ఉత్తరాయణం

కొరవడిన సేవా దృక్పథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై ఏళ్ల క్రితం వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధిచెందలేదు. ఇప్పటిలా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. కాని మంచి మనస్సు, నిజాయితీ, నిబద్ధత కల్గిన డాక్టర్ల దృక్పధం వలన రోగులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించి సాధ్యమైనంత త్వరగా స్వస్థత చేకూర్చేందుకు కృషిచేసేవారు. ఫీజుకంటే రోగాన్నినయం చేసి రోగులకు మంచి చేయగలిగానన్న సంతృప్తికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు వైద్యశాస్త్రం విస్తృతంగా అభివృద్ధి చెందినా వైద్యోనారాయణా హరిః అనే ఆర్యోక్తికి పర్యాయపదంగా నిలిచే డాక్టర్లను వేళ్లమీద లెక్కించగలుగుతున్నాం. 70 ఏళ్ల వయస్సులో కూడా డబ్బు ఆస్తులపట్ల యావ తగ్గడంలేదు. కార్పొరేట్ కల్చర్‌లో దోచుకోవడమే ప్రధానాంశంగా తయారైంది. ముఖ్యంగా యువ వైద్యులకు సేవాదృక్పథం పూర్తిగా కొరవడడం బాధాకరం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఆగని వేధింపులు
సమాజంలో స్ర్తిల పరిస్థితి క్షణం క్షణం భయం భయంగా ఉంటున్నది. రోజురోజుకూ వారిపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి కాని తగ్గడం లేదు. ప్రేమ పేరుతో వేధింపులు, హత్యలు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందో అర్ధంకావడం లేదు. ఇన్ని జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లయినా అనిపించకపోవడం శోచనీయం. స్ర్తిలపై వేధింపులకు విదేశాల్లో మాదిరిగా అత్యంత కఠినమైన శిక్షలు విధించాలి. అవి ఎలా ఉండాలంటే ఏ వ్యక్తీ మరో స్ర్తివంక కనె్నత్తి చూడటానికి భయపడేలా ఉండాలి. టీ.వి. సీరియల్స్, సినిమాలపై ఆంక్షలు విధించాలి. పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ విద్యార్థులకు విధిగా నైతిక విలువలు నేర్పాలి. తోటి స్ర్తిలపట్ల సోదరభావాన్ని పెంపొందించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
రైతుల సమస్యలపై శ్రద్ధ చూపాలి
మన ముఖ్యమంత్రిగారు రైతుల సమస్యలపై శ్రద్ధపెట్టాలి. పైర్లు పెట్టే సీజన్ వచ్చింది. అక్కడక్కడ వర్షాలు బాగానే పడుతున్నాయి. రైతులకు కావలసిన రుణాలు, విత్తనాలు, ఎరువులు, మందులు సులభంగా, తక్కువ ధరలకు దొరికేటట్లు చర్యలు తీసుకోవాలి. సకాలంలో ఇవి సమకూర్చకపోతే పైర్లు పెట్టడం కష్టం. సీజన్ అయిపోయిన తర్వాత విత్తనాలు, రుణాలు మొదలైనవి ఇస్తే లాభం వుండదు. గిట్టుబాటు ధరలు లేక వరదలు, కరువులవల్ల రైతులు దెబ్బతింటున్నారు. నష్టాలు వస్తే రైతులు వ్యవసాయాన్ని విడచిపోతారు. ఇప్పటికే అన్ని వసతులున్న కోనసీమ ప్రజలే క్రాప్ హాలీడే ప్రకటిస్తున్నారు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతుల దుస్థితి ఎవరు తీరుస్తారు? కాబట్టి రాజకీయ అంశాలు పక్కనపెట్టి రైతుల పరిస్థితులు మెరుగుపరచి, ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు
ఉద్యోగులకు తెల్ల కార్డులా?
ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు, తెల్లరేషన్ కార్డులు ఇస్తు న్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. 10వేల నుండి 60వేలు జీతాలు తీసుకుంటున్న ప్రైవేటు ఉద్యోగస్తులకు, తెల్లరేషన్ కార్డులున్నాయి. వీరికి, తెల్లరేషన్ కార్డులు ఎపెందుకు ఇస్తు న్నారు?