ఉత్తరాయణం

హిందూ ధర్మాన్ని రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయాల, మఠాల, సత్రాల భూములు ఆం.ప్ర. వారు 2000 ఎకరాల వక్ఫ్ ఆస్తులను గుర్తించి రు.1,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని రాబట్టబోతున్నారు. అదేవిధం గా ఎన్నో వేల ఎకరాల ఆలయాల, మఠాలు సత్రాల భూ ములు అన్యాక్రాంతంలో ఉన్నాయి. వీటిని కూడా గుర్తిం చి, పూర్తి ఆదాయాన్ని రాబట్టవచ్చు. ఈవిధంగా చేస్తే హిం దూ ధర్మప్రచారం ఇంటింటా ప్రచారం జరిగి హిందూ ధర్మాన్ని రక్షించవచ్చు. మత మార్పిడులను ఆపకపోతే, తిరిగి దేశ విభజన రోజులు రావచ్చు. హిందూ సమాజానికి రక్షణ లేక గాలిలో దీపం గతి పట్టినది. 1950లో హిం దూ కోడ్ పెట్టిన పాలకులు, హిందూ ధర్మరక్షణకు బాధ్యు లే. ధార్మిక మండలులను పటిష్టం చెయ్యాలి. స మృద్ధిగా సొమ్ముని ఇవ్వాలి.
- ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం
ఆ నిధులు ఏం చేస్తారు?
యుపిఎ ప్రభుత్వం తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించినట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అందువలన ఈ భాషాభివృద్ధికి కేంద్రం 100 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కూడా తెల్పింది. అప్పుడు అధికారంలో వున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యాలయం ఏర్పాటుచేయడం గాని, సిబ్బందిని నియమించడం గాని చేయలేదు. ఇంతలో రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు అయ్యాయి. ఏ రాష్ట్రం ఈ 100 కోట్ల రూపాయలను వినియోగించి తెలుగు భాషాభివృద్ధి చేస్తాయి అనేది ఇప్పటి ప్రశ్న. ఇందులో రూ. 58 కోట్లు ఆంధ్ర రూ.42 కోట్లు తెలంగాణ విభజించుకొని సద్వినియోగం చేస్తాయో తెలియదు. ఎవరూ ముందుకు రాకపోతే 100 కోట్ల రూపాయలు తిరిగి కేంద్రానికి వెళ్లిపోతాయి. మేము ఇచ్చాము, మీరు ఖర్చుచేయలేదా అని అనడానికి ఆస్కారమిచ్చినట్లవుతుంది. అసలు ఈ ప్రాచీన భాషా కేంద్రం యిప్పుడు ఎక్కడుంది? కేంద్ర నిధులు ఎలా సద్వినియోగమవుతున్నాయి. ఈ వివరాలు అందరికి తెలపాలి.
- కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
ఉగ్రవాదానికి అంతమెప్పుడు!
ఈ దేశంలో జన్మించి, దేశంను కన్నతల్లిగా భావించాల్సిన ప్రజలు కొందరు పొరుగు దేశ ఉగ్రవాదుల వివిధ సంస్థల సభ్యులుగా చేరి భారత్‌లో దాడులు చేసి అమాయకులను హతమార్చడమేకాక అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. దేశ విభజన తర్వాత మత కల్లోలాలు సృష్టించడం దేశంలో ఏదో ప్రాంతాల్లో చోటుచేసుకొంటున్నాయి. భారతదేశం శాంతికాముకతను ప్రదర్శిస్తూ అన్ని దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకొనేందుకు సతతం కృషిచేస్తున్నా ఉగ్రవాదులకు పూర్తి అండదండగా కొందరు దేశద్రోహులు అల్లర్లు సృష్టిస్తూ అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకొంటూ దేశ ప్రగతికి అడ్డుగోడలుగా నిలుస్తున్నారు. ఇహపోతే జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు వారి సానుభూతిపరులకు ఆలవాలమై తరచూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు. కేంద్రం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మో పాలి.
- జి.వి.రత్నాకర్‌రావు, హనుమకొండ

యూనిఫామ్‌లు అవసరం
కేంద్రం మరియు అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులు యూనిఫారాలు ధరించడం చాలా మంచిది. ప్రతి రాష్ట్రం ఒక్కొక్క యూనిఫారాన్ని నిర్ణయంచాలి. అలాగే కేంద్రం సపరేటు యూనిఫారాలు అమలు పరచాలి. ముఖ్యమం త్రి, స్పీకర్లు, ప్రతిపక్ష నాయుడికి ఎమ్‌ఎల్‌ఏలు ధరించే యూనిఫారం కాకుండా వారికి సపరేట్ యూనిఫారాలు ధరింపచేయాలి.
- ఎం.వి.ఎం.సాత్విక్, కావలి
అలంకారానికేనా?
జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా పల్లె ప్రాంతాలలో ప్రజలు రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు నిర్మించారు. అయితే ఇవి నిరుపయోగంగా, అలంకారప్రాయంగా ఉంటున్నాయి. జనాలు రోడ్డమీదనే నడుచుకుంటూ రోడ్డు దాటేస్తున్నారు. దీంతో అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా అన్ని గ్రామాలలో ప్రజలు రోడ్డు దాటాలంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా దాటేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే డివైడర్ల ఎత్తు పెంచి, దట్టంగా చెట్లను పెంచాలి. రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డు దాటనీయకుండా చూడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
బెజవాడగా పేరు మార్చాలి
విజయవాడకి 70 సం.ల క్రితం వరకూ ‘బెజవాడ’ అనే పేరు ఉండేదిట. ఎవరు ఎప్పుడు ఎందుకు విజయవాడగా మార్చారో ఎవరికీ తెలియదు! కాని విజయవాడ అన్న పేరు పలకటానికి, రాయటానికి చాలా ‘్భరంగా’ ఉంది! కాబట్టి విజయవాడ పేరుని బెజవాడగా మార్చితే బాగుంటుంది.
- ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్