంకోసం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం. రోడ్డుపై నిల్చొనే ప్రయాణికులకు వేగంగా వచ్చే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, లారీల వల న అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికార్లు స్పందించి తక్షణమే నడిగూడెంలో బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలి. అధికార్ల నిర్లక్ష్యం వల్ల బాధపడు తున్నది ప్రజలు మాత్రమేనని గుర్తించాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ